Bhaje Vaayu Vegam OTT Date: అఫీషియల్: కార్తికేయ యాక్షన్ మూవీ భజే వాయువేగం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్-bhaje vaayu vegam ott release date confirmed kartikeya action drama to stream on netflix bhaje vaayu vegam streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhaje Vaayu Vegam Ott Date: అఫీషియల్: కార్తికేయ యాక్షన్ మూవీ భజే వాయువేగం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Bhaje Vaayu Vegam OTT Date: అఫీషియల్: కార్తికేయ యాక్షన్ మూవీ భజే వాయువేగం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 24, 2024 06:17 PM IST

Bhaje Vaayu Vegam OTT Release Date: భజే వాయువేగం సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. కార్తికేయ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

OTT Release Date: నెలలోనే ఓటీటీలోకి భజే వాయువేగం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..
OTT Release Date: నెలలోనే ఓటీటీలోకి భజే వాయువేగం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Bhaje Vaayu Vegam OTT Release Date: యాక్షన్ డ్రామా మూవీ భజే వాయువేగం సినిమా అంచనాలను నిలబెట్టుకుంది. కార్తికేయ హీరోగా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. మే 31న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు, భజే వాయువేగం సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెలలోపే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చింది.

ఓటీటీ డేట్

భజే వాయువేగం సినిమా జూన్ 28వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై ఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 24) అధికారిక ప్రకటన చేసింది. “రహస్యాలు, చేజ్‍లు, గ్యాంబ్లింగ్, ఇంకా మాఫియా.. ఇవేవీ వెంకట్ గాడికి సరిపోవు. భజే వాయువేగం సినిమాను జూన్ 28 నుంచి నెట్‍ఫ్లిక్స్‌పై చూడండి” అని నెట్‍ఫ్లిక్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

నెలలోగానే..

భజే వాయువేగం సినిమా కూడా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం మే 31న థియేటర్లలోకి రాగా.. జూన్ 28న ఓటీటీలో అడుగుపెడుతోంది. దీంతో నెలలోగానే స్ట్రీమింగ్‍కు వస్తున్నట్టయింది. ఈ మూవీ జూన్ 28న స్ట్రీమింగ్‍కు వస్తుందని అంచనాలు రాగా.. అవే నిజమయ్యాయి.

భజే వాయువేగం మూవీకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. తనకు డైరెక్టర్‌గా తొలి చిత్రమే అయినా కథనంతో మెప్పించారు. కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ నటించారు రాహుల్ టైసన్, శరత్ లోహితస్వ, తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు. యాక్షన్, బెట్టింగ్, మాఫియా చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. కారు కూడా ఈ చిత్రంలో కీలకంగా ఉంటుంది.

భజే వాయువేగం చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్ బ్యానర్ నిర్మించింది. ఈ చిత్రంలోని పాటలకు రదన్ స్వరాలు అందించగా.. కపిల్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి.. సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

భజే వాయువేగం సినిమాకు ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో రాలేదు. తొలి రోజు కలెక్షన్లు తక్కువగానే వచ్చాయి. అయితే ఆ తర్వాత పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గంగం గణేశా పోటీలో ఉన్నా.. భజే వాయువేగం మంచి వసూళ్లనే దక్కించుకుంది.

నెట్‍ఫ్లిక్స్‌లోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. థియేటర్లలో మే 31న ఈ చిత్రం రిలీజ్ కాగా.. రెండు వారాల్లోనే జూన్ 14న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రూరల్ యాక్షన్ డ్రామాగా గ్యాంగ్స్ గోదావరి మూవీని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణ చైతన్య. ఈ మూవీలో విశ్వక్‍సేన్ సరసన నేహాశెట్టి హీరోగా నటించారు. అంజలి మరో ప్రధాన పాత్ర చేశారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం సుమారు రూ.25కోట్ల కలెక్షన్లతో మోస్తరు హిట్ అయింది.

WhatsApp channel