Agent OTT Release: ఏజెంట్ ఓటీటీలో రిలీజవ్వడం డౌటేనా? - ఆలస్యానికి కారణాలు ఇవేనా?
Agent OTT Release: అఖిల్ ఏజెంట్ మూవీ ఓటీటీలో రిలీజవ్వడం అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి నిర్మాణ సంస్థ ఎన్‌వోసీ జారీ చేయలేదని ప్రచారం జరుగుతోంది.
Agent OTT Release: అఖిల్ ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సోనీ లివ్ ఓటీటీ భారీ ధరకు దక్కించుకున్నది. మే 19న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఉండబోతున్నట్లు ప్రకటించింది. కానీ ఆ డేట్‌కు సినిమా రిలీజ్ కాలేదు. అనివార్య కారణాల రిలీజ్‌డేట్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు, త్వరలోనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని సోనీలివ్ ప్రకటించింది. ఆ ప్రకటన చేసి దాదాపు రెండు నెలలు కావొస్తున్న ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్‌పైఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.
థియేట్రికల్ వెర్షన్‌తో పాటు పోలిస్తే చాలా మార్పులతో ఓటీటీలో ఏజెంట్ మూవీ రిలీజ్ కానున్నట్ల, అందుకే రిలీజ్ అలస్యమవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా సోనీ లివ్ సంస్థ వల్లే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోందని నిర్మాత అనిల్ సుంకర ప్రకటించాడు.
ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా సోనీలివ్‌దేనని తమ చేతిలో ఏమీ లేదని తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి నిర్మాణ సంస్థ ఇప్పటివరకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ జారీ చేయలేదని తెలిసింది. ఎన్‌వోసీ లేకుండా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి వీలు లేదు.
అందువల్లే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డిలే అవుతోన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా నిర్మాణ సంస్థకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు మధ్య స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. అందువల్లే నో అబక్షన్ సర్టిఫికెట్ జారీ చేయలేదని అంటున్నారు. ఇదే నిజమైతే ఇప్పట్లో ఏజెంట్ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు ముప్పై కోట్లకుపైగా నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు.