Gundeninda Gudigantalu Serial: భర్తను మోసం చేసిన మీనా.. నిప్పులు చెరిగిన ప్రభావతి.. బాలు పనిష్‌మెంట్.. సత్యంకు బిగ్ షాక్
Gundeninda Gudigantalu Serial Promo: గుండెనిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలు తండ్రి సత్యంని ఎలాగైనా విడిపిస్తాను అని సెల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, బాలును ఎస్సై అడ్డుకుంటాడు. రవి పెళ్లికి మీనా సాక్షి సంతకం పెట్టిందని అందరికీ తెలుస్తుంది.
Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మీనా ఎస్సైతో మాట్లాడుతుంది. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు అని మీనా చెబుతుంది. కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్‌లోని జైలులో సత్యం నిస్సహాయంగా నిల్చుని ఉంటాడు.
సెల్ ఓపెన్ చేసేందుకు
ఇంతలో అక్కడికి బాలు వస్తాడు. బాలుతో పాటు కుటుంబం అంతా సత్యం దగ్గరికి వస్తారు. నేను వచ్చాను నాన్నా. నీకేం కాదు. నిన్ను బయటకు తీసుకొస్తాను అని బాలు అంటాడు. సెల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తాడు బాలు. హలో హలో ఏం చేస్తున్నావ్ అని అక్కడున్న ఎస్సైని బాలును వారిస్తాడు.
ఇన్ఫర్మేషన్ దొరికిందా
మా నాన్న ఏం చేశాడని ఆయనను లోపల ఉంచారు సార్ అని బాలు ఆవేదనగా, కంగారుగా అడుగుతాడు. దాంతో సురేంద్ర అమ్యాని కనిపించకుండా పోయిన విషయం, సత్యంపై కైసు ఫైల్ చేసిన విషయం ఎస్సై చెప్పినట్లుగా తెలుస్తోంది. తర్వాత గుడికి ఎంక్వైరీకి వెళ్లిన కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. వీళ్ల అమ్మాయి వెళ్లిన గుడికి వెళ్లి వచ్చావ్ కదా. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని కానిస్టేబుల్‌ను ఎస్సై అడుగుతాడు.
మీనా ఎవరు
చాలా పెద్ద ఇన్ఫర్మేషనే దొరికింది సార్ అని కానిస్టేబుల్ అంటాడు. గుడిలోని రిజిస్టర్ చూపిస్తూ.. వీళ్ల అమ్మాయి శ్రుతికి.. వాళ్ల అబ్బాయి రవికి ఈరోజు గుళ్లో పెళ్లి జరిగిపోయింది సార్ అని కానిస్టేబుల్ అంటాడు. దాంతో జైలులో ఉన్న సత్యం అవాక్కవుతాడు. సురేంద్ర, శోభన షాక్ అయి చూస్తారు. బాలు, ప్రభావతి కూడా షాక్ అవుతారు. తర్వాత మీనా ఎవరు అని ఎస్సై అడుగుతాడు.
సాక్షి సంతకం పెట్టింది
నా భార్య సార్ అని బాలు చెబుతాడు. సాక్షి సంతకం తనే చేసింది అని ఎస్సై చెబుతాడు. దాంతో అంతా ఒక్కసారిగా ఖంగుతింటారు. అయితే, ఇప్పటికే రవిని కంటపెట్టమని మీనాకు బాలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రవి, శ్రుతి పెళ్లిని మీనానే దగ్గరుండి చేయించిందని, తనను మోసం చేసిందని తెలిసిన తర్వాత బాలు చాలా ఆవేశపడతాడు.
నేరం చేసినదానిలా
మీనాపై కోపం పెంచుకుంటాడు. మీనాకు బాలు పనిష్‌మెంట్ ఇస్తాడని తెలుస్తోంది. అలాగే, మరోవైపు మీనాపై ప్రభావతి నిప్పులు చెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మీనా అంటే పడని ప్రభావతి మరిన్ని సూటిపోటి మాటలతో కాల్చుకుతింటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతవరకు ఎలాంటి తప్పు చేయని మీనా రవి పెళ్లితో పెద్ద నేరం చేసినదానిగా అవుతుంది.
ఇదివరకు లాగానే
దాంతో అత్తింట్లో మీనాకు మనోజ్, రోహిణి, ప్రభావతి నుంచి మర్యాద ఉండకపోవచ్చు. అలాగే, తండ్రి చేయని నేరానికి జైలుకి వెళ్లాడని, దానికి కారణం మీనానే అని బాలు రగిలిపోవచ్చు. మీనా చేసిన పనికి సత్యం ఎలా రియాక్ట్ అవుతాడో కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. ఇప్పటివరకు మీనాపై కోడలిగా అభిమానం ఉన్న సత్యం ఇదివరకు లాగానే చూస్తాడా అనేది తెలియాలి.
పోలీస్ కంప్లైంట్
ఇదిలా ఉంటే, గుండెనిండా గుడిగంటలు సీరియల్ గత ఎపిసోడ్‌లో రవి శ్రుతిలు ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారు. గుడిలో సంజుకు శ్రుతి కనిపంచకోవడంతో.. ఇంటికెళ్లి అదే విషయం చెబుతాడు. దాంతో ఆపాటికే రవిపై అనుమానం ఉన్న సురేంద్ర సత్యం ఇంటికెళ్లి గొడవ చేస్తాడు. కాలర్ అది పట్టుకుని రచ్చ రచ్చే చేస్తాడు. తన కూతురు మిస్ అయిందని పోలీస్ కంప్లైట్ ఇవ్వడంతో సత్యంను పోలీసులు అరెస్ట్ చేస్తారు.
టాపిక్