Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 415 స్టాక్‌తో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 204 పాయింట్లు పెరిగి 76,811 వద్ద స్థిరపడింది. నిఫ్టీ.. 76 పాయింట్ల లాభంతో 23,399 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ.. 48 పాయింట్ల లాభంతో 49,847 వద్ద ఓపెన్ అయ్యింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. రేంజ్ బౌండ్‌గా ఉంది. కాస్త కరెక్షన్ కనిపించొచ్చు. 23,400- 23,500 లెవల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. 23,280 వద్ద సపోర్ట్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి బ్రేక్ అయితే.. మంచి మూవ్మెంట్ కనిపించొచ్చు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3033 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 553.88 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Income Tax Return: ఫారం 26 ఏఎస్ అంటే ఏమిటి? ఐటీఆర్ ఫైల్ చేయడానికి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.17శాతం నష్టపోయింది. ఎస్ అండ్ పీ 500 0.23శాతం, నాస్డాక్ 0.34శాతం మేర పెరిగాయి.
స్టాక్స్ టు బై..
ఉషా మార్టిన్:- బై రూ. 415, స్టాప్ లాస్ రూ. 399, టార్గెట్ రూ. 440
గ్రాసిమ్ ఇండస్ట్రీస్:- బై రూ. 2458, స్టాప్ లాస్ రూ. 2390, టార్గెట్ రూ. 2580
IGL share price target : ఐజీఎల్:- బై రూ. 487, స్టాప్ లాస్ రూ. 475, టార్గెట్ రూ. 510
హెచ్‌సీఎల్ టెక్నాలజీ:- బై రూ. 1445, స్టాప్ లాస్ రూ. 1410, టార్గెట్ రూ. 1520
మహీంద్రా అండ్ మహీంద్రా:- బై రూ. 2870, స్టాప్ లాస్ రూ. 2830, టార్గెట్ రూ. 2930
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం