Smartphone launches in May : మే నెలలో లాంచ్​కు సిద్ధంగా ఉన్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!-upcoming smartphone launches in may 2023 check full list and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphone Launches In May : మే నెలలో లాంచ్​కు సిద్ధంగా ఉన్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Smartphone launches in May : మే నెలలో లాంచ్​కు సిద్ధంగా ఉన్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu
Apr 21, 2023 10:06 AM IST

Upcoming smartphone launches in May : గూగుల్​ పిక్సెల్​ 7ఏ, రియల్​మీ 11 ప్రో ప్లస్​తో పాటు మరికొన్ని స్మార్ట్​ఫోన్స్​ మే నెలలో రిలీజ్​ అవ్వనున్నాయి. ఆ వివరాలు..

google pixel 7 5g
google pixel 7 5g (Representative image)

Upcoming smartphone launches in May : స్మార్ట్​ఫోన్​ ప్రేమికులకు క్రేజీ న్యూస్​! మే నెలలో పలు ఆసక్తికర, డిమాండ్​ ఉన్న గ్యాడ్జెట్స్​ లాంచ్​కానున్నాయి. గూగుల్​ పిక్సెల్​ నుంచి రియల్​మీ వరకు.. రిలీజ్​కు సన్నద్ధమవుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

గూగుల్​ పిక్సెల్​ 7ఏ..

Google Pixel 7A launch : గూగుల్​ ఐ/ఓ 2023 ఈవెంట్​.. మే 10న జరగనుంది. ఈ ఈవెంట్​లోనే పిక్సెల్​ 7ఏని గూగుల్​ లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో.. 90 హెచ్​జెడ్ రిఫ్రెష్​ రేట్​​తో కూడిన 6.1 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్​787 కెమెరా, లేటెస్ట్​ టెన్సార్​ జీ2 చిప్​సెట్​, ఆండ్రాయిడ్​ 13, 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్స్​ ఉండొచ్చు. డిజైన పరంగా.. ఈ కొత్త మోడల్​ గూగుల్​ పిక్సెల్​ 7ని పోలి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్​..

Google Pixel Fold price : గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్​ కోసం చాలా రోజులుగా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి! ఈ మోడల్​ను మే 10న సంస్థ లాంచ్​ చేసే అవకాశం ఉంది. ఇందులో 5.8 ఇంచ్​ కవర్​ డిస్​ప్లే, 7.69 ఇంచ్​ ఇన్నర్​ డిస్​ప్లే స్క్రీన్స్​ ఉండొచ్చు. ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​తో పాటు 2 పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరాలు​ లభించే అవకాశం ఉంది. టెన్సార్​ జీ2 ప్రాసెసర్​ ఉండొచ్చు.

ఇదీ చదవండి :- Galaxy M14 5G: అధునాతన ఫీచర్లతో శాంసంగ్ నుంచి గెలాక్సీ M14 5G

రియల్​మీ 11 ప్రో ప్లస్​..

Realme 11 Pro Plus release date : 11 ప్రో సిరీస్​ను మే నెలలో లాంచ్​ చేయనున్నట్టు రియల్​మీ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. తొలుత ఇది చైనా మార్కెట్​లో అందుబాటులోకి వస్తుంది. అనంతరం ఇండియాలోకి అడుగుపెడుతుంది! రియల్​మీ 11ప్రో ప్లస్​లో సరికొత్త డైమెన్సిటీ 7000 సిరీస్​ చిప్​సెట్​ను ఉపయోగించే అవకాశం ఉంది. 8ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరా, 200ఎంపీ ప్రైమరీ కెమెరా, మాక్రో లెన్స్​ వంటివి ఉండొచ్చు. 6.7ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే విత్​ కర్వ్​డ్​ ఎడ్జెస్​ ఇందులో ఉండొచ్చు.

రియల్​మీ 11 ప్రో..

Realme 11 Pro price : రియల్​మీ 11 ప్రోలో 108ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ కమెరా సెటప్​ ఉండే అవకాశం ఉంది. డైమెన్సిటీ 7000 సిరీస్​ చిప్​సెట్​ లభించొచ్చు. ఇందుకు సంబంధించిన లాంచ్​ డేట్​ వివరాలు తెలియరాలేదు. అయితే ఈ మోడల్​ కూడా మే నెలలోనే లాంచ్​ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం