Varun Tej Matka: మ‌ట్కా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ -మాస్ రోల్ కోసం వ‌రుణ్ తేజ్‌ మేకోవ‌ర్ - ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్‌-varun tej matka movie first glimpse unveiled mega hero varun tej birthday nora fatehi meenakshi choudhary ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Tej Matka: మ‌ట్కా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ -మాస్ రోల్ కోసం వ‌రుణ్ తేజ్‌ మేకోవ‌ర్ - ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Varun Tej Matka: మ‌ట్కా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ -మాస్ రోల్ కోసం వ‌రుణ్ తేజ్‌ మేకోవ‌ర్ - ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 19, 2024 11:58 AM IST

Varun Tej Matka: వ‌రుణ్‌తేజ్ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని మ‌ట్కా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఓపెనింగ్ బ్రాకెట్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మాస్ లుక్‌లో వ‌రుణ్‌తేజ్ క‌నిపిస్తున్నాడు. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీలో వ‌రుణ్‌తేజ్ నాలుగు గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వ‌రుణ్‌తేజ్
వ‌రుణ్‌తేజ్

Varun Tej Matka: వ‌రుణ్‌తేజ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌ట్కా మూవీ ఫ‌స్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. ఓపెనింగ్ బ్రాకెట్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో కంప్లీట్‌గా పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో వ‌రుణ్‌తేజ్ ముఖం మాత్రం చూపించ‌లేదు. అత‌డి కాళ్ల‌ను, క‌ళ్ల‌ను చూపిస్తూ గొంతును మాత్ర‌మే వినిపిస్తూ క‌ట్ చేసిన ఈ వీడియో ఆస‌క్తిని పంచుతోంది.

ఫోన్‌లో ప్రామిస్ అంటూ వ‌రుణ్ తేజ్‌ హామీ ఇచ్చిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. ఇందులో గ్యాంబ్లింగ్ మాఫియా అధిప‌తిగా మాస్ లుక్‌లో వ‌రుణ్‌తేజ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గ‌త సినిమాల‌కు భిన్నంగా ఫుల్ మాసీగా వ‌రుణ్ తేజ్‌ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని చెబుతున్నారు. ఓపెనింగ్ బ్యాకెట్ వీడియోలో న‌వీన్ చంద్ర‌, వ‌రుణ్‌తేజ్ పాత్ర‌ల‌ను చూపించారు. గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌వీన్‌చంద్ర, పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌విశంక‌ర్ క‌నిపించారు.

వ‌రుణ్‌తేజ్ మేకోవ‌ర్‌....

మ‌ట్కా మూవీ క‌థ మొత్తం 1950 నుంచి 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంద‌ని స‌మాచారం. ఇందులో వ‌రుణ్ తేజ్ రోల్ సీరియ‌స్‌గా సాగుతూ ఇంటెన్స్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర కోసం వ‌రుణ్‌తేజ్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యి న‌టిస్తున్నార‌ని అంటున్నారు. 1980 కాలం నాటికి త‌గ్గ‌ట్లుగా లుక్‌, డ్రెస్సింగ్ స్టైల్ లో మార్పులు చేస్తూ వ‌రుణ్ క్యారెక్ట‌ర్‌ను కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్లు సినిమా యూనిట్ చెబుతోంది. మ‌ట్కాలో నాలుగు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో వ‌రుణ్‌తేజ్ క‌నిపిస్తార‌ని అంటున్నారు.

24 ఏళ్ల క‌థ‌...

మ‌ట్కా సినిమాకు క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 1958 నుంచి 1982 మ‌ధ్య కాలంలో సాగే క‌థ ఇద‌ని, ఇర‌వై నాలుగేళ్ల టైమ్ పీరియ‌డ్‌లో ఓ వ్య‌క్తి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? జైలు ఖైదీగా ఉన్న అత‌డు గ్యాంబ్లింగ్ మాఫియాకు ఎలా అధినేత‌గా మారాడ‌న్న‌ది మ‌ట్కా సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా మ‌ట్కా సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు క‌రుణ‌కుమార్ ప్ర‌క‌టించాడు.

నోరా ఫ‌తేహి, మీనాక్షి చౌద‌రి...

మ‌ట్కా సినిమాలో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫ‌తేహీతో పాటు మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో మ‌ట్కా రిలీజ్ కానుంది.

హిట్ కోసం వెయిటింగ్‌...

మెగా హీరో వ‌రుణ్‌తేజ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అత‌డు హీరోగా న‌టించిన గ‌ని, గాండీవ‌ధారి అర్జున సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. మ‌ట్కా విజ‌యం అత‌డికి కీల‌కంగా మారింది. ప్ర‌స్తుతం మ‌ట్కాతో పాటు ఆప‌రేష‌న్ వాలెంటైన్ పేరుతో మ‌రో పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తున్నాడు వ‌రుణ్‌తేజ్. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

మ‌ట్కా, ఆప‌రేష‌న్ వాలైంట‌న్ సినిమాలు 2024లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌రోవైపు ప‌లాస 1978 మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు క‌రుణ‌కుమార్‌. సామాజిక అస‌మాన‌త‌ల్ని చ‌ర్చిస్తూ తెర‌కెక్కిన ఈ మూవీతో తొలి ప్ర‌య‌త్నంలోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్నాడు. ప‌లాస త‌ర్వాత శ్రీదేవిసోడా సెంట‌ర్‌, క‌ళాపురం అనే సినిమాలు చేసినా స‌క్సెస్ మాత్రం అందుకోలేక‌పోయాడు.

IPL_Entry_Point