(1 / 6)
జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు జూన్ 14న రాత్రి 10:55 గంటలకు మిథున రాశిలో సంచరిస్తాడు.జూన్ 29 వరకు అక్కడే ఉంటాడు. బుధుడు సాధారణంగా ప్రయోజనకరమైన వాక్కు, తెలివితేటలకు అధిపతి. దీనివల్ల కొన్ని రాశులకు వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి.
(2 / 6)
మిథునంలో బుధుడు, శుక్రుడి కలయిక కొన్ని రాశులకు చెడు ఫలితాలను ఇస్తుంది. ఏయే రాశుల వారికి వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయో ఓ సారి చూద్దాం.
(3 / 6)
వృశ్చిక రాశి : బుధుడు వృశ్చిక రాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నారు. దీనివల్ల కార్యాలయంలో వృశ్చికరాశి వారిపై ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రయత్నాలు ఫలించవు. మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. మీపై మీ పట్టు తగ్గుతుంది.డ బ్బు ఖర్చు అయిపోతుంది.
(4 / 6)
కుంభం : కుంభ రాశి వారికి బుధ సంచారం జరుగుతుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి సమతుల్యమైన వృద్ధికి ఆటంకం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి పెద్దగా లాభాలు ఉండవు. కార్యాలయంలో తోటి పోటీదారుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు. నిద్ర సరిగా రాదు.కుటుంబంలో అలజడులు అధికమవుతాయి. ఆందోళనలు పెరుగుతాయి.
(5 / 6)
మకరం : బుధుడి సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. మీ వ్యంగ్య మాటలకు దూరంగా ఉండండి. కాకపోతే కొత్త ఒప్పందాలు చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త శత్రువులు ఏర్పడతారు. అప్పులు చేసి ఖర్చు చేస్తే ఇబ్బందులకు గురవుతారు.
(6 / 6)
మీన రాశి : ఈ కాలంలో పోటీదారులతో సమస్యలు ఎదుర్కొంటారు.కార్యాలయంలో సహోద్యోగులు మీ ఎదుగుదలను ఇష్టపడరు. నష్టాలు అధికమవుతాయి.
ఇతర గ్యాలరీలు