ysr pelli kanuka scheme: వైఎస్సార్ పెళ్లి కానుక స్కీమ్ సాయం అర్హతలు దరఖాస్తు ఇలా-ysr pelli kanuka scheme eligibility and application process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysr Pelli Kanuka Scheme Eligibility And Application Process

ysr pelli kanuka scheme: వైఎస్సార్ పెళ్లి కానుక స్కీమ్ సాయం అర్హతలు దరఖాస్తు ఇలా

Praveen Kumar Lenkala HT Telugu
Mar 01, 2022 12:29 PM IST

Ysr pelli kanuka scheme details: వైఎస్సార్ పెళ్లి కానుక పేరుతో ఆడ బిడ్డ పెళ్లికి చేయూత ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాహ సమయంలో రూ. లక్ష మేర సాయం చేస్తోంది.పేదింటి తల్లిదండ్రులకు సాయంగా నిలవడం, వివాహాలు రిజిస్టర్ అయ్యేలా చూడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

నూతన దంపతులు (ప్రతీకాత్మక చిత్రం)
నూతన దంపతులు (ప్రతీకాత్మక చిత్రం) (unsplash)

Ysr pelli kanuka scheme details: వైఎస్సార్ పెళ్లి కానుక పేరుతో ఆడ పిల్లల వివాహ సమయంలో వారి తల్లిదండ్రులకు చేయూతగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాహ సమయంలో రూ. లక్ష మేర కానుకగా ఇస్తోంది. పేదింటి తల్లిదండ్రులకు సాయంగా నిలవడం, వివాహాలు రిజిస్టర్ అయ్యేలా చూడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

Ysr pelli kanuka scheme eligibility: వైఎస్సార్ పెళ్లికానుక పొందాలంటే అర్హతలు

వైఎస్సార్ పెళ్లి కానుక స్కీమ్‌ పొందాలంటే పెళ్లి కూతురు వివాహ సమయానికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అబ్బాయి వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి. మొదటి సారి వివాహానికి మాత్రమే వర్తిస్తుంది.

ఒక వేళ వితంతువు అయితే ఈ షరతు నుంచి మినహాయింపు లభిస్తుంది.

దరఖాస్తు చేసుకునే సమయానికి వివాహ తేదీ, వివాహ స్థలం నిశ్చయమవ్వాలి. వివాహం ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలి.

పెళ్లి కూతురు ఆంధ్రప్రదేశ్ స్థానికులై ఉండాలి. పెళ్లి కుమారుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, యానాం, ఒడిశాకు చెందినవారై ఉండొచ్చు.

పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు ప్రభుత్వ ప్రజాసాధికార సర్వేలో నమోదైన వారై ఉండాలి. ఒకవేళ పెళ్లి కుమారుడు పొరుగు రాష్ట్రానికి చెందిన వారైతే ఈ షరతు నుంచి మినహాయింపు ఉంటుంది.

వివాహానికి కనీసం ఐదు రోజుల ముందు ఈ పథకానికి (Ysr pelli kanuka scheme) దరఖాస్తు చేసుకోవాలి.

పెళ్లి కూతురు తల్లిదండ్రులు దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.

Ysr pelli kanuka documents: వైఎస్సార్ పెళ్లి కానుక దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

వైఎస్సార్ పెళ్లి కానుక దరఖాస్తుతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు జమ చేయాలి. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి ఆధార్ కార్డులు, ఇద్దరివీ మీ సేవా ఇంటిగ్రేటెడ్ ధ్రువపత్రాలు, అక్షరాస్యులైతే ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్ అవసరం.

తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, వికలాంగులైతే సదరం పత్రం, వివాహ శుభ లేఖ, పెళ్లి కూతురు బ్యాంకు ఖాతా స్కానింగ్ కాపీ జత చేయాల్సి ఉంటుంది.

Ysr pelli kanuka scheme application process: వైఎస్సార్ పెళ్లి కానుక దరఖాస్తు ప్రక్రియ ఇలా..

మండల కేంద్రంలోని మెప్మా ఆఫీసులో గానీ, మండల సమాఖ్యలోగానీ వివాహానికి కనీసం ఐదు రోజుల ముందు వైఎస్సార్ పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవాలి.

కళ్యాణ మిత్ర ద్వారా క్షేత్రస్థాయి ఎంక్వైరీ జరుగుతుంది. ఆ వెంటనే 20 శాతం నిధులు పెళ్లి కూతురి ఖాతాలో జమవుతాయి.

తదుపరి వివాహ సమయంలో కళ్యాణ మిత్ర ఫోటో తీసుకుని ధ్రువీకరణ పంపితే మిగిలిన 80 శాతం నిధులు జమవుతాయి.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలైతే ఈ వైఎస్సార్ పెళ్లి కానుక కింద రూ. లక్ష సాయం అందుతుంది.

కులాంతర వివాహమైతే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుకు రూ. 1.20 లక్షల సాయం అందుతుంది.

బీసీ అయితే రూ. 50 వేలు, బీసీ కులాంతర వివాహమైతే రూ. 75 వేలు సాయం అందుతుంది.

దివ్యాంగులైతే వైెఎస్సార్ పెళ్లి కానుక స్కీమ్ (Ysr pelli kanuka scheme) ద్వారా రూ. 1.5 లక్షల సాయం అందుతుంది.

IPL_Entry_Point