Redmi 12C vs Realme C55 : రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55.. ఏది కొంటే బెటర్?-redmi 12c vs realme c55 check detailed comparison of price features and specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi 12c Vs Realme C55 : రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55.. ఏది కొంటే బెటర్?

Redmi 12C vs Realme C55 : రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55.. ఏది కొంటే బెటర్?

Sharath Chitturi HT Telugu
Apr 02, 2023 12:07 PM IST

Redmi 12C vs Realme C55 : రెడ్​మీ 12సీ, రియల్​మీ సీ55.. ఈ రెండు కూడా ఎంట్రీ లెవెల్​ స్మార్ట్​ఫోన్సే. మరి ఈ రెండింట్లో ఏది బెటర్​? ఏది వాల్యూ ఫర్​ మనీ మోడల్​? ఇక్కడ తెలుసుకోండి..

 రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55.. ఏది కొంటే బెటర్​?
రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55.. ఏది కొంటే బెటర్​?

Redmi 12C vs Realme C55 : రూ. 10వేల బడ్జెట్​లోపు మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అనేక స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థల ఎంట్రీ లెవెల్​ మొబైల్స్​ మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రెడ్​మీ 12సీ ఒకటి. ఈ మొబైల్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇక ఇదే సెగ్మెంట్​లో రియల్​మీ సీ55 కూడా ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది వాల్యూ ఫర్​ మనీ మోడల్​? అన్నది తెలుసుకుందాము.

రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55- స్పెసిఫికేషన్స్​..

Redmi 12C specifications : రెడ్​మీ 12సీలో వాటర్​డ్రాప్​ నాచ్​ డిజైన్, రేర్​ మౌంటెడ్​ ఫింగర్​టిప్​ స్కానర్​ ఉన్నాయి. ఇందులో 60 హెచ్​జెడ్​తో కూడిన 6.71 ఇంచ్​ హెచ్​డీ (720X1650 పిక్సెల్స్​) ఎల్​సీడీ స్క్రీన్​ ఉంటుంది.

మరోవైపు రియల్​మీ సీ55లో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​, సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ రీడర్​ ఉంటాయి. ఇందులో 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.72 ఇంచ్​ ఫుల్​ హెచ్​డ+ (1080X2400 పిక్సెల్స్​) ఎల్​సీడీ ప్యానెల్​ ఉంది.

రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55- ఫీచర్స్​..

Redmi 12C features : రెడ్​మీ 12సీలో 50ఎంపీ మెయిన్​ కెమెరా, క్యూవీజీఏ లెన్స్​, ఎల్​ఈడీ ఫ్లాష్​ ఉన్నాయి. ఇక ఫ్రెంట్​లో 5ఎంపీ సెల్ఫీ కెమెరా లభిస్తోంది.

రియల్​మీ సీ55లో 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్​ సెన్సార్​, ఎల్​ఈడీ ఫ్లాష్​ వంటివి వస్తున్నాయి. సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా లభిస్తోంది.

Realme C55 features : రెడ్​మీ 12సీలో హీలియో జీ85 చిప్​సెట్​, 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ ఉన్నాయి. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్​.

ఇక రియల్​మీ సీ55లో హీలియో జీ88 ప్రాసెసర్​, 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ లభిస్తోంది. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్​.

Realme C55 specifications : రెడ్​మీ 12సీలో ఎంఐయూఐ 13 ఆధారిత ఆండ్రాయిడ్​ 12 ఉండగా.. రియల్​మీ సీ55లో రియల్​మీ యూఐ 4.0 ఆధారిత ఆండ్రాయిడ్​ 13 లభిస్తోంది.

రెడ్​మీ 12సీ వర్సెస్​ రియల్​మీ సీ55- ధర..

Redmi 12C price in India : రెడ్​మీ 12సీ 4జీబీ ర్యామ్​/ 64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 8,999. 6జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 10,999. ఏప్రిల్​ 6 నుంచి ఇది అమెజాన్​, ఎంఐ ఈ-స్టోర్​లో అందుబాటులో ఉండనుంది.

Realme C55 price in India : మరోవైపు రియల్​మీ సీ55 4జీబీ ర్యామ్​/ 64జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 10,999. అదే సమయంలో 6జీబీ ర్యామ్​/ 64జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 11,999. ఇక 8జీబీ ర్యామ్​/ 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 13,999. ఈ మోడల్​ ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం