Aho Vikramaarka: కీరవాణిని అలా అడగాల వద్దా అనుకున్నా.. మగధీర కో డైరెక్టర్ త్రికోటి కామెంట్స్-dev gill aho vikramarka director trikoti comments on mm keeravani he is co director of magadheera worked with rajamouli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aho Vikramaarka: కీరవాణిని అలా అడగాల వద్దా అనుకున్నా.. మగధీర కో డైరెక్టర్ త్రికోటి కామెంట్స్

Aho Vikramaarka: కీరవాణిని అలా అడగాల వద్దా అనుకున్నా.. మగధీర కో డైరెక్టర్ త్రికోటి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 29, 2024 10:35 AM IST

Director Trikoti About Dev Gill Aho Vikramaarka: మగధీర సినిమాతో విలన్‌గా చాలా పాపులర్ అయిన యాక్టర్ దేవ్ గిల్ హీరోగా చేస్తున్న సినిమా అహో విక్రమార్క. దిక్కులు చూడకు రామయ్య ఫేమ్ డైరెక్టర్ త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా అహో విక్రమార్క విశేషాలను త్రికోటి పంచుకున్నారు.

కీరవాణిని అలా అడగాల వద్దా అనుకున్నా.. మగధీర కో డైరెక్టర్ త్రికోటి కామెంట్స్
కీరవాణిని అలా అడగాల వద్దా అనుకున్నా.. మగధీర కో డైరెక్టర్ త్రికోటి కామెంట్స్

Dev Gill Aho Vikramaarka Director Trikoti: బ్లాక్‌బస్టర్ 'మగధీర'లో విలన్‌గా ఆకట్టుకున్న నటుడు దేవ్ గిల్. మగధీరతోపాటు పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన దేవ్ గిల్ ఇప్పుడు హీరోగా పరిచయం కానున్నారు. దేవ్ గిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా అహో విక్రమార్క.

అహో విక్రమార్కతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ మీద నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రదర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

* నేను మగధీరకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ టైంలోనే దేవ్ గిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ టైంలో నేనే అతనికి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించేవాడ్ని. అప్పటి నుంచి మా మధ్య మంచి బంధం ఉంది. హీరోగా ఓ సినిమా చేయాలని దేవ్ గిల్ ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ, నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆర్ఆర్ఆర్ కోసం పని చేస్తున్న టైంలో దేవ్ గిల్ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడు. పూణెలో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేశాడు.

* దేవ్ గిల్‌కు విలన్ ఇమేజ్ ఉంది. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని హీరోగా తెరపైకి తీసుకు రావాలంటే ఎలాంటి జానర్ చేయాలని చాలా అనుకున్నాం. ఫ్యామిలీ, ఎమోషన్ ఇలా ఏది చేసినా అంత కుదరదని అనుకున్నాం. చివరకు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో కథను నడిపిస్తే బాగుంటుందని ఈ కథను అనుకున్నాం. విజయేంద్ర ప్రసాద్ వద్ద పని చేసిన వర్మ ఈ కథను అద్భుతంగా రాశారు. దేవ్ గిల్ తన ఇన్ పుట్స్ కూడా ఇస్తుండేవాడు.

* ఇందులోని పోలీస్ ఆఫీసర్ ఆంధ్రా నుంచి పుణెకు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అలా ఈ కథ అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. హిందీ, మరాఠీ, తెలుగు ఇలా అన్ని భాషల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది.

* ఇందులో హీరోయిన్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. లెక్చరర్ పాత్రలో హీరోయిన్ కనిపిస్తారు. ఓ తెలుగమ్మాయి అయితే బాగుంటుందని చిత్రా శుక్లాని తీసుకున్నాం. ఆమె చక్కగా నటించారు.

* ఈ కథ కమర్షియల్‌గా దేవ్ గిల్‌కు ఎలా సెట్ అవుద్దో అలా మలిచాను. నేను చేసిన దిక్కులు చూడకు రామయ్య బాగా ఆడింది. జువ్వా అంతగా ఆకట్టుకోలేదు. ఇది నాకు మూడో సినిమా. దీంతో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

* ఈ సినిమాకు మ్యూజిక్ కోసం ముందుగా చాలా మందిని అనుకున్నాను. బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి ఇలా అనుకున్నాం. ఒక దశలో కీరవాణి గారిని అడగాలా? వద్దా? అని అనుకున్నాను. కానీ, దేవ్ గిల్ తనకున్న పరిచయంతో రవి బస్రూర్‌ను తీసుకొచ్చారు. ఆయన ఈ కథ విని, సినిమా చూసి మంచి కమర్షియల్‌గా ఉందని అన్నారు. కానీ, టైం కావాలని అన్నారు. ఆయన అద్భుతమైన మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు.

* ఓ విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుంది అనేది కథ. ఇందులో కాస్త మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. రియల్ సతీష్ గారు ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు. మంచి అవుట్ పుట్ ఇచ్చారు.