Operation Valentine OTT: ఓటీటీలోకి వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
Operation Valentine OTT Release: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ పాట్రియాట్రిక్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1 నుంచి థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితం అవుతోన్న ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై క్యూరియాసిటీ పెరిగింది.
Operation Valentine OTT Streaming: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఈ సినిమా నుంచి వచ్చిన అద్భుతమైన పోస్టర్‌లు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, సాంగ్స్‌తో మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ దేశభక్తి సినిమాకు మంచి బజ్ వచ్చింది. భారీ అంచనాల మధ్య మార్చి 1న థియేటర్లలో విడుదలైంది ఆపరేషన్ వాలంటైన్ మూవీ. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేశారు.
ఆపరేషన్ వాలంటైన్ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా చేయగా అతనికి జోడీగా మానుషి చిల్లర్ నటించింది. మానుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ వాలంటైన్ మూవీతోనే మానుషి చిల్లర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు.
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఆపరేషన్ వాలంటైన్ సినిమాను నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే, మార్చి 1న రిలీజైన ఆపరేషన్ వాలంటైన్ మూవీకి మంచి టాక్ వస్తోంది. రివ్యూస్ కూడా పాజిటివ్‌గా వచ్చాయి. ఇక ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు, క్రేజీ మూవీస్ ఏవి లేకపోవడంతో ఆపరేషన్ వాలంటైన్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ్ నటించిన దేశభక్తి మూవీ ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం. అందుకు భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ వాలంటైన్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సుమారు నాలుగు వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్.
అయితే, ఆపరేషన్ వాలంటైన్ టాక్, కలెక్షన్స్, థియేట్రికల్ రన్ దృష్ట్యా ఓటీటీ విడుదల తేదీలో ఏమైనా మార్పుల జరగొచ్చు. ప్రస్తుతానికి అయితే ఆపరేషన్ వాలంటైన్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఏప్రిల్ మొదటి వారంలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఆపరేషన్ వాలంటైన్ హిందీ వెర్షన్ మాత్రం రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఇప్పుడు కేవలం తెలుగు, హిందీలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం వీటితోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో కూడా స్ట్రీమింగ్ చేస్తారని టాక్.
అయితే, ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, అనంతరం ఉగ్రవాదులపై ఎయిర్ ఫోర్స్ అధికారులు తీర్చుకున్న రివేంజ్ కథాంశంగా ఆపరేషన్ వాలంటైన్ తెరకెక్కించినట్లు సమాచారం. సినిమాలో పుల్వామా ఘటనలో జవాన్ల సీన్స్ ఎమోషనల్‌గా ఉందని ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రివేంజ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉందన్నారు.