Gold price today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. కొనుగోళ్లకు ఇదే రైట్​ టైమ్​!-gold price today 14th june 2024 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. కొనుగోళ్లకు ఇదే రైట్​ టైమ్​!

Gold price today : దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. కొనుగోళ్లకు ఇదే రైట్​ టైమ్​!

Sharath Chitturi HT Telugu
Jun 14, 2024 05:45 AM IST

Gold price today : దేశంలో పసిడి ధరలు దిగొస్తున్నాయి. వెండి రేటు కూడా పడుతోంది. ఆ వివరాలు..

దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. కొనుగోళ్లకు ఇదే రైట్​ టైమ్​!
దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. కొనుగోళ్లకు ఇదే రైట్​ టైమ్​!

Gold price today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,140కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,61,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,614గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,150కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,160గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,27,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,240గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,300గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,140 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,150గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,590గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,650గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,140గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,150గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,140గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,150గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,190గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,220గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,140గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,150గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,060గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 90,600కి చేరింది. గురువారం ఈ ధర రూ. 90,700గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 95,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 90,600.. బెంగళూరులో రూ. 90,400గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం