Brahmamudi October 9th Episode: బ్రహ్మముడి- కనకంకు క్యాన్సర్- కావ్య రాజ్ కాపురం నిలబెట్టేందుకు అపర్ణ, ఇందిరాదేవి ప్లాన్-brahmamudi serial october 9th episode aparna indiradevi kanakam plan to save raj kavya relation brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 9th Episode: బ్రహ్మముడి- కనకంకు క్యాన్సర్- కావ్య రాజ్ కాపురం నిలబెట్టేందుకు అపర్ణ, ఇందిరాదేవి ప్లాన్

Brahmamudi October 9th Episode: బ్రహ్మముడి- కనకంకు క్యాన్సర్- కావ్య రాజ్ కాపురం నిలబెట్టేందుకు అపర్ణ, ఇందిరాదేవి ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Oct 09, 2024 07:29 AM IST

Brahmamudi Serial October 9th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో అనామికకు దొరికిపోయిన కనకం ఇచ్చిపడేసి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత కావ్య గురించి రాజ్ కలవరిస్తుంటాడు. అది తెలిసిన ఇందిరాదేవి, అపర్ణ వారి కాపురం నిలబెట్టేందుకు కనకంతో ప్లాన్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో లేబర్ ఆఫీసర్‌ కనకేశ్వరిగా అనామిక ఆఫీస్‌లో రైడ్ చేస్తుంది కనకం. కానీ, అనామికకు దొరికిపోతుంది. సీసీ టీవీ ఫుటేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం పదా అని సురేష్‌తో అంటుంది అనామిక. ఎందుకని కనకం అంటే.. కనకం అనే కిలాడీ లేడీ ఆఫీసర్‌గా వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ దొంగలించడం నేరం కదా. పోలీసులకు అప్పజెపితే నిన్ను, నీ కూతురుని జైలుకు పంపిస్తారు అని అనామిక అంటుంది.

ఫైర్ అయన కనకం

దాంతో కనకం కంగారుపడితే.. కంగారుపడకండి. అగ్రిమెంట్ పేపర్స్ నాకు ఇచ్చి.. బుద్ధిగా ఇంటికి వెళ్లి నీ కూతురు నా కంపెనీలో పని చేసేందుకు ఒప్పించు. ఊరికేం వద్దు. మీరు ఊహించని జీతం ఇస్తాను. మీరు అగ్రిమెంట్ ఇస్తారా.. నేను లాక్కోనా అని అనామిక అంటుంది. దాంతో టేబుల్‌పై అగ్రిమెంట్ పేపర్ పెడుతుంది కనకం. ఇలాగే వెళ్లి నీ కూతురుని పంపించు అని అనామిక అంటుంది. పంపించకపోతే ఏం చేస్తావే. దుగ్గిరాల వారసుడుని కాదనుకుని జైలుకు వెళ్లినదానివి. వాళ్లమీద పగతో ఇంకొకడితే చేతులు కలిపినదానివి అని కనకం ఫైర్ అవుతుంది.

నువ్వు నన్ను బెదిరిస్తావా. నువ్ నా ఇంటికి ముందు వచ్చి గిజ గిజ తన్నుకు చచ్చినా సరే. నీ ఆఫీస్‌కు నా కూతురును పంపించను అని కనకం అంటుంది. బాగా తెగించినట్లున్నావ్. నేను తల్చుకుంటే అని అనామిక అంటే.. ఎహే ఆపు.. నువ్ తల్చుకుంటే ఏం చేయలేవు. నీకే నా సంగతి తెలియదు. నీ మాజీ అత్త ధాన్యలక్ష్మీని, ఆ ఇంట్లో పడి అడుక్కు తింటున్న రుద్రాణిని అడుగు చెబుతారు. నా గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు అని కనకం వార్నింగ్ ఇస్తుంది.

నీ అగ్రిమెంట్ నీ మొహానే పడేశావో చూశాను కదా. నా కూతురును ఎలా రప్పిస్తావో నేను చూస్తాను. ఏం పీ.. అనబోయిన కనకం చేసుకుంటావో చేసుకో అని అనామికకు ఇచ్చి పడేసి వెళ్లిపోతుంది కనకం. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానా అని అనామిక అనుకుంటుంది. మరోవైపు ఇంటికి దొంగచాటుగా వెళ్తుంది కనకం. అది కావ్య చూసి పిలుస్తుంది. ఎక్కడికి వెళ్లి వస్తున్నావని అడుగుతుంది. న్యాయాన్ని గెలిపించేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు అని కనకం మాట్లాడుతుంది.

