Xiaomi 14 Civi : షావోమీ 14 సివి.. ఇదే ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​! ఫీచర్స్​ చెక్​ చేయండి..-xiaomi 14 civi launched in india check out specifications features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi 14 Civi : షావోమీ 14 సివి.. ఇదే ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​! ఫీచర్స్​ చెక్​ చేయండి..

Xiaomi 14 Civi : షావోమీ 14 సివి.. ఇదే ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​! ఫీచర్స్​ చెక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Jun 14, 2024 06:51 AM IST

Xiaomi 14 Civi price : స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్​వోసీ, లైకా కెమెరాలతో షావోమీ 14 సివి మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. షావోమీ 14 సివి స్మార్ట్​ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర ఇక్కడ చూడండి.

షావోమీ 14 సివి
షావోమీ 14 సివి (HT Tech)

Xiaomi 14 Civi price in India : శక్తివంతమైన కెమెరా స్పెసిఫికేషన్లతో షావోమీ తన కొత్త సివి-సిరీస్ స్మార్ట్​ఫోన్​ని భారతదేశంలో ఇటీవలే లాంచ్​ చేసింది. షావోమీ 14 సివి కంపెనీకి చెందిన ఫ్లాగ్​షిప్​ షావోమీ 14 సిరీస్​లో ఒక భాగం. ఇది కెమెరా పనితీరుపై దృష్టి పెడుతుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్​ఓసీతో వస్తున్న రెండో స్మార్ట్​ఫోన్ ఇది. షావోమీ 14 సివి కెమెరాపై దృష్టి పెట్టడమే కాకుండా స్మార్ట్​ఫోన్​ పనితీరుకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. షియోమీ 14 సివి గురించి మరింత తెలుసుకోండి.

షావోమీ 14 సివి స్పెసిఫికేషన్లు..

ఈ షావోమీ 14 సివి స్మార్ట్​ఫోన్​లో 6.55 ఇంచ్​ క్వాడ్ కర్వ్డ్ 1.5కే అమోఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డిఆర్ 10+, డాల్బీ విజన్ ఉన్నాయి. అదనంగా, ఈ షావోమీ స్మార్ట్​ఫోన్​ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో వస్తోంది. ఫోన్​ డ్యామేజ్​ అవ్వకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్​తో పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్.. షావోమీ 14కు శక్తినిచ్చే ఫ్లాగ్​షిప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కు సమానమైన పనితీరును అందిస్తుంది. స్టోరేజ్ కోసం, షావోమీ 14 సివి 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్​ని అందిస్తుంది.

Xiaomi 14 Civi features : ఈ స్మార్ట్​ఫోన్​లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటఫ్​ ఉంటుంది. ఇందులో 50 ఎంపీ లైకా సమ్మిలక్స్ ప్రైమరీ కెమెరా 25 ఎంఎం సినిమాటిక్ హెచ్డిఆర్, 50 మెగాపిక్సెల్ లైకా పోర్ట్రెయిట్ టెలిఫోటో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ లైకా అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. ముందువైపు 32 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఇది కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యాలతో పనిచేస్తుంది. ఇది మీ సెల్ఫీ ఎక్స్​పీరియెన్స్​ని పెంచుతుందని సంస్థ పేర్కొంది. చివరిగా.. ఈ స్మార్ట్​ఫోన్​ 4700 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్​పై ఇది పనిచేస్తుంది.

షావోమీ 14 ధర..

Xiaomi 14 Civi specifications : షావోమీ 14 సివి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది: క్రూయిజ్ బ్లూ, మాచా గ్రీన్, షాడో బ్లాక్. షావోమీ 14 సివి 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.42,999. ఫ్లిప్​కార్ట్, షియోమీ అధికారిక వెబ్ సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా, కొనుగోలుదారులు రూ .3000 బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. షియోమీ 14 సివి ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే మొదలయ్యాయి. జూన్​ 20 నుంచి సేల్స్​ మొదలవుతాయి.

మరో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో ఉంది. టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం ఛానెల్​ని ఫాలో అవ్వండి.

WhatsApp channel

సంబంధిత కథనం