Heroine Affairs: పెళ్లైన ముగ్గురితో తెలుగు స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్- వారిలో ఇద్దరు హీరోలు, ఓ స్టార్ క్రికెటర్!-telugu star heroine nagma love relationship with 3 married men like sourav ganguly sarathkumar ravi kishan into politics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroine Affairs: పెళ్లైన ముగ్గురితో తెలుగు స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్- వారిలో ఇద్దరు హీరోలు, ఓ స్టార్ క్రికెటర్!

Heroine Affairs: పెళ్లైన ముగ్గురితో తెలుగు స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్- వారిలో ఇద్దరు హీరోలు, ఓ స్టార్ క్రికెటర్!

Sanjiv Kumar HT Telugu
Aug 27, 2024 04:38 PM IST

Heroine Nagma Love Relationships: పైళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ ఎఫైర్ పెట్టుకుని గతంలో హాట్ టాపిక్‌గా మారిన తెలుగు స్టార్ హీరోయిన్ నగ్మా. చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా 1990 కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. నగ్మా లవ్ ఎఫైర్స్‌ రూమర్స్‌లోకి వెళితే..

పెళ్లైన ముగ్గురితో తెలుగు స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్- వారిలో ఇద్దరు హీరోలు, ఓ స్టార్ క్రికెటర్!
పెళ్లైన ముగ్గురితో తెలుగు స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్- వారిలో ఇద్దరు హీరోలు, ఓ స్టార్ క్రికెటర్!

Telugu Star Heroine Love Affairs: కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించి భాగీ సినిమాతో మొదట బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది నగ్మా. సల్మాన్ ఖాన్‌తో చేసిన భాగీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత అమితాబ్ బచ్చన్, చిరంజీవి వంటి సూపర్ స్టార్‌లతో కలిసి పనిచేసింది నగ్మా.

అంతేకాకుండా హిందీతోపాటు తెలుగు, తమిళ చిత్రాల్లో 1990 కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగింది నగ్మా. అయితే, సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన నగ్మా తన వ్యక్తిగత జీవితంలో లవ్ ఎఫైర్ రూమర్స్ సైతం బాగానే నెగెటివిటీని తీసుకొచ్చాయి. కాగా నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ.

అత్యధిక వసూళ్లు

నగ్మా బాలీవుడ్ మూవీ బాఘీలో సల్మాన్ ఖాన్‌తో కలిసి సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా 1990లో హిందీ చిత్రసీమలోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన ఏడో చిత్రంగా రికార్డ్ కొట్టింది. దాంతో మొదటి సినిమాతోనే నగ్మా స్టార్‌గా మారింది. ఆ తర్వాత లాల్ బాద్‌షా వంటి అనేక హిట్ హిందీ చిత్రాలలో నటించింది నగ్మా.

ఆ తర్వాత హిందీలో కింగ్ అంకుల్ వంటి కల్ట్ క్లాసిక్‌లలో కూడా నటించింది నగ్మా. అంతేకాకుండా తెలుగులో ఘరానా మొగుడు మూవీ ద్వారా 1992లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నగ్మా. ఇందులో చిరంజీవితో జోడీ కట్టిన నగ్మా ఆ తర్వాత వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, రాజశేఖర్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించింది.

పెళ్లయిన రెండేళ్లకు

ఇదిలా ఉంటే, నగ్మా భారత స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమ వ్యవహారం నడిపిందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. సౌరవ్‌కు వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత 1999లో ప్రపంచ కప్ సందర్భంగా వారిద్దరు కలుసుకున్నారు. అలాగే చెన్నైకి దూరంగా ఉన్న ఓ ఆలయంలో ఈ ఇద్దరు కనిపించినట్లు వార్తలు వచ్చినట్లు సమాచారం.

దీంతో సౌరవ్, నగ్మా రిలేషన్‌షిప్‌పై పెద్ద ఎత్తున చర్చలు జరిగినట్లు, దాంతో వారిద్దరూ వార్తల్లో నిలిచినట్లు సమాచారం. అయితే, సౌరవ్ భార్యకు వారి రిలేషన్‌షిప్ గురించి తెలియడంతో వారు విడిపోయారని టాక్. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో బిజీగా మారింది నగ్మా. ఈ క్రమంలోనే అప్పట్లో తమిళ స్టార్ హీరో శరత్ కుమార్‌తో నగ్మా ప్రేమలో పడినట్లు సమాచారం.

అయితే, అప్పటికే అతని కూడా వివాహం అయింది. కాబట్టి వారి వ్యవహారం కూడా అప్పట్లో హైలెట్ అయింది. శరత్ కుమార్ భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసిందని, పరిస్థితి మరింత దిగజారకముందే నగ్మా, శరత్‌ విడిపోయిందని పలు కథనాలు వెలువడినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి తర్వాత భోజ్‌పురిలో హీరోగా చేసిన నటుడు, పొలిటిషియన్ రవికిషన్‌తో కూడా నగ్మా లవ్ ట్రాక్ నడిపిందని సమాచారం.

అన్నీ రూమర్స్?

అప్పటికే పెళ్లయిన రవికిషన్, నగ్మా లవ్ వ్యవహారం కూడా సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసిందని పలు వెబ్‌సైట్స్ కథనాలు ప్రచురించాయట. తర్వాత ఇదివరకు లాగే రవికిషన్‌కు కూడా నగ్మా బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, 49 ఏళ్ల వయస్సు గల నగ్మా ఇప్పటికీ ఒంటరిగా ఉండటం గమనార్హం. కాగా నగ్మా లవ్ ఎఫైర్స్‌ అన్ని రూమర్స్ అనే మరో ప్రచారం కూడా ఉంది.

ఇదిలా ఉంటే, నగ్మా రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా పాల్గొంది. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన నగ్మా 2008లో సినిమాలకు స్వస్తి చెప్పి తన పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని కొనసాగించింది. ఆమె 2004లో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మీరట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 42,911 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది నగ్మా.