Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్ - రిజెక్ట్ చేసిన మెగాస్టార్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ మూవీలో వి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విలన్‌గా నటించాల్సింది. కానీ విలన్ పాత్రలో నటించడానికి ఇష్టపడని మమ్ముట్టి ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు.

Mammootty: ఓ భాష హీరోలు... మరో భాషలో విలన్స్ క్యారెక్టర్స్‌లో కనిపించే ట్రెండ్ ప్రజెంట్ దక్షిణాదిలో పాపులర్‌గా మారింది. మలయాళం, తమిళంతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ తెలుగు సినిమాల్లో తమ విలనిజంతో భయపెడుతోన్నారు. . ఉప్పెనలో విజయ్ సేతుపతి, పుష్ప2లో ఫహాద్ ఫాజిల్ తో పాటు చాలా మంది స్టార్స్ విలన్స్ క్యారెక్టర్స్‌లో మెప్పించారు. అయితే. పదేళ్ల క్రితమే ఈ ట్రెండ్‌ను తెలుగులో సెట్ చేయాలని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నారు.
జల్సా సినిమాలో విలన్...
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన జల్సా సినిమాలో మమ్ముట్టిని విలన్‌గా తీసుకోవాలని నిర్మాత అల్లు అరవింద్ భావించారు. కానీ విలన్ పాత్రలో నటించడానికి ఇష్టపడని మమ్ముట్టి అల్లు అరవింద్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. మమ్ముట్టి విలన్ రోల్‌ను రిజెక్ట్ చేసిన విషయాన్ని గతంలో ఓ ప్రెస్‌మీట్‌లో స్వయంగా అల్లు అరవింద్ వెల్లడించారు.
చిరంజీవి విలన్ రోల్…
మమ్ముట్టి హీరోగా నటించిన ఓ మలయాళ మూవీ తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా తాను నిర్మించే ఓ సినిమాలో విలన్ పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించానని అల్లు అరవింద్ చెప్పారు. నెగెటివ్ షేడ్స్‌తో సాగే మంచి క్యారెక్టర్ అని, ఈపాత్ర మీరే చేయాలని మమ్ముట్టిని రిక్వెస్ట్ చేసినట్లు అల్లు అరవింద్ తెలిపాడు.
ఈ విలన్ పాత్రను చిరంజీవిని చేయమని నువ్వు అడగగలవా అని మమ్ముట్టి తనకు ఆన్సర్ ఇచ్చారని అల్లు అరవింద్ పేర్కొన్నాడు. చిరంజీవిని నేను ఆ మాట అడగలేనని అనగానే మరి నన్ను ఎందుకు అడుగుతున్నావని మమ్ముట్టి రిప్లై ఇచ్చాడని అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు. పవర్‌ఫుల్ ఆన్సర్‌తో పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్‌ను మమ్ముట్టి రిజెక్ట్ చేశాడని అల్లు అరవింద్ చెప్పాడు. మమ్ముట్టి రిజెక్ట్ చేసిన ఆ రోల్‌ను ముఖేష్ రిషితో చేయించారు దర్శకనిర్మాతలు.
విలన్‌గా మమ్ముట్టి...
ఇతర హీరోల సినిమాల్లో విలన్‌గా నటించకూడదని రూల్ పెట్టుకున్న మమ్ముట్టి తాను హీరోగా నటించిన సినిమాల్లో మాత్రం నెగెటివ్ షేడ్ క్యారెక్టర్స్ చాలానే చేశాడు.రోషాక్, పురు భ్రమయుగంతో పాటు పలు మలయాళ సినిమాల్లో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్స్‌లో అసమాన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అలా వైకుంఠపురములో ఫేమ్ జయరాం హీరోగా నటించిన మలయాళం మూవీ అబ్రహం ఓజ్లర్ సినిమాలో సీరియల్ కిల్లర్‌గా గెస్ట్ రోల్ చేశాడు మమ్ముట్టి.
టర్బోతో హిట్...
మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ మూవీ టర్బో ఇటీవల రిలీజైంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నా కమర్షియల్‌గా మాత్రం నిర్మాతలకు లాభాలను మిగిల్చింది. యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను మమ్ముట్టి స్వయంగా నిర్మించాడు గత కొన్నాళ్లుగా ప్రయోగాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోన్న మమ్ముట్టి ఈ మూవీలో మాత్రం మాస్ రోల్‌లో కనిపించాడు.
సమంత...నయనతార...
ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మలయాళ, తమిళ బైలింగ్వల్ మూవీ తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో సమంత, నయనతార హీరోయిన్లుగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాపిక్