ysr kalyanamasthu: గుడ్ న్యూస్… అక్టోబర్ 1 నుంచి YSR కళ్యాణమస్తు, షాదీ తోఫా-ap govt announced ysr kalyanamasthu and shaadi tohfa schemes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Kalyanamasthu: గుడ్ న్యూస్… అక్టోబర్ 1 నుంచి Ysr కళ్యాణమస్తు, షాదీ తోఫా

ysr kalyanamasthu: గుడ్ న్యూస్… అక్టోబర్ 1 నుంచి YSR కళ్యాణమస్తు, షాదీ తోఫా

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 14, 2022 10:57 AM IST

ysr kalyanamasthu and ysr shaadi tohfa: ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 1 నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది.

<p>ఏపీ సర్కార్ గుడ్ న్యూస్</p>
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ (twitter)

ysr kalyanamasthu and shaadi tohfa: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ అమలు చేయనుంది.

ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద రూ. 1 లక్ష

ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు

ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు

ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు

బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద రూ.50వేలు

బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు

మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు.

దివ్యాంగులు వివాహాలకు రూ. 1.5 లక్షలు

భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40వేలు

AP Govt New Schemes 2022: కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లు అవుతుందని వెల్లడించింది.

అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అన్ని అర్హతలను జీవోలో పొందుపరిచిన ఏపీ ప్రభుత్వం.. పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. వీటి ద్వారా పథకం నిర్వహణ చేపట్టనుంది.

Whats_app_banner