SRH vs CSK tickets : ఇలా ఓపెన్ చేస్తే- అలా అయిపోయాయి! ‘అంతా ధోనీ మహిమ’
SRH vs CSK 2024 : ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌కి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ 2 గంటల్లోపే సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఇదంతా ధోనీకి ఉన్న క్రేజ్ అంటున్నారు నెటిజన్లు.
SRH vs CSK 2024 tickets : ఈ ఐపీఎల్ 2024లో.. ఉప్పల్ స్టేడియంలో జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే.. మీకు బ్యాడ్ న్యూస్! సోమవారం టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. హాట్ కేక్స్లా అవి అమ్ముడుపోయాయి. 'అంతా ధోనీ మహిమ' అని నెటిజన్లు అంటున్నారు.
ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే..
ఏప్రిల్ 5న, ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకి.. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోనీని లైవ్‌లో చూడాలని.. చాలా మంది ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. టికెట బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా? ఎప్పుడెప్పుడు కొనాలా అని వెయిట్ చేశారు. ఫలితంగా.. సోమవారం.. పేటీఎం ఇన్సైడర్ యాప్‌లో టికెట్లు ఓపెన్ అవ్వగా.. 2 గంటల్లోపే సోల్డ్ ఔట్ అయిపోయాయి!
టికెట్లు బుక్ అయిన కొందరు చాలా సంతోషంతో.. ఆ వివరాలను సోషల్ మీడియాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. టికెట్లు అందని వారు.. బాధపడుతున్నారు. వీటన్నింటి మధ్య.. ట్విట్టర్లో #SRHvsCSK ట్రెండింగ్‌లోకి వచ్చింది.
SRH vs CSK tickets : ఏదిఏమైనా.. ఇతర మ్యాచ్‌లతో పోల్చుకుంటే.. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌కే టికెట్లు హాట్ కేక్స్లా అమ్ముడుపోయాయి. ఇదంతా.. 'ధోనీకి ఉన్న క్రేజ్' అని నెటిజన్లు అంటున్నారు.
"ఉప్పల్ స్టేడియం.. సీఎస్కే ఫ్యాన్స్ కంట్రోల్లోకి వెళ్లబోతోంది. టికెట్లు కొన్ని గంంటల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి," అని ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
"ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో మోత మోగిపోవాలి. మొదటిసారి థలా ధోనీ దర్శనం చేసుకోబోతున్నాను. టికెట్లు దొరికేశాయి," అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.
"హైదరాబాద్.. సిద్ధంగా ఉండు.. ఏప్రిల్ 5న ధోనీ ర్యాపేజ్కి రెడీగా ఉండు," అని మరొకరు కామెంట్ చేశారు.
"మార్చ్ 27న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉంది. దానికి ఇంకా టికెట్లు ఉన్నాయి. కానీ ఏప్రిల్ 5న ఎస్ఆర్హెచ్- సీఎస్కే మ్యాచ్‌కి.. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే అయిపోయాయి. అది.. ధోనీ క్రేజ్," అని ఓ ధోనీ అభిమాని కామెంట్ చేశారు.
ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా..?
SRH vs CSK IPL 2024 tickets : ఇప్పటికే.. సీఎస్కే కెప్టెన్సీని వదిలేసిన మహేంద్ర సింగ్ ధోనీకి.. ఇదే చివరి ఐపీఎల్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ వార్తలపై ధోనీ ఇంకా ఎలాంటి కామెంట్లు చేయలేదు కానీ.. ఫ్యాన్స్‌కి షాక్ ఇవ్వడం ధోనీకి అలవాటైన విషయమే! అందుకే.. ఒకవేళ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అయితే.. తమ ఫేవరెట్ క్రికెటర్ని లైవ్ యాక్షన్‌లో చూసే చివరి ఛాన్స్‌ని మిస్ అవ్వకూడదని అతని అభిమానులు భావిస్తున్నారు. అందుకే.. ధోనీ ఎక్కడికి వెళ్లి మ్యాచ్ ఆడినా.. ఆ స్టేడియం ఫుల్ అయిపోతోంది. అందరు.. లెజెండరీ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి సపోర్ట్ చేస్తున్నారు.
ధోనీ.. ఐపీఎల్ తప్ప వేరే ఏ క్రికెట్ ఆడటం లేదన్న విషయం తెలిసిందే!
సంబంధిత కథనం