Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్?
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గెస్ట్‌లుగా రాబోతున్నట్లు ప్రచారంజరుగుతోంది. ఏపీలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి మూవీ వరల్డ్ వైడ్‌గా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు మరో పది రోజులే ఉండటంతో ప్రమోషన్స్ స్పీడును పెంచబోతున్నారు మేకర్స్. కల్కి కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను వేర్వేరుగా కల్కి యూనిట్ ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీలో జరుగున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ సీఏం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఏం, డిప్యూటీ సీఏం హోదాలో వీరిద్దరు హాజరుకానున్న తొలి సినిమా వేడుక ఇదేనని చెబుతోన్నారు.
అశ్వనీదత్‌తో సాన్నిహిత్యం....
కల్కి ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌తో చంద్రబాబుకు చక్కటి సాన్నిహిత్యముంది. చాలా ఏళ్లుగా టీడీపీకి మద్ధుతుగా నిస్తోన్నారు అశ్వనీదత్. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ 160కి పైగా సీట్స్ గెలుస్తుందని అశ్వనీదత్ అంచనా వేశారు. అయన చెప్పినట్లుగా టీడీపీ, జనసేన పార్టీ కలిసి అధికారంలోకి వచ్చాయి.
అశ్వనీదత్‌తో ఉన్న అనుబంధంతోనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కల్కి ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌లుగా రాబోతున్నట్లు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదికగా పిఠాపురం, అమరావతి, వైజాగ్‌తో పాటు మరికొన్ని సిటీలను పరిశీలిస్తోన్నట్లు చెబుతోన్నారు. చంద్రబాబు, పవన్ డేట్స్‌తో పాటు వేదిక ఫైనల్ చేసిన తర్వాతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.
ముంబైలో ఈవెంట్...
ఈ బుధవారం (జూన్ 20న)ముంబైలో కల్కి ఈవెంట్‌ను భారీగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ తో పాటు అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకోణ్, దిశాపటానీ పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
సూపర్ హీరో మూవీ...
పురాణాల్లోకి కల్కి అవతారం స్ఫూర్తితో సూపర్ హీరో కథాంశంతో దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తోన్న కల్కి మూవీ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.మరో హీరోయిన్‌గా దీశాపటానీ కనిపించబోతున్నది. ఈ సినిమాలో ప్రభాస్ కోసం బుజ్జి పేరుతో ఏడు కోట్లతో ఓ కారును తయారుచేశారు. ఈ కారుకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది.
ఆరు వందల కోట్ల బడ్జెట్...
దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కల్కి 2898 ఏడీ మూవీని నిర్మిస్తోన్నాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా కల్కి తెరకెక్కుతోంది. ఇప్పటివకే ఓవర్‌సీస్‌లో కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మిలియిన్నరను దాటేశాయి.
అమెరికాలో అతి తక్కువ టైమ్‌లో మిలియన్నరకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న మూవీగా కల్కి రికార్డ్ నెలకొల్పింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత తెలుగులో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఏకకాలంలో కల్కి 2898 ఏడీ మూవీని షూట్ చేశారు. తమిళం, మలయాళం, కన్నడంతో పాటు ఇంగ్లీష్ భాషల్లోకి డబ్ చేసి విడుదలచేయబోతున్నారు.
కల్కి...రాజా సాబ్...
గతంలో ఏడాదికి, రెండేళ్లుకు ఓ సినిమా చేసిన ప్రభాస్ ఇప్పుడు స్పీడు పెంచేశారు. ఈ ఏడాది కల్కితో పాటు రాజా సాబ్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తోన్నాడు. సూపర్ నాచురల్ హారర్ మూవీగా రాజాసాబ్ తెరకెక్కుతోంది.
మరోవైపు సలార్ మూవీ సీక్వెల్ చేయబోతున్నాడు ప్రభాస్. సలార్ 2 శౌర్యంగపర్వం పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాదే సెట్స్‌పైకి రానుంది. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీకి ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.