Brahmamudi May 1st Episode: కోడ‌లితో ధాన్య‌ల‌క్ష్మి తెగ‌తెంపులు - భ‌ర్త నాట‌కానికి కావ్య చెక్‌ - రుద్రాణి శాడిజం-brahmamudi may 1st episode dhanyalaxmi argues anamika for filing case against kalyan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 1st Episode: కోడ‌లితో ధాన్య‌ల‌క్ష్మి తెగ‌తెంపులు - భ‌ర్త నాట‌కానికి కావ్య చెక్‌ - రుద్రాణి శాడిజం

Brahmamudi May 1st Episode: కోడ‌లితో ధాన్య‌ల‌క్ష్మి తెగ‌తెంపులు - భ‌ర్త నాట‌కానికి కావ్య చెక్‌ - రుద్రాణి శాడిజం

Nelki Naresh Kumar HT Telugu
May 01, 2024 07:33 AM IST

Brahmamudi May 1st Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో త‌న‌కు సీతారామ‌య్య రాసిచ్చిన ఆస్తి పేప‌ర్స్ క‌నిపించ‌క‌పోవ‌డంతో స్వ‌ప్న కంగారు ప‌డుతుంది. వాటిని స్వ‌ప్న‌నే మార్వాడీ వ‌ద్ద తాక‌ట్టుపెట్టి అప్పు తీసుకున్న‌ట్లునిరూపించి కోడ‌లిని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని రుద్రాణి ప్లాన్ వేస్తుంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi May 1st Episode: క‌ళ్యాణ్‌, అప్పుపై కేసు పెట్టిన విష‌యంలో అనామిక‌ను స‌పోర్ట్ చేసిన ఆమె త‌ల్లిదండ్రులు కావ్య‌పై నింద‌లు వేస్తారు. క‌ళ్యాణ్, అప్పుల ల‌వ్‌స్టోరీని వెనుక‌నుండి నువ్వే న‌డిపిస్తున్నావ‌ని కావ్య‌తో అంటారు. కావ్య వారిపై ఫైర్ అవుతుంది.

అనామిక గ‌న‌క కేసు వాప‌స్ తీసుకోక‌పోతే త‌న భ‌ర్త ద‌గ్గ‌ర మీరు తీసుకున్న రెండు కోట్ల అప్పు బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టి మిమ్మ‌ల్ని జైలుకు పంపిస్తాన‌ని వార్నింగ్ ఇస్తుంది. కావ్య వార్నింగ్‌తో అనామిక త‌ల్లిదండ్రులు కాళ్ల‌బేరానికి వ‌స్తారు. అనామిక చేత కేసును విత్‌డ్రా చేయిస్తారు. దాంతో అప్పు, క‌ళ్యాణ్ పోలీస్ స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కువ‌స్తారు.

అనామిక బిల్డ‌ప్‌లు...

క‌ళ్యాణ్‌పై కేసు పెట్టిన అనామిక‌పై దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ ఫైర్ అవుతారు. కేసు పెట్టి నువ్వు సాధించింది ఏం లేద‌ని అనామిక‌తో అంటుంది స్వ‌ప్న‌. ఇంట్లో అంద‌రిని టార్చ‌ర్ పెట్టావు. చివ‌ర‌కు మీ అమ్మ‌నాన్న‌ల‌ను పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు ర‌ప్పించావు అంటూ అనామిక‌ను ఎగ‌తాళి చేస్తుంది స్వ‌ప్న‌. తాను చేసిన ప‌నికి ఇక‌పై జీవితంలో అప్పు, క‌ళ్యాణ్ క‌ల‌వ‌రు, ఒక్క చెంప దెబ్బ కొట్టినందుకే ఇంత చేశాను. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంద‌ని అనామిక బిల్డ‌ప్‌లు ఇస్తుంది.

చెంప ప‌గ‌ల‌గొట్టిన స్వ‌ప్న‌...

