Pat Cummins SRH : ‘ఐపీఎల్​ కన్నా అదే కష్టం’- ఎస్​ఆర్​హెచ్​ కెప్టెన్​ కమిన్స్​!-srh vs kkr pat cummins gears up for captaincy debut in t20 ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Srh Vs Kkr Pat Cummins Gears Up For Captaincy Debut In T20

Pat Cummins SRH : ‘ఐపీఎల్​ కన్నా అదే కష్టం’- ఎస్​ఆర్​హెచ్​ కెప్టెన్​ కమిన్స్​!

Sharath Chitturi HT Telugu
Mar 23, 2024 07:37 AM IST

Pat Cummins SRH : ఐపీఎల్​ 2024లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్సీపై స్పందించాడు పాట్​ కమిన్స్​. ఐపీఎల్​ కన్నా ట్రావెలింగ్​ చాలా కష్టమని అన్నాడు.

సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ పాట్​ కమిన్స్​..
సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​ పాట్​ కమిన్స్​.. (PTI)

SRH vs KKR 2024 : ఐపీఎల్​ 2024లో ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ కేకేఆర్​ మ్యాచ్​కి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కొత్త కెప్టెన్​ పాట్​ కమిన్స్​పై కోటి ఆశలు పెట్టుకున్నారు సన్​రైజర్స్​ హైదరాబాద్​ అభిమానులు. కమిన్స్​ సారథ్యంలో జట్టు ఈసారి కచ్చితంగా ట్రోఫీని సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో.. కెప్టెన్సీతో పాటు ఐపీఎల్​పై పలు కీలక వ్యాఖ్యాలు చేశాడు పాట్​ కమిన్స్​.

ట్రెండింగ్ వార్తలు

'ఐపీఎల్​ కన్నా.. అదే చాలా కష్టం!'

పాట్​ కమిన్స్​ని రూ. 20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఎస్​ఆర్​హెచ్​. మాక్రమ్​ స్థానంలో ఎస్​ఆర్​హెచ్​ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు ఈ ఆస్ట్రేలియన్​ స్టార్​ బౌలర్​. అయితే.. ఐపీఎల్​ కన్నా.. రెండు నెలల పాటు ట్రావెలింగ్​ చేయడమే కష్టమని అతను చెప్పాడు.

"టీ20ల్లో నేను ఇప్పటికే కెప్టెన్సీ చేశాను. ఐపీఎల్​లో శనివారం కెప్టెన్​గా నా తొలి మ్యాచ్​. నేను సిద్ధంగా ఉన్నాను. ఐపీఎల్​లో దేని సవాళ్లు దానివే! 6-7 వారల్లో 14 మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది. ఫైనల్స్​ని కూడా లెక్క వేసుకుంటే, అది ఇంకా ఎక్కువే. నేను చాలా టెస్ట్​ క్రికెట్​ ఆడాను. టీ20ల్లో 4 ఓవర్లు వేయడం శరీరానికి పెద్ద పనికాదు. కానీ ట్రావెలింగ్​తో మానసిక ఇబ్బందులు రావొచ్చు. ప్రతిసారి కొత్త జట్టుతో ఆడతాము. అందుకు కొత్తగా సిద్ధం అవ్వాలి," అని కోల్​కతా నైట్​ రైడర్స్​ (కేకేఆర్​) తో మ్యాచ్​కి ముందు జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పాట్​ కమిన్స్​.

Pat Cummins IPL : "ఇదేమీ కొత్త విషయం కాదనుకోండి. ఇలాంటివి ముందు చాలా చేశాము. మ జట్టులో చాలా ఎక్స్​పీరియన్స్​డ్​ ప్లేయర్లు ఉన్నారు. ఇది టీ20 క్రికెట్​. బౌలర్లను ఇష్టమొచ్చినట్టు బాదుతారు. కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్​పీరియెన్స్​ వాడాలి,​" అని కమిన్స్​ అన్నాడు.

ఇంటర్నేషనల్​ లెవల్​లో ఆస్ట్రేలియాకు అనేక విజయాలను అందించిన పాట్​ కమిన్స్​ని భారీ మొత్తానికి కొనుగోలు చేసి, సారథ్య బాధ్యతలు అప్పగించింది ఎస్​ఆర్​హెచ్​. మరీ ముఖ్యంగా.. గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్​ కప్​లో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు కమిన్స్​. అందుకే.. గత రెండు సీజన్​లలో ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ని మళ్లీ ట్రాక్​లో పెట్టే పనిని కమిన్స్​కి అప్పగించింది యాజమాన్యం.

Pat Cummins IPL team : కెప్టెన్సీ ఒక్కటే కాదు.. బౌలింగ్​ పరంగానూ ఎస్​ఆర్​హెచ్​ కెప్టెన్​ పాట్​ కమిన్స్​ తనని తాను నిరూపించుకోవాల్సి ఉంది. జట్టులో సీనియర్​ మోస్ట్​ బౌలర్​ భువనేశ్వర్​ కుమార్​తో కలిసి కమిన్స్​ బౌలింగ్​ చేస్తాడు. టీ నటరాజన్​, జయదేవ్​ ఉనద్కట్​ వంటి బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు.

ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ కేకేఆర్​..

ఐపీఎల్​ 2024 మూడో మ్యాచ్​లో కేకేఆర్​తో తలపడనుంది ఎస్​ఆర్​హెచ్​. ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్​ జరుగుతుంది.

SRH latest news : ఐపీఎల్​ 2024 రెండో మ్యాచ్​.. శనివారం మధ్యాహ్నం జరుగుతుంది. పంజాబ్​ కింగ్స్​తో డీసీ తలపడనుంది.

ఇక మొదటి మ్యాచ్​లో ఆర్​సీబీపై సీఎస్​కే ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసి విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం