OTT: ఒకే వారం ఓటీటీలోకి వచ్చిన రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు.. మీరు చూశారా?-aerial action movies fighter and operation valentine debuted for ott streaming on this week on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఒకే వారం ఓటీటీలోకి వచ్చిన రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు.. మీరు చూశారా?

OTT: ఒకే వారం ఓటీటీలోకి వచ్చిన రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు.. మీరు చూశారా?

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 23, 2024 02:16 PM IST

OTT: ఒకే వారంలో రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు ఓటీటీలో అడుగుపెట్టాయి. దాదాపు ఒకే థీమ్‍తో రిలీజైన ఫైటర్, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు.. ఇప్పుడు ఒకే వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఆ వివరాలివే..

OTT: ఒకే వారం ఓటీటీలోకి వచ్చిన రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు.. మీరు చూశారా?
OTT: ఒకే వారం ఓటీటీలోకి వచ్చిన రెండు ఏరియల్ యాక్షన్ సినిమాలు.. మీరు చూశారా?

OTT News: యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలు ఉండే ఏరియల్ యాక్షన్ సినిమాలు హాలీవుడ్‍లో చాలా వచ్చాయి. చాలా చిత్రాలు ఫేమస్ అయ్యాయి. అయితే, ఇండియాలో ఇటీవలే ఈ ట్రెండ్ మొదలైంది. భారత తొలి ఏరియల్ యాక్షన్ మూవీ అంటూ ఫైటర్ సినిమా ఈ ఏడాది జనవరి 25వ తేదీన రిలీజ్ అయింది. యుద్ధ విమానాలతో యాక్షన్ ఈ బాలీవుడ్ మూవీలో అలరించింది. ఇదే జానర్‌లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇప్పుడు, ఈ రెండు సినిమాలు ఇదే వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి.

ఫైటర్

ఫైటర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే ఓ మిషన్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. యుద్ధ విమానాలతో యాక్షన్, దేశ భక్తి ఈ చిత్రంలో ప్రధానంగా ఉన్నాయి. జనవరి 25వ తేదీన థియేటర్లలో రిలీజై ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

ఈ వారంలోనే మార్చి 21వ తేదీన ఫైటర్ సినిమా ‘నెట్‍ఫ్లిక్స్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణ్, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒరెబాయ్, రిషబ్ సాహ్నీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.337 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ పతాకాలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఆపరేషన్ వాలెంటైన్

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది. పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ ఏరియల్ యాక్షన్ చిత్రం ఎట్టకేలకు మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 22వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, ప్రస్తుతం తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ మరో నాలుగు వారాల్లో రానుంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పొరుగు దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఎయిర్ ఫోర్స్ చేసిన వైమానిక దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు.

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‍గా నటించారు. నవ్‍దీప్, పరేశ్ పహుజా, రుహానీ శర్మ, మిర్ సర్వార్, షతాఫ్ ఫిగార్ కీలకపాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీకి హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ చేశారు. సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు నిర్మించాయి.

Whats_app_banner