Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?-agent movie completes one year audience still waiting for this akhil movie ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Ott: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 28, 2024 02:42 PM IST

Agent Movie OTT: ఏజెంట్ సినిమా రిలీజై నేటితో సంవత్సరం పూర్తయింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అయితే, ఏడాది అయినా ఇంకా ఈ చిత్రం ఓటీటీలోకి రాలేదు.

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?
Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Agent OTT: సాధారణంగా సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఓటీటీలో మరోసారి చూడాలని ఆశిస్తుంటారు. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఓ సినిమా కోసం కూడా ప్రేక్షకులు చాలాకాలంగా నిరీక్షిస్తున్నారు. ఈ మూవీనే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్. ఈ చిత్రం రిలీజై నేటికి (ఏప్రిల్ 28) సంవత్సరమైంది. అయినా, ఈ సినిమా ఇంకా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రాలేదు.. టీవీల్లోనూ ప్రసారం కాలేదు. వివరాలివే..

yearly horoscope entry point

బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఏజెంట్ చిత్రం తెరకెక్కింది. 2023 ఏప్రిల్ 28వ తేదీన భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఏజెంట్ మూవీకి ఆరంభం నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లను పేలవంగా రాబట్టింది. ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

ఏజెంట్ సినిమా సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, కేవలం సుమారు రూ.8.5 కోట్ల కలెక్షన్లను మాత్రం సాధించి అల్ట్రా డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. భారీ నష్టాలను చవిచూసింది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏజెంట్ భారీ నష్టాల గురించి నిర్మాతలు పలు సందర్భాల్లో మాట్లాడారు. స్క్రిప్ట్ పనులు పూర్తి కాకుండా సినిమాను మొదలుపెట్టడం సహా పలు కారణాల వల్ల ఈ చిత్రం డిజాస్టర్ అయిందంటూ వివరణలు కూడా ఇచ్చారు.

ఏజెంట్ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా కీలకపాత్ర పోషించారు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళంలోనూ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే, మలయాళంలోనూ ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. హిందీలో రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నా.. ఫలితం చూసి మేకర్స్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో?

ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ వద్ద ఉన్నాయి. అయితే, మొదట్లో ఆర్థికపరమైన వివాదాల వల్ల ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు తీసుకురావడం లేదని సమాచారం బయటికి వచ్చింది. అయితే, అలాంటిదేమీ లేదని మేకర్స్ చెప్పారు. అయినా.. నెలలు గడుస్తున్నా ఈ మూవీని సోనీ లివ్ స్ట్రీమింగ్‍కు తీసుకురాలేదు. త్వరలో అంటూ ఓసారి చెప్పినా.. సోనీ లివ్ ఓటీటీలోకి ఈ చిత్రం అడుగుపెట్టలేదు. ఇప్పటికి థియేటర్లలో రిలీజై సంవత్సరమైన ఇంకా ఏజెంట్ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు.

ఏజెంట్ సినిమా త్వరలోనే సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుందని ఇటీవల నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. అయితే, ఇప్పటి వరకు కూడా అది జరగలేదు. అసలు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో కూడా అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే, ఈ చిత్రం ఇప్పటి వరకు టీవీల్లోనూ ప్రసారం కాలేదు.

ఏజెంట్ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‍గా నటించారు. మమ్ముట్టి, డినో మోరియా, విక్రమ్‍జీత్ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి హిప్‍హాప్ తమిళ సంగీతం అందించారు. కాగా, కొత్త డైరెక్టర్ అనిల్ కుమార్‌తో అఖిల్ తర్వాతి చిత్రం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Whats_app_banner