అగ్రిమెంట్ లేకుండా చేద్దామని

మా ఇంటికి వెళ్లి వచ్చావా అని కావ్య అడిగితే.. కాదని.. అక్కడికి ఎందుకు వెళ్తాను. ఇది వేరే న్యాయపోరాటం అని కనకం అంటుంది. నీ మాటలు చూస్తుంటే ఏదో చేసి వచ్చావ్. అదేంటో చెప్పు. నాన్న వచ్చేలోపే చెప్పు అని కావ్య అంటుంది. పక్షి తన గుడ్లను కాపాడుకునేందుకు ఏం చేస్తుందో అదే చేశాను. కానీ, చిన్న తప్పు జరిగింది. అనామిక ఆఫీస్‌కు వెళ్లాను అని కనకం చెబుతుంది. అగ్రిమెంట్‌నే లేకుండా చేద్దామని ఆలోచించి.. లేబర్ ఆఫీసర్‌గా వెళ్లి అనామికకు దొరికిపోయానని కనకం చెబుతుంది.

దాంతో కావ్య కోప్పడుతుంది. నిన్ను జైలుకు పంపిస్తుందేమోనని భయపడిపోయానే. కానీ, పాల గిన్నెల బల్లి పడ్డట్లు అనామిక ఊడిపడిందే. అది మనల్ని జైలుకు పంపిస్తానందే అని కనకం అంటుంది. నేనేందుకు వెళ్తాను. నువ్వెళ్లు. ఇప్పుడే కడుపునిండా అన్నం పెడతాను. రేపటినుంచి జైల్లో చిప్పకూడే అని కావ్య అంటుంది. అలా అనకే. ఇప్పుడేమైనా ప్లాన్ ఉందా. నేను ఇరగదీస్తాను అని కనకం అంటుంది. ఇప్పటికీ చేసింది చాలు. అది నేను చూసుకుంటాను. ఇప్పుడైతే తిందాం అని కావ్య అంటుంది.

కట్ చేస్తే.. రాజ్ పక్కలోకి కావ్య వెళ్లి కప్పుకున్న దుప్పటి తీస్తుంది. రాజ్‌ను డిస్టర్బ్ చేస్తుంది. దాంతో రాజ్ లేస్తాడు. పక్కన ఉన్న కావ్యను చూసి షాక్ అవుతాడు రాజ్. ఏ మొహం పెట్టుకుని వచ్చావని రాజ్ అంటే.. కందిపప్పు మొహం పెట్టుకుని అని కావ్య అంటుంది. చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఎలా వచ్చావ్ అని రాజ్ అంటాడు. నీ మనసాక్షిని అడగండి. నిజంగా నేను తప్పు చేశానని అనుకుంటున్నారా అని కావ్య అంటుంది. లేదు. కానీ, ఇదంతా నా కళ్ల ముందే జరగింది అని రాజ్ అంటాడు.

ముద్దుముద్దుగా కావ్య మాటలు

మీరు నన్ను వదిలేశారు. బతుకుతెరువు కోసం ఉద్యోగం వెతుక్కుంటే వాళ్లు మోసం చేశారు అని కావ్య అంటుంది. నేను నిన్ను వదిలేయలేదు. నువ్వే ఇంత పెద్ద డైలాగ్స్ కొట్టి వెళ్లిపోయావ్ అని రాజ్ అంటాడు. నేను వెళ్తే దవడ పగులగొట్టి తీసుకురావాలి కదా అని కావ్య అంటుంది. నీకే అంత పొగరు ఉంటే నాకెంత ఉండాలని రాజ్ అంటాడు. ప్రతిసారి తిడుతుంటే ఎలా అని రాజ్ బుగ్గ గిల్లుతుంది కావ్య. దాంతో రాజ్ కూడా కావ్య బుగ్గ గిల్లుతాడు. ఇద్దరూ కాసేపు గిల్లుకుంటారు.

రాజ్‌ను గట్టిగా హగ్ చేసుకుంటుంది కావ్య. నేను నిజంగా మీకు ద్రోహం చేయలేదండి. మీరంటే నాకు ప్రాణమండి. మీరు కోపంలో ఎన్ని మాటలు అన్నారో తెలుసా. నేను అలాంటిదాన్ని కాదండి. నన్ను నమ్మండి అని చాలా ముద్దుముద్దుగా అంటుంది కావ్య. ముందు కరిగిపోయినా రాజ్ తర్వాత ఏంటిది అని వదిలించుకుంటాడు. నాకు ఇంత ద్రోహం చేసిన నిన్ను ఎలా ఊరుకుంటాను. వెళ్లు.. వెళ్లిపో.. అని నిద్రలో అరుస్తాడు రాజ్. ఇంతలో మెళకువ వస్తుంది.

ఇదంతా కల. కలలో కూడా నిన్ను క్షమించను అని హాల్లోకి వచ్చి సోఫాపై పడుకుంటాడు రాజ్. ఏవండి.. నేను చెప్పేది వినండి అని కావ్య మాటలు వినిపిస్తాయి. వామ్మో అనుకుని దుప్పటి గట్టిగా కప్పుకుని పడుకుంటాడు రాజ్. మరుసటి రోజు ఉదయం రాజ్ సోఫాలో పడుకోవడం చూసి ఇందిరాదేవి, అపర్ణ షాక్ అవుతారు. రాజ్‌ను నిద్రలేపుతారు. దాంతో రాజ్ కంగారుపడతాడు. ఇక్కడ పడుకున్నావేంటీ అని అడుగుతారు.

తాతయ్య లాగే రాజ్

ఇప్పుడు కళావతి గుర్తుకువచ్చి ఇక్కడ పడుకున్నాను అంటే నాతో ఆడుకుంటారు అని ఏసీ పనిచేయట్లేదు. దోమలు ఎక్కువగా ఉన్నాయని రాజ్ అంటాడు. దోమలు ఎక్కడ ఉన్నాయని అపర్ణ అంటే.. కిటికీలు తెరిచాను. వచ్చాయని రాజ్ అంటాడు. అర్థమైంది. ఇన్నిరోజులు కావ్యతో పడుకుని అలవాటు అయి తను గుర్తుకు వచ్చి ఇక్కడికి వచ్చి పడుకున్నావు కదా అని ఇందిరాదేవి అంటుంది. తను లేకుంటే నాకు నిద్ర పట్టదా. తన పేరు ఎత్తొద్దు అంటే ప్రతిసారి తీసుకొస్తారు అని రాజ్ అంటాడు.

నువ్ అబద్ధం చెబుతున్నా నీ మొహంలో కనిపిస్తోంది. అన్ని తాతయ్య లాగే. నేను మొదటిసారి పురుడుకోసం వెళ్తే తాతయ్య కూడా నేను గుర్తొచ్చి ఆరు బయట పడుకునేవారట అని ఇందిరాదేవి అంటుంది. నువ్వంటే పురుడు పోసుకోడానికి వెళ్లావ్. కళావతి ద్రోహం చేసి వెళ్లిపోయిందని రాజ్ వెళ్లిపోతాడు. వీడిని చూస్తుంటే భయమేస్తుంది. రోజు రోజుకి మరింత దూరం పెరిగేలా ఉంది అని అపర్ణ అంటుంది. వీళ్లిద్దరు ఒక్కచోట ఉంటే కలిసే అవకాశం ఉందని ఇందిరాదేవి అంటుంది.

వాళ్లు చూసుకోడానికే ఇష్టపడట్లేదు. కలిసి ఒక్కచోట ఎలా ఉంటారు అని అపర్ణ అంటుంది. ఇంతలో ఇద్దరూ ఒక్కసారి కనకం పేరు తీస్తారు. ఇలాంటివన్ని కనకం బాగా చేస్తుంది అని తనను కలవలాని అనుకుంటారు. గుడిలో కొట్టిన కొబ్బరికాయను కూర్చుని అచ్చం కోతిలా తింటుంది కనకం. అది ఇందిరాదేవి, అపర్ణ వచ్చి చూస్తారు. నీలో కనపడకుండానే కోతి లక్షణాలు ఉన్నాయని ఇందిరాదేవి అంటుంది. మీరు రాకపోయేసరికి అని కనకం అంటుంది.

కనకంకు క్యాన్సర్

దేనికోసం రమ్మన్నారు అని కనకం అడుగుతుంది. అపర్ణ సెటైర్లు వేస్తుంది. నీ కూతురు కాపురం గురించి అని అపర్ణ అంటుంది. నీ కూతురు రమ్మంటే రాదు.. నా కొడుకు పిలవడు అని అపర్ణ అంటే.. ఇలాగే ఉంటే ఎలా. పెద్దవాళ్లగా ఎలా వదిలేస్తాం. రుద్రాణి ఇప్పటికే భర్తను వదిలేసింది. అనామిక విడాకులు తీసుకుంది అని ఇందిరాదేవి అంటుంది. అలాంటివాళ్లతో నా కోడలిని పోల్చకండి అని అపర్ణ అంటుంది. నా కూతురు భర్తకు ప్రేమ లేకుండా వచ్చింది అని కనకం అంటుంది.

కావ్య, రాజ్ కలపడం గురించి ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్‌తో మీ అత్తగారికి క్యాన్సర్ అని అపర్ణ బాధపడినట్లుగా చెబుతుంది. కట్ చేస్తే శాలువ కప్పుకుని క్యాన్సర్ పేషంట్‌లా కనకం డ్రామా డ్రామా ఆడుతుంది. అదంతా రాజ్ చూస్తాడు. మీ ఆఖరి కోరిక ఏంటో చెప్పండి అని రాజ్ అంటాడు. నా ముగ్గురు కూతుళ్లు తమ భర్తలతో కలిసి నా చివరాఖరి పెళ్లి జరుపుకోవాలని ఉంది బాబు అని కనకం చెబుతుంది. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు.

Whats_app_banner