Operation Valentine 3 days Box Office Collection: బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఆపరేషన్ వాలెంటైన్.. ఫస్ట్ వీకెండ్ ఫెయిల్
Operation Valentine 3 days Box Office Collection: వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తొలి వీకెండ్ కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి.
Operation Valentine 3 days Box Office Collection: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఫస్ట్ వీకెండ్ కూడా ఆ మూవీ దారుణమైన వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కేవలం రూ.6 కోట్లు మాత్రమే.
ఆపరేషన్ వాలెంటైన్ బాక్సాఫీస్
ఆపరేషన్ వాలెంటైన్ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు కూడా మంచి బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులే రూ.17 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో ప్రస్తుతం మూవీ కలెక్షన్లు చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం సందేహంగానే మారింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.6 కోట్ల కలెక్షన్లు అంటే చాలా తక్కువే అని చెప్పాలి.
ఈ సినిమాను వరుణ్ తేజ్ బాగానే ప్రమోట్ చేశాడు. హిందీ కాదుకదా తెలుగులోనూ ఈ సినిమా ఆక్యుపెన్సీ ఎప్పుడూ 50 శాతం దాటలేదు. తొలి షో నుంచే మూవీకి నెగటివ్ రివ్యూలు రావడం కూడా సినిమాను దెబ్బ తీసింది. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగు ప్రేక్షకులు అసలు ఆదరించలేదు.
ఇక హిందీలో అయితే ఈ మధ్యే వచ్చిన ఫైటర్ మూవీ కూడా ఇలాంటి సబ్జెక్ట్ తోనే రావడంతో అక్కడా ఆదరణ లభించలేదు. పుల్వామా దాడి, తర్వాత ఇండియా తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ కు ఈ ఆపరేషన్ వాలెంటైన్ కూడా నిరాశనే మిగిల్చింది.
ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ రిలీజ్
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మూవీకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఓటీటీలోకి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి చివర్లోనే, ఏప్రిల్ తొలి వారంలోనే వరుణ్ తేజ్ మూవీ ప్రైమ్ వీడియోలోకి రావచ్చు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన నెక్ట్స్ మూవీ మట్కాలో నటిస్తున్నాడు.
పలాస మూవీతో హిట్ కొట్టిన కరుణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కెరీర్లో కంచె, ఫిదాలాంటి చాలా కొన్ని హిట్స్ మాత్రమే అందుకున్న వరుణ్ తేజ్.. మరో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ఫస్ట్ వీకెండే దారుణమైన కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. ఇక టేకాఫ్ కావడం కష్టమే.
ఆపరేషన్ వాలెంటైన్ ఎక్కడ బోల్తా పడింది?
ఆపరేషన్ వాలెంటైన్ సెటప్, యాక్షన్ ఎపిసోడ్స్, యాక్టింగ్ బాగున్నా.. స్ట్రాంగ్ ఎమోషన్ కనిపించదు. సర్జికల్ స్ట్రైక్‌ను సక్సెస్ చేయడంలో వైమానిక దళం పడిన కష్టాన్ని పైపైన చెప్పినట్లుగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ సరిగా వర్కవుట్ కాలేదు. ఎయిర్‌ఫోర్స్ అధికారులు వాడే డైలాగ్స్ కామన్ ఆడియెన్స్‌కు అర్థం కావడం కొంత కష్టం అనిపిస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో అక్కడక్కడ కాంప్రమైజ్ అయినట్లుగా అనిపిస్తుంది.
జెట్ ఫైటర్ పాత్రకు వరుణ్ తేజ్ పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. ఈ క్యారెక్టర్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ఈ పాత్రకు తగ్గట్లుగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ చక్కటి నటనను కనబరిచాడు. రెగ్యులర్ హీరోయిన్‌లా కాకుండా మానుషి చిల్లార్ నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించింది.