Kartikeya: కార్తీ ఖైదీ మూవీ టైపులా భజే వాయు వేగం.. హీరో కార్తికేయ గుమ్మకొండ కామెంట్స్-kartikeya gummakonda about bhaje vaayu vegam movie compared to karthi khaidi movie iswarya menon tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kartikeya: కార్తీ ఖైదీ మూవీ టైపులా భజే వాయు వేగం.. హీరో కార్తికేయ గుమ్మకొండ కామెంట్స్

Kartikeya: కార్తీ ఖైదీ మూవీ టైపులా భజే వాయు వేగం.. హీరో కార్తికేయ గుమ్మకొండ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 30, 2024 06:17 AM IST

Kartikeya Gummakonda About Bhaje Vaayu Vegam: హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం. ఈ సినిమాను తమిళ స్టార్ హీరో కార్తి సూపర్ హిట్ మూవీ ఖైదీలా ఊహించుకున్నట్లు కార్తికేయ తెలిపాడు. ఇంకా భజే వాయు వేగంకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

కార్తీ ఖైదీ మూవీ టైపులా భజే వాయు వేగం.. హీరో కార్తికేయ గుమ్మకొండ కామెంట్స్
కార్తీ ఖైదీ మూవీ టైపులా భజే వాయు వేగం.. హీరో కార్తికేయ గుమ్మకొండ కామెంట్స్

Kartikeya Gummakonda Bhaje Vaayu Vegam: హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్

ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న భజే వాయు వేగం సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్‌తో పాటు తన కెరీర్ విశేషాలను ఇంటర్వ్యూలో తెలిపారు హీరో కార్తికేయ గుమ్మకొండ.

మరింత నమ్మకం పెరిగింది

లాక్ డౌన్ టైమ్‌లో ప్రశాంత్ రెడ్డి నన్ను కలిసి భజే వాయు వేగం కథ వినిపించాడు. కథ చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటికే నేను అందులోని ఎమోషన్స్‌ కు కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా కచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాను. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొంత టైమ్ అడిగాను. "భజే వాయు వేగం" సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కథ మీద దర్శకుడు ప్రశాంత్ మీద మరింత నమ్మకం పెరిగింది.

హెయిర్ స్టైల్ మారినట్లు

ముందు త్వరగా ఫినిష్ చేయాలనుకున్న ఈ సినిమాను ఇలా కాదు ఇంకాస్త టైమ్ కేటాయించి ఇంకా బెటర్‌గా చేద్దామని అనుకున్నాం. నేను అప్పటికే బెదురులంక స్టార్ట్ చేశాను. ఆ సినిమా పూర్తి చేసి మళ్లీ "భజే వాయు వేగం"కు తిరిగి రావాలని టీమ్‌తో డిస్కస్ చేసి వెళ్లాను. అందుకే ఈ సినిమాలో కొన్నిచోట్ల జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా హెయిర్ స్టైల్ మారినట్లు తెలుస్తుంది.

ఇన్స్‌ఫైరింగ్‌గా ఉండాలని

"భజే వాయు వేగం" సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్‌కు సరైన మూవీ. హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని సాల్వ్ చేసుకునేందుకు ఎంచుకునే మార్గాలు.. ఇవన్నీ ఇన్స్‌ఫైరింగ్‌గా ఉండాలని భావిస్తా. అప్పుడే ఐడియల్ అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సోషల్ కన్సర్న్ ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మంచి ఎంటర్ టైన్‌మెంట్ కూడా సినిమాలో ఉంటుంది.

ఖైదీ టైపులో

ఇలాంటి చిత్రంలోనే నేను నటించాలని కోరుకున్నాను. ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ఈ కథ దర్శకుడు ప్రశాంత్ చెప్పినప్పుడు కార్తి హీరోగా నటించిన ఖైదీ టైపులో ఊహించుకున్నాను. ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు. కానీ, అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు ఒక ప్రాబ్లమ్, అతనికుండే ధైర్యం ఇలాంటి ఫ్రేమ్‌లో కథ ఉంటుంది. సెకండాఫ్‌లో రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది.

అన్ని సరిగ్గా జరుగుతాయని

యూవీ క్రియేషన్స్‌లో సినిమా చేస్తున్నానంటే హీరోగా నాకొక పెద్ద బ్యానర్ దొరికిందని సంతోషించాను. యూవీలో చేస్తే మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయి అనే నమ్మకం ఉంటుంది. యూవీ కాన్సెప్ట్స్ నుంచి మా "భజే వాయు వేగం" టీమ్ కు కంప్లీట్ సపోర్ట్ దొరికింది.

టీ20 వరల్డ్ కప్ 2024