పురాతన కాలం నుంచి ఖర్జూరం ప్రపంచవ్యాప్తంగా అనేక వంటకాల్లో ప్రధానమైనదిగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ పిల్లల నుండి పెద్దల వరకు అందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Unsplash
By Anand Sai Jun 14, 2024
Hindustan Times Telugu
రోజుకు రెండు నుంచి నాలుగు ఖర్జూరాలు తీసుకోవడం చాలా మంచిది. ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేక ఉన్నాయి.
Unsplash
వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా ఖర్జూరం తినవచ్చు. కానీ ఎక్కువగా తినవద్దు.
Unsplash
రోజూ 1-2 ఖర్జూరాలను నానబెట్టి తినవచ్చు. ఇది గుండె ఆరోగ్యం నుండి జీవక్రియను పెంచడం వరకు అనేక విధాలుగా సహాయపడుతుంది.
Unsplash
ఖర్జూరంలో ఉండే విటమిన్ బి12 శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. ఇది ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. ఎర్ర రక్త కణాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.
Unsplash
ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీకు ఎముక సమస్యలు, కీళ్ల నొప్పులు ఉన్నట్లయితే మీరు ప్రతిరోజూ ఖర్జూరాన్ని తినవచ్చు. ఎముకల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
Unsplash
మలబద్ధకంతో బాధపడేవారు ఖర్జూరాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Unsplash
ఖర్జూరం తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే అతిగా మాత్రం తినకూడదు. ఎక్కువగా తింటే సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
Unsplash
హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్రమైన రోజుగా భావించే అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30న వస్తుంది. ఈ రోజున దానధర్మాలు, ఆరాధనలు అనంతమైన పుణ్యాన్ని చేకూరుస్తాయని చెబుతారు.