Agent Movie Review: ఏజెంట్ మూవీ రివ్యూ - అఖిల్ స్పై థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే
Agent Movie Review: అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ శుక్రవారం రిలీజైంది. స్పై యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందంటే...
Agent Movie Review: అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజైంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ప్రమోషన్స్‌లో ఈ సినిమా విజయంపై అఖిల్ తో పాటు చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా కనిపించారు. వారి నమ్మకం నిజమైందా? ఏజెంట్‌తో అఖిల్ హిట్ అందుకున్నాడా? దర్శకుడిగా సురేందర్‌రెడ్డి కమ్ బ్యాక్ అయ్యాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్పిందే...
Agent Movie Story -రామకృష్ణ టార్గెట్...
రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) చిన్నతనంలోనే ఓ ఉగ్రదాడి నుంచి తప్పించుకుంటాడు. ఆ సంఘటనల కారణంగ రా ఏజెంట్ కావాలని బలంగా నిర్ణయించుకుంటాడు. కానీ లక్ష్యం పట్ల సీరియస్‌నెస్ లేకపోవడంతో మూడు సార్లు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతాడు. తాను గురువుగా భావించే రా చీఫ్ మహదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్‌ను రిక్కీ హ్యాక్ చేసి అతడి మెప్పును పొందుతాడు.
ఆపరేషన్ రాబిట్ పేరుతో ఇండియాలో పలు చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు గాడ్ అలియా ధర్మ (డినో మారియా) ప్లాన్ చేస్తాడు. ఈ బాంబు దాడులను అడ్డుకోనే బాధ్యతను రిక్కీకి అప్పగిస్తాడు మహదేవ్.
ఈ ప్రయత్నంలో రిక్కీ సక్సెస్ అయ్యాడా? ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం రిక్కీని మహదేవ్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏమిటి? ధర్మతో మహదేవ్‌కు సంబంధం ఉందా? తాను గురువుగా భావించే మహదేవ్‌ను చంపాల్సిన పరిస్థితులు రిక్కీకి ఎందుకొచ్చింది? వైద్యతో (సాక్షి వైద్య) రిక్కీ ప్రేమాయణం సాఫీగా సాగిందా? లేదా అన్నదే ఈసినిమా కథ.
Agent Analysis -స్పై థ్రిల్లర్ ట్రెండ్...
ఈ మధ్య కాలంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఎక్కువైంది. ఈ కథల్లో ప్రేక్షకుల్ని థ్రిల్‌కు లోనుచేసే వెసులుబాటుతో పాటు హీరోయిజం, భారీ యాక్షన్ సీక్వెన్స్, కమర్షియల్ హంగులన్నీ దండిగా ఉంటాయి. అందుకే ఈ స్పై సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపుతోన్నారు. ఏజెంట్‌తో అఖిల్ ఈ జోనర్‌ను టచ్ చేశాడు.
లాజిక్‌లెస్...
కథాపరంగా స్పై థ్రిల్లర్ సినిమాలు ఒకేలా ఉంటాయి. కానీ హీరో క్యారెక్టరైజేషన్‌ను పవర్‌ఫుల్‌గా మలచడంతో పాటు ఊహలకు అందకుండా మలుపులతో కథను ఎంగేజింగ్‌గా నడిపించినప్పుడే ఈ సినిమాలు సక్సెస్ అవుతాయి. లాజిక్స్ లేకపోయినా దేశభక్తి, ఎమోషన్స్ పండాలి. ఏజెంట్‌లో అవన్నీ లోపించాయి. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పూర్తిగా లాజిక్‌లెస్‌గా దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇంటర్వెల్ హైలైట్...
రా ఏజెంట్ కావడానికి రామకృష్ణ చేసే ప్రయత్నాలు, వైద్యతో అతడి ప్రేమాయణంతో ఫస్ట్‌హాఫ్‌ను సరదాగా నడిపించాడు డైరెక్టర్. కానీ ఈ సీన్స్ మొత్తం టైమ్‌పాస్ వ్యవహరంగానే సాగుతాయి. అఖిల్, సాక్షి వైద్య లవ్ ట్రాక్‌లో కెమిస్ట్రీ, ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సయ్యాయి.
విరామానికి ముందు మినిస్టర్ జయదేవ్‌కు రామకృష్ణ వార్నింగ్ ఇచ్చే సీన్, యాక్షన్ ఎపిసోడ్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ధర్మను ప్లాన్ అడ్డుకోవడానికి రామకృష్ణ వేసే ఎత్తులతో కంప్లీట్‌గా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో సెకండాఫ్‌ను తెరకెక్కించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నా ఎమోషన్ మాత్రం పండలేదు.
సీరియస్‌నెస్ లేదు...
సినిమాలో చాలా వరకు లాజిక్‌లెస్‌గా సాగుతుంది. రా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ అన్ని తూతూ మంత్రంగా సాగుతాయి. వాటిలో సీరియస్‌నెస్ కనిపించదు. ఏజెంట్ కోసంఎంచుకున్న మెయిన్ స్టోరీతో చాలా సినిమాలు రావడం మైనస్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఆకట్టుకోవు.
అఖిల్ మేకోవర్...
గతంలో చేసిన సాఫ్ట్ క్యారెక్టర్స్‌కు పూర్తి భిన్నంగా ఇందులో యాక్షన్ రోల్‌లోఎనర్జిటిక్‌గా అఖిల్ కనిపించాడు.. ఈ పాత్ర కోసం మేకోవర్ అయిన తీరు, అతడి లుక్ బాగున్నాయి. అఖిల్‌పై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. మమ్ముట్టి రోల్ రొటీన్‌గా ఉంది. కేవలం సౌత్‌లో బజ్ కోసం అతడిని తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. సాక్షివైద్యను పాటల కోసమే ఈ సినిమాలో ఉంది. స్టైలిష్ విలన్‌గా డినో మారియా యాక్టింగ్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. సంపత్‌రాజ్, మురళీశర్మతో పాటు చాలా మంది నోటెడ్ ఆర్టిస్ట్‌లు ఉన్నా ఎవరికి కథలో ఇంపార్టెన్స్ లేదు.
రొటీన్ ఏజెంట్...
ఏజెంట్ హీరోగా అఖిల్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా. కానీ ఔట్‌డేటెడ్ స్టోరీలైన్ ఆపరేషన్ మిస్ ఫైర్ అయ్యింది. అఖిల్ కష్టం వృథాగా మారింది.