Agent Day 1 Collection: ఏజెంట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - అఖిల్ కెరీర్‌లో ఇదే లోయెస్ట్‌ - బ్రేక్ ఈవెన్ కావ‌డం క‌ష్ట‌మేనా?-agent movie day 1 collection worldwide akhil film gets lowest opening at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Agent Movie Day 1 Collection Worldwide Akhil Film Gets Lowest Opening At Box Office

Agent Day 1 Collection: ఏజెంట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - అఖిల్ కెరీర్‌లో ఇదే లోయెస్ట్‌ - బ్రేక్ ఈవెన్ కావ‌డం క‌ష్ట‌మేనా?

Nelki Naresh Kumar HT Telugu
Apr 29, 2023 04:38 PM IST

Agent Day 1 Collection: అఖిల్ ఏజెంట్ మూవీ ఫ‌స్ట్ బాక్సాఫీస్ అంచ‌నాల్ని అందుకోలేక చ‌తికిలా ప‌డింది. ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి ఫ‌స్ట్ వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే..

అఖిల్ ఏజెంట్
అఖిల్ ఏజెంట్

Agent Day 1 Collection: అఖిల్ ఏజెంట్ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. అఖిల్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా మొద‌టి రోజు ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉండొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కానీ వారి ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రీచ్ కావ‌డంతో ఏజెంట్ పూర్తిగా విఫ‌ల‌మైంది.

శుక్ర‌వారం రోజు ఈ సినిమాకు నాలుగు కోట్ల అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను మాత్ర‌మే వ‌చ్చాయి. నైజాం ఏరియాలో శుక్ర‌వారం నాడు అత్య‌ధికంగా ఏజెంట్‌ కోటి ప‌ది ల‌క్ష‌ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. సీడెడ్‌లో అర‌వై ల‌క్ష‌లు, గుంటూర్‌లో యాభై ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ మూవీ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకొన్న‌ట్లు చెబుతోన్నారు. ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్‌ను ఈ సినిమా మెప్పించ‌లేక‌పోయింది.

మొద‌టిరోజు ఓవ‌ర్ సీస్‌లో ఏజెంట్‌కు 60 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఓవ‌రాల్‌గా తొలిరోజు ఎనిమిది కోట్ల ముప్పై ల‌క్ష‌ల‌కుపైగా గ్రాస్‌, నాలుగు కోట్ల అర‌వై ల‌క్ష‌ల‌కుపైగా షేర్‌ను ఏజెంట్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. అఖిల్ ఫ‌స్ట్ మూవీ అఖిల్ మొద‌టిరోజు దాదాపు ఎనిమిది కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. అందులో స‌గం క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ఏజెంట్‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

నెగెటివ్ టాక్ కార‌ణంగా రెండో రోజు వ‌సూళ్లు మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్ల‌కుపైగా జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఏజెంట్ బ్రేక్ ఈవెన్ కావ‌డం క‌ష్ట‌మేన‌ని వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఏజెంట్ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

దేశంలో ఉగ్ర‌దాడుల‌కు ప్లాన్ చేసిన ధ‌ర్మ అనే క్రిమిన‌ల్‌ను రామ‌కృష్ణ అనే రా ఏజెంట్ ఎలా ప‌ట్టుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఏజెంట్ మూవీ స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు టెక్నిక‌ల్ విష‌యాల్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి. ఈ సినిమాలో మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది.

IPL_Entry_Point