YS Sharmila On Jagan : గుట్టల్ని కొట్టడం, భూములను మింగడం విశాఖపై వైసీపీ విజన్- వైఎస్ షర్మిల సెటైర్లు-visakhapatnam news in telugu congress chief ys sharmila criticizes cm jagan on visakha vision ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila On Jagan : గుట్టల్ని కొట్టడం, భూములను మింగడం విశాఖపై వైసీపీ విజన్- వైఎస్ షర్మిల సెటైర్లు

YS Sharmila On Jagan : గుట్టల్ని కొట్టడం, భూములను మింగడం విశాఖపై వైసీపీ విజన్- వైఎస్ షర్మిల సెటైర్లు

Bandaru Satyaprasad HT Telugu
Mar 06, 2024 03:08 PM IST

YS Sharmila On Jagan : గుట్టల్ని కొట్టడం, భూములు మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని వైఎస్ షర్మిల విమర్శించారు. పరిపాలనా రాజధాని అని చెప్పి మూడేళ్లు మోసం చేయడమే వైసీపీ కమిట్మెంట్ అంటూ సెటైర్లు వేశారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila On Jagan : ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటా, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ విశాఖ విజన్(Visakha Vision) సమావేశంలో ప్రకటించారు. సీఎం జగన్ ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)ప్రశ్నలు సంధించారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు ఎందుకు పాలన మొదలు పెట్టలేదని, ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. పరిపాలన రాజధాని(Visakha Executive Capital) అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం వైసీపీ (Ysrcp)చేతకాని కమిట్మెంట్ అంటూ సెటైర్లు వేశారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం వైసీపీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం జగన్ విజన్ అంటూ విమర్శలు చేశారు. రైల్వే జోన్ (Railway Zone)పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం వైసీపీ ప్రాక్టికల్ అన్నారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారన్నారు.

సీఎం జగన్ ఏమన్నారంటే?

ఎన్నికల తర్వాత విశాఖలోనే (Visakhapatnam)ఉంటానని సీఎం జగన్ నిన్నటి సభలో అన్నారు. 'విజన్ వైజాగ్' (Vision Vizag)పేరిట మంగళవారం విశాఖలో పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని, సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు.

కాంగ్రెస్ టికెట్లకు భారీ డిమాండ్

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆదరణ పెరిగినట్లు తెలుస్తోంది. విభజన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ల(Congress Tickets) కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు 1150 దరఖాస్తులు రాగా, 25 లోక్ సభ స్థానాలకు 170 దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. గత రెండు ఎన్నికల్లో ఉచితంగా టికెట్లు ఇస్తామన్నా ఆదరణ కరవైంది. వైఎస్ షర్మిల(YS Sharmila) రాకతో ఏపీ కాంగ్రెస్(AP Congress) జోష్ పెరిగింది. ఈసారి డబ్బులు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 29 వరకూ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 5, 6 తేదీలలో టికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో షర్మిల ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఈ నెల 6న తిరుపతి, చిత్తూరు జిల్లా ఆశావాహులతో వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థితో ముఖాముఖి మాట్లాడి, బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సమాయత్తం అవుతున్నారు. ముఖాముఖి భేటీ అనంతరం అభ్యర్థుల వివరాలను అధిష్ఠానానికి పంపనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం