Inter Caste Marriage | కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వ సాయం ఎంత? ఎవరు అర్హులు?-inter caste marriage incentive eligibility and application process ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Inter Caste Marriage | కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వ సాయం ఎంత? ఎవరు అర్హులు?

Inter Caste Marriage | కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వ సాయం ఎంత? ఎవరు అర్హులు?

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 11:38 AM IST

Inter Caste Marriage.. కులాంతర వివాహం చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఆ జంటకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అయితే ఈ జంటలో పెళ్లి కూతురు అయినా, పెళ్లి కొడుకైనా షెడ్యూలు కులాల(ఎస్సీ)కు చెందిన వారై ఉండాలి.

వివాహ బంధం (ప్రతీకాత్మక చిత్రం)
వివాహ బంధం (ప్రతీకాత్మక చిత్రం) (unsplash)

ఇంటర్‌ క్యాస్ట్‌ (కులాంతర) వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఆ జంటలో పెళ్లి కూతురు అయినా, పెళ్లి కొడుకైనా షెడ్యూలు కులాల(ఎస్సీ)కు చెందిన వారై ఉంటేనే ఇందుకు అర్హత లభిస్తుంది. 

అక్టోబరు ౩౦, 2019 తరువాత వివాహం చేసుకున్న వారైతే రూ. 2.5 లక్షల ఆర్థిక ప్రోత్సాహం అందుకునేందుకు అర్హులు. అంతకుముందు వివాహం చేసుకున్న వారైతే రూ. 50 వేల మేర ప్రోత్సాహం అందుకునేందుకు అర్హులు.

ఏయే ధ్రువీకరణ పత్రాలు అవసరం?

1. అమ్మాయి, అబ్బాయి ఆధార్‌ కార్డు,

2. ఇద్దరూ కలిపి తీసుకున్న జాయింట్‌ బ్యాంకు ఖాతా,

3. ఇద్దరి కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు

4. వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌

5. విట్‌నెస్‌ ఆధార్

6. అమ్మాయి, అబ్బాయి శాశ్వత, తాత్కాలిక చిరునామాలు

ఆయా ధ్రువీకరణ పత్రాలపై సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది.

ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్ ఇన్సెంటివ్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్ ఇన్సెంటివ్‌ కోసం వధూవరులు తెలంగాణ ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆన్ లైన్ దరఖాస్తులను సంబంధిత జిల్లా వెల్ఫేర్ అధికారి (దంపతులలో ఎస్సీ ఎవరైతే వారికి సంబంధించిన సొంత జిల్లా) పరిశీలించి ఆన్ లైన్ దరఖాస్తులను ఆమోదించి ట్రెజరీ అధికారులకు పంపిస్తారు.

ట్రెజరీ ఆ బిల్లు పాస్ చేసి జిల్లా అధికారి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవార్డు ఖాతాలో జమచేస్తుంది. జిల్లా అధికారి దంపతుల జాయింట్ ఖాతాలో జమచేస్తారు. ఇది మూడేళ్లపాటు తీయడానికి వీలులేని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంటుంది.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం