Brahmamudi October 4th Episode: అనామిక చెంప పగులకొట్టిన కావ్య- సామంత్‌కూ అదే వార్నింగ్- భార్య గుర్తులు తగలబెట్టిన రాజ్-brahmamudi serial october 4th episode kavya slaps anamika and gives warning to saamanth brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 4th Episode: అనామిక చెంప పగులకొట్టిన కావ్య- సామంత్‌కూ అదే వార్నింగ్- భార్య గుర్తులు తగలబెట్టిన రాజ్

Brahmamudi October 4th Episode: అనామిక చెంప పగులకొట్టిన కావ్య- సామంత్‌కూ అదే వార్నింగ్- భార్య గుర్తులు తగలబెట్టిన రాజ్

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial October 4th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌లో తన నమ్మకంపై దెబ్బ కొట్టిందని, ఉన్న కాస్తా ప్రేమ చచ్చిపోయిందని కావ్యతో కోపంగా చెప్పి వెళ్లిపోతాడు రాజ్. తమతో చేరితే దుగ్గిరాల ఇంటి పతనానికి మార్గం చూపిస్తామని కావ్యతో అనామిక అంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఎక్స్‌పోలో సామంత్ గ్రూప్‌కు అవార్డ్ రావడం కావ్య వల్లే అని తెలియడంతో రాజ్ కోప్పడుతాడు. మీరు చూసిందేది నిజం కాదని కావ్య అంటుంది. ఏది నిజం కాదు. నువ్ డిజైన్స్ వేసింది నిజం కాదా. నా ప్రత్యర్థికి డిజైన్స్ ఇచ్చింది నిజం కాదా. ఇక్కడున్న నాకు ఏం చెబుతావ్. ఇక్కడ లేనివాళ్లకు అందంగా చెప్పు అని రాజ్ అంటాడు.

మా సంస్థకు ద్రోహం చేయాలని అనుకున్నావ్ అంటే.. ఇంతనమ్మినా నా కుటుంబ సభ్యులను మర్చిపోయావంటే ఇది నేను నీలో చూడని కొత్త కోణం. నీకు నా కుటుంబం మీద ఇంత పగ ఉందని.. ఇంత గొప్పగా రివేంజ్ తీర్చుకుంటావని అనుకోలేదు అని చప్పట్లు కొడతాడు రాజ్. కాదు, అది నా వ్యక్తిత్వం కానేకాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కలలో కూడా ఎవరికీ ద్రోహం చేయాలనుకోను. ఎందుకు నన్ను ప్రతి విషయంలోనూ అపార్థం చేసుకుంటున్నారు అని కావ్య అంటుంది.

ముగుడుకే వెన్నుపోటు

అత్తయ్య విషయంలో అలా నింద వేశారు. ఇప్పుడు నేను కావాలనే మీ ఓటమి కోసం పని చేశానని అంటున్నారు. దీని వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయో నిజంగానే నాకు తెలియదు అని కావ్య అంటుంది. చాలు ఆపు. కుట్రలు చేసింది నువ్వు. రాజ్‌కు ద్రోహం చేసింది నువ్. కంపెనీకి అవార్డ్ రాకుండా చేసింది నువ్. డబ్బుకోసం ఇంత దిగజారుతావా. మొగుడునే వెన్నుపోటు పొడుస్తావా. ఇన్నాళ్లు నేను చెబితే వినలేదు. ఇప్పుడు ఏమంటారు అని రుద్రాణి అంటుంది.

నిజాలు తెలుసుకోకుండా దొరికింది కదా అని అనకండి అని కావ్య అంటుంది. ఇంకా ఏం తెలుసుకోవాలి. నువ్ వెళ్లిపోయినా నీ ఇంటికి వచ్చాడు. వాడి మనసు ముక్కలు చేశావ్. పదేళ్లుగా దక్కించుకుంటున్న అవార్డ్ దక్కకుండా చేశావ్. మీడియా ముందు ఇంటి గుట్టు మొత్తం రట్టు చేశావ్. మాట్లాడితే ఇంటి పరువు కాపాడటానికే పుట్టినట్లు మాట్లాడేదానివి. నువ్ ఇవాళ చేసినదానికి దుగ్గిరాల పరువు మొత్తం పోయింది. దీనికి కారణం ఎవరు నువ్ కాదా అని రుద్రాణి రెచ్చిపోతుంది.

నీ బుద్ధి ఇదని తెలియకా.. మా వదినా ఇంకా ఇంటికి తీసుకురావలనుకుంటుంది. ఈ విషయం తెలిస్తే చీదరించుకుంటుంది అని రుద్రాణి అంటుంది. ఆపండి రుద్రాణి గారు. ఆ అనామిక ఏం చేసిందో తెలుసా అని కావ్య అంటే.. ఏం చేసింది. ఆ అనామిక నిన్ను చేరదీసింది. నిన్ను ఉసిగొలిపింది. నువ్ మోస పోయావ్ అని రాజ్ అంటాడు. నేను మోసపోయిందే నిజం అని కావ్య అంటే.. కాదని రాజ్ వారిస్తాడు. నన్ను మోసం చేశావన్నదే నిజం అని రాజ్ అంటాడు.

నమ్మకం మీద దెబ్బ

నేను కోపానికి శత్రుత్వానికి తేడా తెలియనిదానిని కాదు. ఇంత దారుణంగా దెబ్బ కొట్టాలని కాదు. నన్ను మీరు ఎప్పుడు అర్థం చేసుకోరు అని కావ్య అంటుంది. అవసరమే లేదు. నిన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకుంటే నేను ఏమైపోతానో అర్థం కావట్లేదు. నాకు అవార్డ్ పోయిందని బాధపడట్లేదు. అదంతా నాలుగు రోజుల్లో సంపాదించుకోగలను. కానీ, నువ్ నా నమ్మకం మీద దెబ్బకొట్టావ్. ఇది జీవితంలో మర్చిపోలేని గుణపాఠం. నీ మీద ఏ మూలనో ఉన్న ప్రేమ కాస్తా చచ్చిపోయింది అని రాజ్ అంటాడు.

ఇంకెప్పుడు నాకు ఎదురుపడకు అని రాజ్ వెళ్లిపోతాడు. కావ్య బతిమిలాడిన వినకుండా వెళ్లిపోతాడు రాజ్. కావ్య ఏడుస్తూ ఉంటుంది. విన్నావుగా.. ఇంకా వాడుగానీ, మా కుటుంబంగాని ఈ జీవితంలో నిన్ను దగ్గరకు రానిచ్చేదే లేదు. రా స్వప్న అని సంతోషంగా వెళ్లిపోతుంది కావ్య. స్వప్న కూడా వెళ్లిపోతుంది. సుభాష్ వెళ్లిపోతుంటే.. మావయ్య గారు అని కావ్య పిలుస్తుంది. వద్దమ్మా నాకేం చెప్పకు. నేను రాజ్‌లాగో, రుద్రాణిలాగో మాట్లాడలని లేదు అని సుభాష్ అంటాడు.

నేను ఏది నమ్మాలి. ఇదంతా నిజం కాదని నాకు నమ్మాలని ఉంది. కానీ, ఇదంతా నా ముందే జరిగింది. నా కొడుకు మనసు మారి నిన్ను తీసుకొస్తాడని అనుకున్నాం. కానీ, ఆశ లేకుండా చేశావ్ కదమ్మా. ఇప్పుడు వాడికి ఎలా సర్దిచెప్పను అని సుభాష్ వెళ్లిపోతాడు. కావ్య నడుచుకుంటూ వెళ్తుంటే అనామిక, సామంత్ ఎదురుపడతారు. కంగ్రాచ్యులేషన్స్ కావ్య అని అనామిక అంటే.. మీరు బిగించిన ఉచ్చులో అమాయకంగా చిక్కుకున్నందుగా అని కావ్య అంటుంది.

పతనం అయిపోవాలని

నీ ప్రతిభకు. అజ్ఞాతంలో ఉన్న నీ ప్రతిభను మా కంపెనీయే ముందుకు తీసుకొచ్చింది అని అనామిక అంటుంది. ఇవాళ నాకంటూ ఓ క్యారెక్టర్ లేనట్లు నువ్ రుజువు చేశావ్. నా భర్త మనసులో పాతాళంలో పడ్డాను అని కావ్య అంటుంది. నీ క్యారెక్టర్ ఏమిచ్చింది. బంధాలు ఏమిచ్చాయి అని సామంత్ అంటాడు. అందరూ అనామికలా ఉండరు సామంత్. నేను బంధాలతో నా భర్తతో ఉందామనుకున్నా. ఇవన్ని కాదనుకుని అనామికలా పతనం అయిపోవాలని అనుకోలేదు అని కావ్య అంటుంది.

ఇవన్నీ బతకడానికి పనికిరావు. నువ్ కూడా ఇలాగే అంటే కవిలాగే రోడ్డు మీద పడతావ్. ఆ ఇంట్లో నాకు రోజూ అవమానాలే. ఇప్పుడు చూడా నాకు నచ్చినట్లు ఉన్నాను. నేను త్వరలో సామంత్‌ను పెళ్లి చేసుకోబోతున్నాను అని అనామిక అంటుంది. విడాకులు తీసుకున్న స్త్రీ రెండో పెళ్లి చేసుకోకూడదు అని నేను అనుకోను. కానీ, నీ విషయం వేరు. నువ్ కేవలం దుగ్గిరాల కంపెనీని పతనం కోసమే సామంత్ దగ్గర చేరావని అర్థమైంది అని కావ్య అంటుంది.

బంధంతో కూడిన బాంధవ్యానికి, అవసరంతో కూడిన బంధానికి చాలా తేడా ఉంది. పగకోసం పతనమైపోతావ్ జాగ్రత్త అని కావ్య అంటుంది. ఇంకా నువ్ నీతులు చెప్పడం మానలేదా. దానివల్ల ఏం లాభం లేదు. నీ ప్రతిభ వల్ల నువ్ గుర్తింపు పొందావ్ అని అనామిక అంటుంది. చాల్లే ఆపు. ఇది కూడా ఓ గుర్తింపా. అసలు నా ఇష్టం లేకుండా నా డిజైన్స్ వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు. మోసం చేసి గెలిచారు. మోసపోయి నేను ఓడిపోయాను. నావల్ల దుగ్గిరాల వారికి వ్యాపారపరంగా నష్టం జరిగింది. కుటుంబపరంగా పరువుపోయిందని కావ్య అంటుంది.

అనామికను కొట్టిన కావ్య

నేను ఆ ఇంటి చెడు కోరుకునేదాన్ని కాదు. వ్యక్తిగతంగా మచ్చ పడకుండా బతకాలని అనుకున్నాను అని కావ్య అంటుంది. మా కంపెనీతో చేయి కలిపితే నువ్వే కాదు. మీ కుటుంబం కూడా గొప్ప స్థానంలో ఉంటారు. నీకు నీ భర్త పనిమనిషికి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వలేదు. అలాంటి వాడు నడిపే సంస్థను నేలమట్టం చేసి నువ్వేంటో నిరూపించుకో. అందుకు సరైన మార్గం మేము చూపిస్తాం అని అనామిక అంటుంది. ఏమన్నావ్ అని అనామికను లాగి కొడుతుంది కావ్య.

హేయ్ అని ముందుకు వచ్చిన సామంత్‌ను కూడా రేయ్.. నీ చెంపలు కూడా పగులుతాయ్. దూరంగా ఉండు. ఒక వ్యక్తిత్వం లేని ఆడదాన్ని అడ్డుపెట్టుకుని ఒక మహా సామ్రజ్యాన్ని కూల్చాలని చూస్తున్నావ్. దాని వేరు కూడా కూల్చలేరని త్వరలోనే తెలుస్తుంది అని కావ్య అంటుంది. ఇంకా నీకు పొగరు తగ్గలేదా. ఇంట్లోంచి గెంటేసిన తెలిసిరాలేదా అని అనామిక అంటుంది. ఇంట్లోంచి గెంటేసింది నిన్ను. నేను నా అస్తిత్వం కోసం బయటకొచ్చాను. ఆ తేడా నీకెలా తెలుస్తుందిలే అని కావ్య అంటుంది.

ఈ నీతి సూత్రాలు పట్టకుని వేలాడుతూ నీ చావు నువ్ చావు. నువ్ మాతో చేతులు కలపకపోయినా సరే నీ అత్తింటిని నేలమట్టం చేస్తాను అని అనామిక అంటుంది. అలా చేస్తే నీకు అడుగడుగునా నేను అడ్డం ఉంటాను. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అనామిక. మరోవైపు ఇంటికి రాజ్ వస్తాడు. ఏంట్రా ఇది అని అపర్ణ అంటే.. ఆ కళావతి నిజ స్వరూపం అని రాజ్ అంటాడు. అది ఎంత వికృతంగా ఉందో అర్థమైందా అని రుద్రాణి అంటుంది.

మన కళ్లే మోసం చేస్తాయి

ఎందుకిలా జరిగింది. నీకు వ్యతిరేకంగా పనిచేయడం ఏంటీ. నా కోడలు అలా చేయదురా అని అపర్ణ అంటుంది. ఇంకోసారి తన పేరు ఇంట్లో వినపడకూడదు అని రాజ్ అంటాడు. ఆవేశపడకురా. నీకు, మన కుటుంబానికి కావ్య ద్రోహం చేస్తుందని నేను అనుకోవడం లేదు అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మా.. నన్ను ఇంకా మాయలోకి తోయాలని చూడకుండి. అంతా నా కళ్లముందే జరిగింది. తను డిజైన్స్ అమ్మడం, దానివల్ల అవార్డ్ రావడం, దాన్ని కళావతి అందుకోవడం నిజం అని రాజ్ అంటాడు.

ఒక్కోసారి మన కళ్లే మనల్నీ మోసం చేస్తాయి రాజ్ అని ప్రకాశం అంటాడు. అంతేకానీ కావ్య మోసం చేయదు. తనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. సన్మానించండి. ఇప్పుడు కుటుంబం పరువును ఏం చేసింది అని రుద్రాణి అంటుంది. వ్యక్తిగత కోపాన్ని వృత్తి, వ్యాపారంపై చూపించింది. కళావతి ఇంటికి తీరని నమ్మకోద్రోహం చేసింది అని చెప్పిన రాజ్.. కావ్య బట్టలు, పెళ్లి ఫొటోలు తగలబెడతాడు.