Redmi Note 12 4G, Redmi 12C | రెడ్‍మీ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు లాంచ్: ధరలు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..
Redmi Note 12 4G, Redmi 12C | రెడ్‍మీ నోట్ 12 4జీ, రెడ్‍మీ 12సీ మొబైళ్లు లాంచ్ అయ్యాయి. రెడ్‍మీ 12సీ ఎంట్రీ లెవెల్ మొబైల్‍గా ఉంది.
Redmi Note 12 4G, Redmi 12C | షావోమీ (Xiaomi) సబ్‍బ్రాండ్ రెడ్‍మీ (Redmi).. భారత మార్కెట్‍లోకి మరో రెండు బడ్జెట్ 4జీ ఫోన్‍ను తీసుకొచ్చింది. రెడ్‍మీ నోట్ 12 4జీ (Redmi Note 12 4G), రెడ్‍మీ 12సీ (Redmi 12C) మొబైళ్లు గురువారం లాంచ్ అయ్యాయి. నోట్ 12 సిరీస్‍లో మూడు 5జీ ఫోన్లు ఉండగా.. ఇప్పుడు 4జీ మోడల్ వచ్చింది. రెడ్‍మీ నోట్ 12 4జీ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉంది. మరోవైపు రెడ్‍మీ 12సీ ఎంట్రీ లెవెల్ మొబైల్‍గా ఉంది. ఈ రెండు ఫోన్ల వివరాలు ఇవే.
రెడ్‍మీ నోట్ 12 4జీ స్పెసిఫికేషన్లు
Redmi Note 12 4G Specifications: 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ AMOLED డిస్‍ప్లేను రెడ్‍మీ నోట్ 12 4జీ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 685 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో వస్తోంది.
Redmi Note 12 4G Specifications: రెడ్‍మీ నోట్ 12 4జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్ 4జీ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్ యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
Redmi Note 12 4G ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది.
రెడ్‍మీ 12సీ స్పెసిఫికేషన్లు
Redmi 12C: 6.71 ఇంచుల హెచ్‍డీ+ LCD డిస్‍ప్లేతో రెడ్‍మీ 12సీ వస్తోంది. స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ల చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.
మీడియాటెక్ జీ85 ప్రాసెసర్‌తో ఈ రెడ్‍మీ 12సీ ఫోన్ వస్తోంది. డ్యుయల్ సిమ్ 4జీకి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 13తో అడుగుపెట్టింది. రెడ్‍మీ 12సీ ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెకాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఎంట్రీ లెవెల్ మొబైల్ వచ్చింది.
రెడ్‍మీ నోట్ 12 4జీ, రెడ్‍మీ నోట్ 12సీ ధర, సేల్, ఆఫర్లు
Redmi Note 12 4G Price: రెడ్‍మీ నోట్ 12 4జీ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, షావోమీ అధికారిక వెబ్‍సైట్, ఆఫ్‍లైన్ స్టోర్లలో ఏప్రిల్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది. సన్‍రైస్ గోల్డ్, ఐస్ బ్లూ, లునార్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో లభ్యమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో Redmi Note 12 4G ఫోన్‍ను కొంటే రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.
Redmi Note 12C Price: 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉండే రెడ్‍మీ 12సీ బేస్ వేరియంట్ ధర రూ.8,999, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. ఏప్రిల్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, షావోమీ వెబ్‍సైట్, ఆఫ్‍లైన్ స్టోర్లలో సేల్‍కు అందుబాటులోకి వస్తుంది. మ్యాట్ బ్లాక్, మింట్ గ్రీన్, రాయల్ బ్లూ, లావెండర్ పర్పుల్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
సంబంధిత కథనం