Brahmamudi July 4th Episode: రాజ్‌కు అవమానం - కావ్యను తప్పుపట్టిన ధాన్యలక్ష్మి - రుద్రాణి నోరు మూయించిన స్వప్న
Brahmamudi July 4th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో కోర్టు బయటకు వచ్చిన కళ్యాణ్‌పై టామాటలు, కోడిగుడ్లతోదాడిచేయిస్తుంది రుద్రాణి. తమ్ముడికి అవమానం జరగకుండా రాజ్ అడ్డుగా నిలబడతాడు. మరోవైపు అప్పు కోర్టుకు వెళ్లడానికి కనకం ఒప్పుకోదు.
Brahmamudi July 4th Episode: కళ్యాణ్ తనను టార్చర్ పెట్టాడని అతడిపై కేసు పెట్టడమే కాకుండా కోర్టు ను ఆశ్రయిస్తుంది అనామిక. ఈ కేసులో కళ్యాణ్ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. కళ్యాణ్...అనామికను టార్చర్ పెట్టలేదు... కావాలనే ఆమె ఇదంతా చేస్తుంది అని చెప్పడానికి ఏదైనా ఒక బలమైన సాక్ష్యం కావాలని కళ్యాణ్ తరఫు లాయర్ అంటాడు. అనామికను కళ్యాణ్ కొట్టాడని సాక్ష్యాలు ఉన్నాయి. మీ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడని లాయర్ చెబుతాడు. కోర్టుకు సాక్ష్యాలే ముఖ్యమని అంటాడు.
అనామిక ఎంట్రీ...
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన అనామిక...సమాధానం చెప్పే సాక్ష్యాలు వాళ్ల దగ్గర ఏం లేవని దెప్పిపొడుపుగా మాట్లాడుతుంది. నా మొగుడు నాతో ప్రేమగా ఎప్పుడు నడుచుకోవాలేదని కళ్యాణ్‌ను ఎగతాళి చేస్తుంది. ఏమంటావు కళ్యాణ్ అని భర్తను నిలదీస్తుంది.
కోడలిగా కూతురిగా...
కోడలిపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. నిన్ను కోడలిగా కాకుండా నా కూతురిగా చూసుకున్నానని, ఎన్ని తప్పులు చేసిన వెనకేసుకొచ్చినందుకు ఈ రోజు బాగా బుద్దిచెప్పావని అనామికను దులిపేస్తుంది. ధాన్యలక్ష్మిని అనామిక అత్తయ్య అని పిలుస్తుంది. నన్ను అలా పిలిచే అర్హత ఎప్పుడో కోల్పోయావని ధాన్యలక్ష్మి కోపంగా అంటుంది.
కళ్యాణ్ నాకు క్షమాపణలు చెప్పాలి...
నేను తలచుకుంటే మీ సమస్యలన్నీ తీర్చగలనని అనామిక చెబుతుంది. కళ్యాణ్ నాకు క్షమాపణలు చెప్పి మళ్లీ మీ ఇంటికి తీసుకెళతానంటే ఇప్పుడే కేసును వెనక్కి తీసుకుంటానని అనామిక అంటుంది. నువ్వు ప్రేమించానంటే ఓ సారి నమ్మి మోసపోయా.
మరోసారి మోసపోవడానికి తాను సిద్ధంగా లేనని అనామికకు కళ్యాణ్ బదులిస్తాడు. అయితే లాయర్ చెప్పినట్లు సాక్ష్యాలు సంపాదించుకొండి అని ఎగతాళిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక. ఏం జరిగిన నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండమని కళ్యాణ్‌కు రాజ్ ధైర్యం చెబుతాడు.
రుద్రాణి స్కెచ్...
కోర్టు బయట కళ్యాణ్‌ను అవమానించేందుకు రుద్రాణి స్కెచ్ వేస్తుంది. మహిళ సంఘం వారిలో తన మనుషులు ముగ్గురిని పెట్టి కోర్టు బయటకు వచ్చిన కళ్యాణ్‌పై టామాటలు, కోడిగుడ్లతో దాడిచేయిస్తుంది. కళ్యాణ్‌కు టామాటలు, కోడిగుడ్లు తగలకుండా రాజ్ అడ్డుగా నిలబడతాడు.
నా తమ్ముడికి వేయాలని అనుకుంటున్న శిక్ష నాకు వేయండి అంటాడు. రాజ్‌ను కూడా టామాటలు, ఎగ్స్‌తో కొడతారు. ఆ సీన్ చూసి రుద్రాణి, అనామిక హ్యాపీగా ఫీలవుతారు. నన్ను, నా కొడుకును ఎదగడకుండా అడ్డుపడుతోన్న రాజ్‌కు ఈ శిక్ష పడాల్సిందేనని రుద్రాణి అంటుంది. మీరందరూ నమ్మిన అనామిక తప్పుడు మనిషి అని, ఆమెను నమ్మి మీరు తప్పుచేశారని, నిజం బయటపడిన రోజు మీరే పశ్చాత్తప పడతారని మహిళ సంఘం వారితో రాజ్ అంటాడు.
కనకం ఎమోషనల్...
అప్పు కోర్టుకు రావాలని జడ్జ్ చెప్పిన మాట విని కనకం కోపం పట్టలేకపోతుంది. కళ్యాణ్, అనామిక విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కితే తన కూతురు కోర్టు ఎందుకు వెళ్లడం అని భర్తతో వాదిస్తుంది. తాను కోర్టుకు వెళ్లకపోతే అనామిక ఆరోపించినట్లు తనకు కళ్యాణ్‌కు సంబంధం ఉందని నిజం ఒప్పుకున్నట్లే అవుతుందని అప్పు అంటుంది.
అనామిక చెప్పిన మాటల్లో నిజం ఉంది కాబట్టే నేను తప్పించుకొని తిరుగుతున్నానని నాకు శిక్ష పడుతుందని కనకంతో చెబుతుంది అప్పు. కోర్టుకు వెళ్లి తీరుతానని, అక్కడ ఏ గొడవ జరిగిన తాను చూసుకుంటానని అప్పు అంటుంది. అప్పు వెంట కోర్టుకు వెళ్లాలని కనకం నిర్ణయించుకుంటుంది.
దుగ్గిరాల ఫ్యామిలీ బాధ...
అనామిక కారణంగా ఇంటి పేరు, వంశ గౌరవం బజారున పడిందని సీతారామయ్య, ఇందిరాదేవి బాధపడతారు.కళ్యాణ్ ఇష్టపడ్డాడని అనామిక కుటుంబ స్థితిగతుల గురించి కూడా ఆలోచించకుండా మనవడితో ఆమె పెళ్లి చేసినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నామని ఇందిరాదేవి అంటుంది. కళ్యాణ్ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే అనామికకు అందరం కలిసి క్షమాపణ చెప్పి ఆమెను తిరిగి ఇంటికి తీసుకొద్దామని ధాన్యలక్ష్మి అంటుంది.
అనామిక మన కుటుంబంపై కక్ష గట్టిందని, ఆమెను తిరిగి ఇంటికి తీసుకొస్తే పక్కలో పామును పెట్టుకొని పడుకున్నట్లే అవుతుందని, ఏ క్షణం ఏ ఆపద తలపెడుతుందో తెలియక అందరం భయపడుతూ బతకాల్సివస్తుందని ధాన్యలక్ష్మికి అపర్ణ సర్ధిచెబుతుంది.
పరువు ప్రతిష్టల గురించే...
కుటుంబ పరువు ప్రతిష్టల గురించే అందరూ ఆలోచిస్తున్నారని, నా కొడుకును ఎవరూ పట్టించుకోవడం లేదని ధాన్యలక్ష్మి అనగానే ప్రకాశం కోపం పట్టలేకపోతాడు. నువ్వు చేసిన అలుసు వల్లే అనామిక అలా తయారైందని, పెళ్లి జరిగిన తర్వాత ఏ రోజు కళ్యాణ్ పడుతోన్న బాధను పట్టించుకోలేదని ధాన్యలక్ష్మికి క్లాస్ ఇస్తాడు ప్రకాశం. మహిళా సంఘాల వాళ్లు మీడియా...ఒక్క కళ్యాణ్ గురించే కాదు...ఈ ఇంట్లోని ప్రతి ఒక్కరిని బాధ్యులను చేసి మాట్లాడుతున్నారని ధాన్యలక్ష్మిపై ఫైర్ అవుతాడు.
ఇంటిని ముక్కలు చేస్తుంది..
అనామికకు క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకొస్తే నాలుగు రోజుల్లోనే ఇంటిని ముక్కలు చేసిన కళ్యాణ్‌ను మన అందరికి దూరంగా తీసుకెళ్లిపోతుందని రాజ్ అంటాడు. కళ్యాణ్‌కు ఏ శిక్ష పడకుండా ఇంటికి తీసుకురావడానికి అందరూ ప్రయత్నిస్తున్నారని, ఇందులో ఒకరు ఎక్కువ...మరొకరు తక్కువ అనే బేధాలు లేవని ధాన్యలక్ష్మికి సర్ధిచెబుతుంది కావ్య. అపార్థాలతో అనామిక లాగే మీరు మాట్లాడితే ఎలా అని కావ్య అంటుంది.
మీ కుటుంబమే కారణం...
ఎంత చెప్పిన ధాన్యలక్ష్మి మాత్రం వినదు. కళ్యాణ్ కష్టాల్లో పడటానికి నీ చెల్లి, మీ కుటుంబమే కారణం అని కావ్య మనసును నొప్పిస్తుంది ధాన్యలక్ష్మి. అనామిక ఈ కుటుంబం మీద ఆరోపణలు చేసినట్లు మీరు మా కుటుంబం మీద ఆరోపణలు చేయద్దని ధాన్యలక్ష్మితో అంటుంది కావ్య. అలా చేస్తే మీకు, ఆ తెలివి తక్కువ అనామికకు ఏం తేడా లేదని చెబుతుంది.
స్వప్న వార్నింగ్...
కావ్యపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. అప్పటివరకు సైలైంట్‌గా ఉన్న స్వప్న నోరు తెరుస్తుంది. ప్రతి సారి ఏంటి మా కుటుంబం మీద పడతారు. మీకు దమ్ము, ధైర్యం లేవా? కోడలిని అదుపులో పెట్టుకోవడం చాతా కాదా అని ధాన్యలక్ష్మిని దులిపేస్తుంది. కోర్టులో నోరు ఎందుకు తెరవలేదని క్లాస్ ఇస్తుంది.
మధ్యలో రుద్రాణి జోక్యం చేసుకొని ధాన్యలక్ష్మికి సలహా ఇవ్వబోతుంది. మధ్యలో మీ బోడి సలహా ఎవరూ అడగలేదు, అసలు అనామికను చెడగొట్టింది రుద్రాణినేనని అసలు నిజం బయటపెడుతుంది స్వప్న. మా అమ్మను అంటే ఊరుకునేది లేదని రాహుల్ అంటాడు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా జైలుకు పంపిస్తానని స్వప్న వార్నింగ్ ఇస్తుంది.
సాక్ష్యాలు సంపాదిద్దాం...
కళ్యాణ్‌ను ఎలాగైనా నిర్దోషిగా నిరూపించేలా సాక్ష్యాలు సంపాదిద్దామని రాజ్ అంటాడు. న్యాయం మన పక్షానే ఉంది కాబట్టి కళ్యాణ్‌ను తిరిగి ఇంటికి తీసుకొద్దామని రాజ్ చెబుతాడు. అప్పటివరకు గాబరా పడకుండా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వమని, లేదంటే నీ కోడలు ముందు అందరం తలదించుకొని బతకాల్సివస్తుందిప్రకాశం అంటాడు.
అప్పులను తీర్చడం కోసమే...
అనామికను కలుస్తుంది కావ్య. తండ్రి చేసిన అప్పులను తీర్చడం కోసమే అనామిక కళ్యాణ్‌ను కోర్టుకు పంపించిందని నిజం బయటపెడుతుంది కావ్య. అవునని అనామిక ఒప్పుకుంటుంది. జైలు దాకా వెళితేనే కళ్యాణ్ దిగివస్తాడని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.