తెలుగు న్యూస్ / ఫోటో /
Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఆస్తి ఎంతో తెలుసా? 12 ఏళ్లలో ఎంత సంపాదించండంటే?
Sivakarthikeyan Net Worth: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేదు. ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్న శివ కార్తికేయన్ 12 ఏళ్ల సినీ కెరీర్లో సంపాదించిన నెట్ వర్త్, రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..
(1 / 5)
తమిళంలోనే కాకుండా తెలుగులోను అభిమానులను సంపాదించుకున్నాడు స్టార్ హీరో శివకార్తికేయన్. ( sivakarthikeyan / Instagram)
(2 / 5)
మెరీనా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు శివకార్తికేయన్. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగాడు. తొలినాళ్లలో అంతినిచెల్, రజనీ మురుగన్ వంటి కమర్షియల్ హిట్స్ ఇచ్చి అభిమానులను గెలుచుకున్నాడు. అతను గొప్ప నటుడు మాత్రమే కాకుండా గొప్ప సింగర్, రైటర్ కూడా.
(3 / 5)
తెలుగులోనూ శివ కార్తికేయన్‌కు మంచి అభిమానులున్నారు. గతేడాది ప్రిన్స్‌తో కలిసి టాలీవుడ్ అభిమానులకు స్వాగతం పలికాడు. ఇటీవల మావీరన్‌తో సూపర్ హిట్ కొట్టిన శివకార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఎస్కే21 చిత్రంలో నటిస్తున్నారు. దానికి అమరన్ అని టైటిల్ ఫిక్స్ చేశారు.
(4 / 5)
శివకార్తికేయన్ 2010లో తన స్నేహితురాలు ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఆరాధన, గుగన్ దాస్. చెన్నైలో ఆయనకు సొంత ఇల్లు ఉంది.
(5 / 5)
శివకార్తికేయన్ ఇటీవల తన స్వగ్రామమైన తిరువీజిమిలైలో కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 12 ఏళ్లలో శివకార్తికేయన్ రూ. 125 కోట్లు సంపాదించాడు. నటుడిగానే కాకుండా శివకార్తికేయన్‌కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. శివకార్తికేయన్ ఒక్కో సినిమాకు రూ. 20 నుంచి 30, 35 కోట్ల పారితోషికం తీసుకుంటాడని సమాచారం.
ఇతర గ్యాలరీలు