MS Dhoni: అతనే వరల్డ్ బెస్ట్ బ్యాటర్.. మా మధ్య ఏజ్ గ్యాప్ ఉంది.. ధోనీ కామెంట్స్.. వీడియో వైరల్-ms dhoni praises virat kohli again and says he is world best batter but still there is age gap ms dhoni video viral ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni: అతనే వరల్డ్ బెస్ట్ బ్యాటర్.. మా మధ్య ఏజ్ గ్యాప్ ఉంది.. ధోనీ కామెంట్స్.. వీడియో వైరల్

MS Dhoni: అతనే వరల్డ్ బెస్ట్ బ్యాటర్.. మా మధ్య ఏజ్ గ్యాప్ ఉంది.. ధోనీ కామెంట్స్.. వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu
Sep 01, 2024 11:10 AM IST

MS Dhoni Comments On Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అని చెప్పిన ఎంఎస్ ధోనీ వారిద్దరి మధ్య ఇప్పటికీ ఏజ్ గ్యాప్ ఉందని, తాను విరాట్‌కు పెద్దన్ననా, ఇంకేమైనా పిలుస్తారో మీ ఇష్టం అని అన్నారు.

అతనే వరల్డ్ బెస్ట్ బ్యాటర్.. మా మధ్య ఏజ్ గ్యాప్ ఉంది.. ధోనీ కామెంట్స్.. వీడియో వైరల్
అతనే వరల్డ్ బెస్ట్ బ్యాటర్.. మా మధ్య ఏజ్ గ్యాప్ ఉంది.. ధోనీ కామెంట్స్.. వీడియో వైరల్

MS Dhoni Comments: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి, మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మధ్య ఉన్న అనుబంధం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఎన్నోసార్లు వీరిద్దరు తమ గురించి పలు వేదికల్లో గొప్పగా చెప్పుకున్నారు. తాజాగా మరోసారి విరాట్ కోహ్లీపై ఎంఎస్ ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్నారు ధోనీకి విరాట్ కోహ్లీ గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో ఎంఎస్ ధోనీ ఆసక్తికర విషయాలు చెప్పారు. "మేం ఇద్దరం 2008-09 నుంచి కలిసి ఆడాం. మా ఇద్దరి మధ్య వయసు రీత్యా వ్యత్యాసం ఉంది. కాబట్టి నేను కోహ్లీకి పెద్దన్ననా.. సహచర ఆటగాడినా మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు. కానీ, చివరికి మాత్రం మేం ఇద్దరం సహచర ఆటగాళ్లం" అని ఎంఎస్ ధోనీ తెలిపారు.

అత్యుత్తమ ఆటగాడు

"మా ఇద్దరిలి ఎవరూ సుధీర్ఘకాలం ఆడారనేది మీకు తెలుసు. ప్రపంచ క్రికెట్ విషయానికొస్తే మాత్రం విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. మేమిద్దరం భారత్ కోసం చాన్నాళ్లు కలిసి ఆడాం. మైదానంలో మేం సహచరులం. ఇప్పటికీ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని చెబుతా" అని ఎంఎస్ ధోనీ వెల్లడించారు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీపై ఎంఎస్ ధోనీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. ఇదిలా ఉంటే, ధోనీ సారథ్యంలోనే విరాట్ ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో విఫలమైన కోహ్లీకి ఎంఎస్ ధోనీ పూర్తి సహాకారం అందించి అండగా నిలిచాడు.

బాధ్యతలు అందుకుని

అలా అవకాశాలు అందుకున్న విరాట్ కోహ్లీ తన టాలెంట్‌తో ఇప్పుడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో తెలుసు. ధోనీ జట్టులో ఉండగానే కెప్టెన్సీ బాధ్యతలు అందుకుని సక్సెస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అలాగే ధోనీపై తనకున్న అభిమానాన్ని ఎన్నోసార్లు చాటుకున్నాడు విరాట్ కోహ్లీ.

ధోనీ తనకు పెద్దన్న అని, తన కెరీర్ ఆరంభంలో తనకు ధోనీ అండగా నిలిచాడని చాలా వరకు ఇంటర్వ్యూల్లో విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అలాగే ధోనీ ఫిట్‌నెస్, అంకిత భావం, బ్యాటింగ్ నైపుణ్యంపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో ఎంఎస్ ధోనీ ఆడటంపై ఇంకా సందిగ్ధత వీడలేనట్లు కనిపిస్తోంది.

సురేష్ రైనా రిక్వెస్ట్

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నిబంధనలకు ఛాన్స్ ఉంటేనే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ ఆడేందుకు రెడీగా ఉంటాడని క్రికెట్ వర్గాల అభిప్రాయం. అయితే, శనివారం (ఆగస్ట్ 31) ధోనీ ఐపీఎల్ 2025లో ఆడాలని సురేష్ రైనా రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

"ధోనీని ఐపీఎల్ 2025 సీజన్‌లో చూడాలని ఉంది. రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్‌గా నిలదొక్కుకోడానికి కాస్తా టైమ్ ఇవ్వాలి. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ టీమ్‌ను సమర్థవంతంగానే నడిపించాడు" అని సురేష్ రైనా మాట్లాడిన విషయం తెలిసిందే.

Whats_app_banner