TTD : జులై 1 నుంచి కళ్యాణమస్తు రిజిస్ట్రేషన్లు.... ఆగష్టు 7న సామూహిక వివాహాలు-andhra pradesh kalyanamastu registrations from july 1st ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : జులై 1 నుంచి కళ్యాణమస్తు రిజిస్ట్రేషన్లు.... ఆగష్టు 7న సామూహిక వివాహాలు

TTD : జులై 1 నుంచి కళ్యాణమస్తు రిజిస్ట్రేషన్లు.... ఆగష్టు 7న సామూహిక వివాహాలు

HT Telugu Desk HT Telugu
Jun 18, 2022 09:50 AM IST

రాష్ట్రంలో పుష్కరకాలం క్రితం నిలిచిపోయిన సామూహిక ఉచిత వివాహాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కళ్యాణమస్తు పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఉచిత వివాహాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణమస్తు ముహుర్త పత్రికకు తిరుమల శ్రీవారి పాదాల చెంత పూజలు నిర్వహించారు.

<p>కళ్యాణమస్తు ముహుర్త పత్రికకు పూజలు నిర్వహిస్తున్న టీటీడీ అధికారులు</p>
కళ్యాణమస్తు ముహుర్త పత్రికకు పూజలు నిర్వహిస్తున్న టీటీడీ అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన 7వ విడత కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జులై 1వ తేదీ నుంచి వివాహాలను న‌మోదు చేసుకోవాల‌ని టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి సూచించారు. కల్యాణ‌మ‌స్తు కార్యక్రమ ముహూర్త ప‌త్రిక‌కు తిరుమ‌ల శ్రీ‌వారి పాదాల వ‌ద్ద ఉంచి ప్రత్యేక పూజ‌లు నిర్వహించారు. శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో పూజ‌లు చేప‌ట్టిన తర్వాత అక్కడి నుంచి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ‌ ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్దకు చేరుకున్నారు.

ఆగ‌స్టు 7న ఉదయం 8 గం.07 నిమిషాల నుండి 8 గం. 17 నిమిషాల మధ్య పండితులు సుముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వివాహం జరుపుకోడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో పేర్లను న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో క‌ల్యాణ‌మ‌స్తు కార్యక్రమం నిర్వహిస్తామ‌ని, దంపతులకు పెళ్లిదుస్తులు, పుస్తెలు, మెట్టెలు అందిచడంతో పాటు పెళ్లి భోజ‌నం వ‌డ్డిస్తారని చెప్పారు. 

పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయించిన‌ట్టు ఈవో చెప్పారు. రాష్ట్రంలో ప‌దేళ్ల త‌రువాత క‌ల్యాణ‌మ‌స్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభించామ‌ని, మొద‌ట ఆంధ్రప్రదేశ్‌లో నిర్వఃహించి ఆ త‌రువాత ఇత‌ర రాష్ట్రాల్లో చేప‌డ‌తామ‌న్నారు.

Whats_app_banner