Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ హిట్ సినిమా భజే వాయువేగం.. డేట్ ఇదే!-kartikeya bhaje vaayu vegam may stream from next week on netflix ott platform bhaje vaayu vegam ott update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhaje Vaayu Vegam Ott: ఓటీటీలోకి కార్తికేయ హిట్ సినిమా భజే వాయువేగం.. డేట్ ఇదే!

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ హిట్ సినిమా భజే వాయువేగం.. డేట్ ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 22, 2024 02:11 PM IST

Bhaje Vaayu Vegam OTT: భజే వాయువేగం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. థియేటర్లలో హిట్‍గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టనుంది. డేట్ కూడా ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది.

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ హిట్ సినిమా భజే వాయువేగం.. డేట్ ఇదే!
Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి కార్తికేయ హిట్ సినిమా భజే వాయువేగం.. డేట్ ఇదే!

Bhaje Vaayu Vegam OTT: యంగ్ హీరో కార్తికేయకు ‘భజే వాయువేగం’ చిత్రం మంచి హిట్ ఇచ్చింది. ఈ చిత్రం మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ముందుగా కాస్త స్లోగానే ఈ మూవీకి ఓపెనింగ్స్ వచ్చినా.. పాజిటివ్ టాక్ ఉండటంతో కలెక్షన్లలో పుంజుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. భజే వాయు వేగం సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

స్ట్రీమింగ్ డేట్ ఇదే!

భజే వాయువేగం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఈ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే నెట్‍ఫ్లిక్స్ అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది.

జూన్ 28వ తేదీన భజే వాయువేగం చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తే థియేటర్లలో రిలీజైన నెలలోనే స్ట్రీమింగ్‍కు వచ్చినట్టు అవుతోంది. ఇటీవలి కాలం ఎక్కువ శాతం చిత్రాలు నాలుగు వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి.

భజే వాయు వేగం చిత్రంలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‍గా నటించారు. క్రికెట్ బెట్టింగ్, యాక్షన్, ఛేజింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి. కథ, కథనం ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి మొదటి నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆశించిన స్థాయిలో బాక్సాఫీద్ వద్ద పర్ఫార్మ్ చేసింది. రిలీజ్‍కు ముందు అంతగా బజ్ లేకపోయినా.. ఆ తర్వాత ఈ మూవీ పుంజుకుంది.

భజే వాయువేగం చిత్రంలో కార్తికేయ, ఐశ్వర్యతో పాటు రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, శరత్ లోహితస్వ, రవిశంకర్, సుదర్శన్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు. యూవీ కాన్సెప్ట్ పతాకం నిర్మించిన ఈ మూవీకి రదన్, కపిల్ కుమార్ సంగీతం అందించారు.

స్టోరీలైన్ ఇదే

ఓ గ్రామం నుంచి హైదరాబాద్‍కు వస్తాడు వెంకట్ (కార్తికేయ). చిన్నప్పటి నుంచి అతడికి క్రికెటర్ కావాలని ఉంటుంది. తన కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటు తన స్నేహితుడి కుమారుడైన వెంకట్‍ను కూడా లక్ష్మయ్య (తనికెళ్ల భరిణి) పెంచుతాడు. హైదరాబాద్‍కు వెంకట్, రాజు కలిసే వస్తారు. క్రికెటర్ కాలేకపోవడంతో క్రికెట్ బెట్టింగ్‍లోకి వెంకట్ దిగుతాడు. లక్ష్మయ్య ఆరోగ్యానికి డబ్బు అవసరం రావడంతో డేవిడ్ (రవిశంకర్) వద్ద భారీస్థాయిలో బెట్టింగ్ వేస్తాడు వెంకట్. గెలిచినా అతడికి రూ.40లక్షలు ఇచ్చేందుకు డేవిడ్ గ్యాంగ్ ఒప్పుకోదు. దీంతో డేవిడ్ కారును వెంకట్ ఎత్తుకెళతాడు. ఆ కారులో భారీగా డబ్బు, హవాలాకు సంబంధించిన నోటు, ఓ శవం ఉంటుంది. దీంతో వెంకట్ వెనుక డేవిడ్ గ్యాంగ్, పోలీసులు పడతారు. ఆ తర్వాత వెంకట్‍కు ఏమైంది? ఆ శవం వెనుక ఉన్న స్టోరీ ఏంటి? లక్ష్మయ్యను వెంకట్ కాపాడుకున్నాడా? అనే అంశాలు భజే వాయువేగం సినిమాలో ప్రధానంగా ఉంటాయి.

భజే వాయువేగం చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‍ స్క్రీన్‍ప్లే, థ్రిల్లింగ్ సీన్లకు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

WhatsApp channel