Agent Collections: అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్.. దారుణంగా ఏజెంట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు-agent collections confirm this is the biggest disaster for akhil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Agent Collections Confirm This Is The Biggest Disaster For Akhil

Agent Collections: అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్.. దారుణంగా ఏజెంట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు

Hari Prasad S HT Telugu
May 01, 2023 04:01 PM IST

Agent Collections: అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది ఏజెంట్ మూవీ. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. నెగటివ్ టాక్ కారణంగా సినిమా చూసే వాళ్లే కరవయ్యారు.

అఖిల్ ను నిండా ముంచిన ఏజెంట్
అఖిల్ ను నిండా ముంచిన ఏజెంట్

Agent Collections: టాలీవుడ్ లో ఈ ఏడాది మరో పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది ఏజెంట్ మూవీ. ఈ సినిమా తన కెరీర్లోనే అతి పెద్ద సక్సెస్ అవుతుందని ఆశించిన అఖిల్ అక్కినేనికి గట్టి షాకే తగిలింది. సినిమా కోసం అతడు చాలానే కష్టపడినా.. ప్రేక్షకులు మాత్రం ఆదరించలేదు. చాలా రోజుల వెయిటింగ్ తర్వాత రిలీజైన ఈ సినిమా.. మొదటి నుంచి కూడా పెద్దగా అంచనాలు లేవు.

ట్రెండింగ్ వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. ఇక తొలి రోజే సినిమాకు పూర్తి నెగటివ్ టాక్ రావడంతో రెండు, మూడో రోజుల్లో కలెక్షన్లు మరింత పడిపోయాయి. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ ఏజెంట్ మూవీ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. తొలి మూడు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ కేవలం రూ.13 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.8 కోట్లు మాత్రమే. అఖిల్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా ఏజెంట్ నిలిచింది. వీకెండ్ లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. సోమవారం (మే 1) నుంచి మరింత గడ్డు పరిస్థితులు తప్పవు. మే డే హాలీడే కారణంగా సోమవారం కాస్త మెరుగ్గా వచ్చినా.. మంగళవారం (మే 2) నుంచి ఇక ఏజెంట్ పనైపోయినట్లే అని చెప్పాలి.

మూడో రోజైన ఆదివారం (ఏప్రిల్ 30) ఈ సినిమాకు కేవలం రూ.1.3 కోట్లు మాత్రమే వచ్చాయి. ఏజెంట్ మూవీని సుమారు రూ.70 నుంచి రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు సమాచారం. ఇక రిలీజ్ కు ముందు కూడా ఈ సినిమా రూ.36 కోట్ల బిజినెస్ చేసింది. ఆ లెక్కన బ్రేక్ ఈవెన్ కూడా అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.

అఖిల్ తొలి సినిమా తొలి రోజు కలెక్షన్ల కంటే కూడా ఈ ఏజెంట్ మూడు రోజుల కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. అతని కెరీర్లో ఒక్క మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మాత్రమే యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా.. మిగిలిన నాలుగు సినిమాలు ఫ్లాపయ్యాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.