Operation Valentine Review: ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ - వరుణ్ తేజ్ దేశభక్తి మూవీ ఎలా ఉందంటే?
Operation Valentine Review: వరుణ్‌తేజ్, మానుషి చిల్లార్ హీరోహీరోయిన్లుగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఎయిర్‌పోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Operation Valentine Review: రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తుంటాడు మెగా హీరో వరుణ్ తేజ్ (Varun tej). ఆ బాటలోనే వరుణ్ తేజ్ చేసిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. మానుషి చిల్లార్ (Manushi chillar) హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఉంది? ఆపరేషన్ వాలెంటైన్ తో వరుణ్ తేజ్‌కు హిట్ దక్కిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
ఆపరేషన్ వాలెంటైన్ కథ...
అర్జున్ రుద్ర దేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రాన్ లీడర్‌గా పనిచేస్తుంటాడు. దూకుడు ఎక్కువ. దేశం కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడుతుంటాడు. ప్రాజెక్ట్ వజ్ర కోసం రుద్ర చేసిన సాహసం కారణంగా అతడి స్నేహితుడు కబీర్ (నవదీప్) మరణిస్తాడు. ప్రాజెక్ట్ వజ్రను అధికారులు బ్యాన్ చేస్తారు. ఆ సంఘటన కారణంగా అర్జున్ సాహసాలకు బ్రేక్ పడుతుంది.
2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లో పుల్వమాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలభై మంది భారత సైనికులు కన్నుమూస్తారు. పుల్వమా ఎటాక్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఈ సర్జికల్ స్ట్రైక్‌ను సక్సెస్ చేసే బాధ్యతను తీసుకున్న అర్జున్ ఉగ్రమూకలను అంతం చేస్తాడు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి?
ఇండియాపై ఓ సీక్రెట్ కోడ్ పేరుతో పాకిస్థాన్ దాడి చేసేందుకు ఎలాంటి ప్లాన్స్ చేసింది. ఆపరేషన్ వాలెంటైన్ ద్వారా పాక్ దాడులను అర్జున్ అతడి టీమ్ ఎలా తిప్పికొట్టారు? అసలు ఆపరేషన్ వాలెంటైన్ కథేమిటి? వింగ్ కమాండర్ అహ్నగిల్‌తో (మానుషి చిల్లార్) పాటు అర్జున్ ప్రేమాయణం సక్సెస్ అయ్యిందా? లేదా? అన్నదే ఈ మూవీ(Operation Valentine Review) కథ.
ఎయిర్‌ఫోర్స్ ట్రెండ్...
దేశభక్తి అన్నది ఓ ఎవర్ గ్రీన్ ఎమోషన్. ఈ ఎమోషన్‌ను డిఫరెంట్ యాంగిల్స్‌లో చూపిస్తూ ఇండియన్ స్క్రీన్‌పై ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine Review) ఆ కోవకు చెందిన మూవీనే.
ఇండియా, పాకిస్థాన్ మధ్య శత్రుత్వం, యుద్ధం అనే పాయింట్‌తో ఇదివరకు ఎక్కువగా ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమాలు వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో దేశభక్తి కథలను ఎక్కువగా చెప్పేందుకు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉరి నుంచి ఇటీవల విడుదలైన హృతిక్ రోషన్ టైగర్ వరకు ఎన్నో సినిమాలొచ్చాయి. తెలుగులో మాత్రం ఈ జోనర్‌ను ఫస్ట్ టైమ్ ఆపరేషన్ వాలెంటైన్‌తో వరుణ్‌తేజ్ టచ్ చేశాడు.
పుల్వమా ఎటాక్...
2019లో జరిగిన పుల్వమా ఎటాక్...ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్ అంశాల నుంచి స్ఫూర్తి పొందుతూ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine Review) మూవీని తెరకెక్కించాడు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్. సర్జికల్ స్ట్రైక్‌లో వైమానికం దళం చేసిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని రియలిస్టిక్‌గా ఈ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్...
దేశాన్ని కాపాడటంలో వైమానిక దళం పాత్రను ఈ సినిమాలో అర్థవంతంగా చూపించాడు డైరెక్టర్. జెట్ ఫైటర్‌గా హీరో చేసే సాహసాలు, ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. అవన్నీ తెలుగు ఆడియెన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి.
రెగ్యులర్ సినిమాల్లో మాదిరిగా ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ఉండదు. వాస్తవ ఘటనలకు హీరోయిజం మేళివిస్తూ ఎంగేజింగ్, థ్రిల్లింగ్‌గా చెప్పడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సర్జికల్ స్ట్రైక్స్‌తో చాలా సినిమాలొచ్చాయి. ఈ స్ట్రైక్స్ తర్వాత ఏం జరిగింది అన్నది ఆపరేషన్ వాలెంటైన్‌లో డైరెక్టర్ చూపించాడు.
ఎమోషన్ మిస్...
ఆపరేషన్ వాలెంటైన్ సెటప్, యాక్షన్ ఎపిసోడ్స్, యాక్టింగ్ బాగున్నా...స్ట్రాంగ్ ఎమోషన్ కనిపించదు. సర్జికల్ స్ట్రైక్‌ను సక్సెస్ చేయడంలో వైమానిక దళం పడిన కష్టాన్ని పైపైన చెప్పినట్లుగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ సరిగా వర్కవుట్ కాలేదు. ఎయిర్‌ఫోర్స్ అధికారులు వాడే డైలాగ్స్ కామన్ ఆడియెన్స్‌కు అర్థం కావడం కొంత కష్టం అనిపిస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో అక్కడక్కడ కాంప్రమైజ్ అయినట్లుగా అనిపిస్తుంది.
వరుణ్ తేజ్ పర్‌ఫెక్ట్...
జెట్ ఫైటర్ పాత్రకు వరుణ్ తేజ్ పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. ఈ క్యారెక్టర్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ఈ పాత్రకు తగ్గట్లుగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ చక్కటి నటనను కనబరిచాడు. రెగ్యులర్ హీరోయిన్‌లా కాకుండా మానుషి చిల్లార్ నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించింది. నవదీప్, అలీరెజామిగిలిన వారందరూ తమ పాత్రలకు పరిధుల మేర న్యాయం చేశారు.సాంకేతికంగా మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
కంపేరిజన్స్ లేకుండా...
ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు ఆడియెన్స్‌ను సరికొత్త అనుభూతిని పంచే దేశభక్తి మూవీ. బాలీవుడ్, హాలీవుడ్‌లో వచ్చిన ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలను కంపేర్ చేసుకోకుండా చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.
రేటింగ్: 3/5