EC On AP Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్, విచారణ జరపాలని సీఐడీకి ఆదేశం-amaravati ysrcp complaint to ec on tdp false propaganda on land titling act ec orders cid investigation ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec On Ap Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్, విచారణ జరపాలని సీఐడీకి ఆదేశం

EC On AP Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్, విచారణ జరపాలని సీఐడీకి ఆదేశం

Bandaru Satyaprasad HT Telugu
May 04, 2024 06:44 PM IST

EC On AP Land Titling Act : ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ సీఐడీని ఆదేశించింది.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్

EC On AP Land Titling Act : ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్(AP Land Titling Act) ప్రధాన ఆస్త్రంగా మారింది. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టంపై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్(IVRS Calls) కూడా చేస్తుంది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికే వైసీపీ(Ysrcp) ఆరోపిస్తుంది. సీఎం జగన్ దీనిపై స్పష్టత సైతం ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ(EC) ఆదేశించింది. టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని సీఐడీ(సైబర్ సెల్)(CID)ను ఈసీ ఆదేశించింది. విచారణ జరిపి చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

"వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్(AP Land Titling Act) అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్(Jagan) ఓ ల్యాండ్ గ్రాబర్" అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా...వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఈసీ(EC)కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై సీఎం జగన్ వివరణ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ యాక్ట్ తో సొంత ఆస్తులపై ప్రజలకు హక్కులు లేకుండా పోతాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Ap Land Titling Act) పై మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందని చెప్పారు.

భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని జగన్(YS Jagan) గుర్తు చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. భూ యజమాని వద్దే ఆస్తి పత్రాలు ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు (Chandrababu)ప్రచారాలు నమ్మవద్దని కోరారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ కాపీలు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది” అని సీఎం జగన్ గుర్తు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం