Bigg Boss Aditya Om: సింగిల్ క్యారెక్టర్‌తో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిత్యం ఓం సినిమా- షోలో ఉండగానే రిలీజ్! స్టోరీ ఏంటంటే?
Bigg Boss Telugu 8 Aditya Om Movie Bandi Release: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న హీరో ఆదిత్యం ఓం కొత్త సినిమా బందీ. తాజాగా బందీ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ షోలో పంచభూతాలతో అడవిలో మమేకమై ఆదిత్య ఉన్నారని, సక్సెస్ అయి తిరిగి వస్తారని డైరెక్టర్ తిరుమల చెప్పారు.
Bigg Boss 8 Telugu Aditya Om Bandi: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. గొడవలు, అరుపు, కేకలు, ఏడుపులతో హౌజ్ నడుస్తోంది. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో బేబక్క ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో హీరో ఆదిత్యం ఓం ఒకరు.
తానేంటే నిరూపించుకునేందుకు
లాహిరి.. లాహిరి.. లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఆదిత్యం ఓం ఆ తర్వాత పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇటీవలే బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా మరోసారి తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆదిత్యం ఓం. బిగ్ బాస్ కంటే ముందుగా ఆదిత్య ఓం హీరోగా నటించిన సినిమా బందీ.
గల్లీ సినిమా బ్యానర్ మీద బందీ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా తిరుమల రఘు దర్శకత్వం వహించారు. తాజాగా బందీ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. బందీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో మూవీ, బిగ్ బాస్ షోలో ఆదిత్యం ఓం ఉండడంపై దర్శకనిర్మాత రఘు తిరుమల కామెంట్స్ చేశారు.
కార్పోరేట్ కంపెనీలకు
"ఇది నాకు మొదటి చిత్రం. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాను. ఆదిత్య ఓం సపోర్ట్ వల్లే ఈ మూవీని చేయగలిగాను. ఆయన ద్వారా ఎంతో నేర్చుకున్నాను. సినిమాలో కేవలం ఒక్క కారెక్టరే ఉంటుంది. ఆదిత్య వర్మ అనే పాత్రతోనే ఈ మూవీ ఉంటుంది. ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పోరేట్ కంపెనీలకు సపోర్ట్ చేసే పాత్రలో ఆదిత్య కనిపిస్తారు" అని డైరెక్టర్ రఘు తిరుమల తెలిపారు.
"అలాంటి లీగల్ అడ్వైజర్ పాత్రని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా కాపాడుతాడు? అన్నది చివరకు చూస్తారు. కరోనా తరువాత ప్రకృతి మీద అందరికీ అవగాహన ఏర్పడింది. అందుకే ఈ కథను రాసుకున్నాను" అని బందీ దర్శకనిర్మాత రఘు తిరుమల అన్నారు.
అడవిలో మమేకమై
"ఆదిత్య ఓం ఎంతో ఒదిగి ఉండేవారు. టీంతో ఎంతో బాగా ఉండేవారు. మూడేళ్లలో ఆయన్ను చాలా దగ్గర్నుండి చూశాను. ఆరేడు నెలల క్రితమే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం కొంత పని జరుగుతోంది. ఆదిత్య గారు సినిమాలో ఎక్కడా కూడా డూప్ వాడనివ్వలేదు. సొంతంగా యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నారు. పంచభూతాలతో అడవిలో మమేకమై ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో భిన్నమనస్తత్వాలు కూడిన మనుషులతో కలిసి ఉన్నాడు. సక్సెస్ అయి వస్తాడని ఆశిస్తున్నాను" అని రఘు తిరుమల ఆకాంక్షించారు.
ఇదిలా ఉంటే, బందీ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాత రఘు తిరుమల తెలిపారు. అయితే, ఆదిత్యం బిగ్ బాస్ హౌజ్‌లో ఉండగానే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ వారం గనుక ఆదిత్యం ఓం ఎలిమినేట్ అయితే చెప్పలేం. ఆయనకు ఓటింగ్ మాత్రం బాగానే ఉంది. కానీ, బిగ్ బాస్ టీమ్ మాత్రం ఆడియెన్స్ ఓటింగ్‌తోనే కాకుండా తమకు ఉపయోగపడనివారిని ఎలిమినేట్ చేయడం సర్వసాధారణం.