ఒక్క చెంప దెబ్బ కొట్టినందుకే ఇంత చేశావా అంటూ... కూల్‌లో అనామిక ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన స్వ‌ప్న‌...ఆమె చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టిస్తుంది. నా చెల్లిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినందుకు ఈ దెబ్బ అని అంటుంది. అనామిక కూడా స్వ‌ప్న‌ను కొట్ట‌డానికి చెయ్యేత్తుతుంది. ఆమె చేతిని స్వ‌ప్న అడ్డుకుంటుంది.

ఇంకోసారి నా చెల్లి జోలికి వ‌స్తే ఏం చేస్తానో నాకే తెలియ‌ద‌ని అంటుంది. ఇక‌నైనా ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకొని ఉండ‌మ‌ని హెచ్చ‌రిస్తుంది. నేను కొట్టాన‌ని అప్పు మీద‌కుమ‌ళ్లీ గొడ‌వ‌కు వెళ‌తావేమో...అది ఒక్క‌సారి వ‌దిలేస్తుంది. రెండోసారి అయితే గొంతుపై కాలు పెట్టి తొక్కేస్తుంది అని అనామిక‌ను మ‌రింత భ‌య‌పెడుతుంది స్వ‌ప్న‌.

అప్పుకు క‌ళ్యాణ్ ఫోన్‌...

గొడ‌వ‌ల గురించి ప‌ట్టించుకోకుండా అప్పుకు ఫోన్ చేస్తాడు క‌ళ్యాణ్‌. గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని ఫోన్ చేయ‌డం మానేస్తే మ‌న త‌ప్పు చేసిన‌ట్లు అవుతుంద‌ని అప్పుతో అంటాడు.. త‌న వ‌ల్ల పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చిన అప్పుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు క‌ళ్యాణ్. అప్పుతో క‌ళ్యాణ్ మాట్లాడుతుండ‌టం అనామిక చూస్తుంది.

ఇంత జ‌రిగిన నీకు సిగ్గు లేదా అంటూ భ‌ర్త‌పై ఫైర్ అవుతుంది. మాట్లాడుతాను. మ‌ళ్లీ మ‌ళ్లీ అప్పుతో మాట్లాడుతాను. ఏం చేస్తావు అరెస్ట్ చేయిస్తావా...అప్పు విష‌యంలో ఎవ‌రు చెప్పిన విన‌ను. నువ్వు చెబితే అస‌లు విన‌ను అని అనామిక‌కు క్లాస్ ఇస్తాడు క‌ళ్యాణ్.

నీ ప్రేమ నిజ‌మ‌ని న‌మ్మాను...

పెళ్లికి ముందు నువ్వు చెప్పిన మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మాను. నీ ప్రేమ ఎప్ప‌టికీ అలాగే ఉంటుంద‌ని భ్ర‌మ‌ప‌డ్డాను. కానీ నేను మోస‌పోయాన‌ని తెలుసుకున్నాను. జీవితంలో నిన్ను ఎప్ప‌టికీ క్ష‌మించ‌న‌ని అనామిక‌తో చెబుతాడు క‌ళ్యాణ్‌. తాను ఎప్ప‌టికీ మార‌న‌ని ఇలాగే ఉంటాన‌ని అనామికకు చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఎలా క్ష‌మించ‌వో నేను చూస్తాన‌ని అనామిక మ‌న‌సులో భ‌ర్త‌తో ఛాలెంజ్ చేస్తుంది.

కావ్య‌పై సెటైర్స్‌...

కావ్య ఇంటి ప‌నుల‌తో బిజీగా ఉంది. స‌మ‌స్య‌లు తీరిపోయిన‌ట్లు ఉన్నాయి. ప్ర‌శాంతంగా క‌నిపిస్తున్నావ‌ని కావ్య‌పై సెటైర్ వేస్తుంది రుద్రాణి. మీరు ఉండ‌గా ప్ర‌శాంత‌త ఎక్క‌డుంటుంది అని ధీటుగా కావ్య బ‌దులిస్తుంది. రాజ్ నిజం చెప్ప‌డానికి ఇంకో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. దాని గురించి ఏం ప్లాన్ చేశారో తెలుసుకుందామ‌ని వ‌చ్చాన‌ని కావ్య‌తో అంటుంది రుద్రాణి. మీరే చెప్పండి ఏం చేయాలోన‌ని రుద్రాణిని అడుగుతుంది కావ్య‌.

రాజ్ ఎలాగో నిజం చెప్ప‌డు కాబ‌ట్టి మీరు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డం ఖాయం. రాజ్‌కు ఆత్మాభిమానం, నీకు పొగ‌రు ఎక్కువ అని కావ్య‌తో అంటుంది రుద్రాణి. కావ్య సీరియ‌స్‌గా చూడ‌టంతో మాట మార్చేసి అభిమానం ఎక్కువ అని చెబుతుంది. స‌డెన్‌గా రోడ్డు మీద ప‌డితే ఎక్క‌డుంటారు.

ముందుగానే మ‌రో ఇళ్లు చూసుకుంటే మీకే మంచిద‌ని పెద్ద‌దానిగా స‌ల‌హాలు ఇస్తున్నాన‌ని కావ్య‌తో అంటుంది రుద్రాణి. మేము ఇంట్లో నుంచి వెళ్లిపోతామ‌ని మీరు చాలా ఆశ ప‌డుతున్న‌ట్లున్నారు. కానీ మీరు అనుకున్న‌ది ఏది జ‌ర‌గ‌ద‌ని రుద్రాణికి బ‌దులిస్తుంది. త‌న భ‌ర్త‌ను ఇంటి గ‌డ‌ప దాట‌కుండా అత్త‌గారే కాదు అవ‌స‌ర‌మైతే దేవుడితో కూడా పోరాడుతాన‌ని రుద్రాణితో అంటుంది కావ్య‌.

ఫ్ల‌వ‌ర్ బొకే...

రాజు కారును డ్రైవ‌ర్ క్లీన్ చేస్తుంటాడు. కారులో నుంచి ఓ ఫ్ల‌వ‌ర్ బొకే కింద‌ప‌డుతుంది. మై డియ‌ర్ క‌ళావ‌తి హ్యాపీ యానివ‌ర్స‌రీ అని ఆ ఫ్ల‌వ‌ర్ బొకేపై రాసి ఉంటుంది. పెళ్లి రోజు త‌న‌కు ఇవ్వ‌డానికి ప్రేమ‌తో రాజ్ కొన్న బొకే అది అని కావ్య అర్థం చేసుకుంటుంది. రాజ్ త‌న‌కు ఫ్ల‌వ‌ర్ బొకే ఇచ్చే లోపు ఏదో జ‌రిగిన‌ట్లు ఉంద‌ని కావ్య అనుకుంటుంది. అదేమిటో తెలుసుకోవాల‌ని అనుకుంటుంది.

ధాన్య‌ల‌క్ష్మి క్లాస్‌...

అనామిక‌కు ధాన్య‌ల‌క్ష్మి ఎదురప‌డుతుంది. అత్త‌తో అనామిక మాట్లాడాల‌ని అనుకుంటుంది. కానీ ధాన్య‌ల‌క్ష్మి మాత్రం ఏం మాట్లాడ‌కుండా సైలెంట్‌గా వెళ్లిపోతుంది. ధాన్య‌ల‌క్ష్మి కాఫీ పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. తాను కాఫీ పెడ‌తాన‌ని అనామిక అంటుంది. కాఫీ పేరుతో న‌న్ను టార్చ‌ర్ పెట్టావ‌ని నాపై కూడా కేసు పెట్టిన పెడ‌తావ‌ని అనామిక‌పై సెటైర్ వేస్తుంది ధాన్య‌ల‌క్ష్మి.

పెంప‌కంపై మ‌చ్చ‌...

అప్పు చుట్టూ క‌ళ్యాణ్ తిరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక కేసు పెట్టాన‌ని ధాన్య‌ల‌క్ష్మితో అంటుంది అనామిక‌. నేను క‌ళ్యాణ్ కంటే నీకే ఎక్కువ విలువ ఇచ్చాను. ఇంట్లో మాట ప‌డ‌కుండా కాపాడుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా కొడుకును జైలుకు పంపించావు. నా కొడుకుపై మ‌చ్చ వేశావు.

నా పెంప‌కంపై నింద వేశావు. నువ్వు స‌రిదిద్దుకోలేని త‌ప్పు చేశావు. కంపెనీ బాధ్య‌త‌ల‌ను తీసుకొని వారం కాక‌ముందే పోలీస్ క‌ళ్యాణ్‌ను స్టేష‌న్‌కు పంపించావు. ఇక జీవితంలో నిన్ను క్ష‌మించేది లేద‌ని అనామిక‌కు కోపంగా చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది ధాన్య‌ల‌క్ష్మి. త‌న చేత రుద్రాణి కావాల‌నే కేసు పెట్టించింది అని ఆమెపై కోపంతో ర‌గిలిపోతుంది అనామిక‌.

ఆస్తి పేప‌ర్స్ మిస్సింగ్‌...

స్వ‌ప్న ద‌గ్గ‌ర ఉన్న ఆస్తి పేప‌ర్స్‌తో సుభాష్‌కు అవ‌స‌రం ప‌డుతుంది. వాటిని సుభాష్‌కు ఇవ్వ‌డానికి రూమ్‌లో వెతుకుతుంది స్వ‌ప్న‌. కానీ అవి తాను పెట్టిన చోట క‌నిపించ‌క‌పోవ‌డంతో స్వ‌ప్న కంగారు ప‌డుతుంది.

ఆమెపై రుద్రాణి, రాహుల్ సెటైర్స్‌వేస్తారు. ఆ ఆస్తి పేప‌ర్స్ ను నువ్వు ఎక్క‌డైనా తాక‌ట్టు పెట్టి ఉండొచ్చ‌ని రుద్రాణి అనుమానం వ్య‌క్తం చేస్తుంది. తాక‌ట్టు పెట్టే లాంటి వెధ‌వ ప‌నులు నీకు, నీ కొడుక్కు వ‌స్తాయి. నాకు రావు అంటూ ఇద్ద‌రిపై స్వ‌ప్న ఫైర్ అవుతుంది.

రుద్రాణి ప్లాన్‌...

ఆస్తి పేప‌ర్స్ తాక‌ట్టు పెట్టి స్వ‌ప్న మార్వాడీ వాడి వ‌ద్ద అప్పు తీసుకుంటున్న‌ట్లు అంద‌రి ముందు నిరూపించాల‌ని స్కెచ్ వేస్తుంది రుద్రాణి. ఈ ప్లాన్‌తో స్వ‌ప్న‌ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపించాల‌ని అనుకుంటుంది. కానీ మార్వాడీ ఫోన్ స్విఛాప్ అని రావ‌డంతో రాహుల్ కంగారు ప‌డ‌తాడు.

రాజ్‌ను ఫాలో అయిన కావ్య‌...

రాజ్‌కు సుభాస్ సీక్రెట్‌గా డ‌బ్బు ఇవ్వ‌డం కావ్య చూస్తుంది. ఆ డ‌బ్బును బిడ్డ త‌ల్లికి ఇవ్వ‌డానికే సుభాష్ ద‌గ్గ‌ర నుంచి రాజ్ తీసుకున్నాడ‌ని కావ్య అనుమాన‌ప‌డుతుంది. రాజ్‌ను ఫాలో చేసి ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాల‌ని అనుకుంటుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point