CM Jagan : ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటా, సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం- సీఎం జగన్
CM Jagan : చెన్నై, బెంగళూరు, హైదరాబాద్(Hyderabad)కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలో ఉంటానని, సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు.
CM Jagan : ఎన్నికల తర్వాత విశాఖలోనే (Visakhapatnam)ఉంటానని సీఎం జగన్ అన్నారు. 'విజన్ వైజాగ్' (Vision Vizag)పేరిట విశాఖలో పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని, సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్(Hyderabad)కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉండాలన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనాతో సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి రాజధానికి(Amaravati Capital) తాను వ్యతిరేకం కాదన్న సీఎం జగన్... శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు. అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు అవసరం అన్నారు. అక్కడ 50 వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏంలేదన్నారు.
పెండింగ్ రుణాలు మాఫీ
హైదరాబాద్ కంటే వేగంగా వైజాగ్(Vizag) అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయామన్నారు. వ్యవసాయ రంగంలో ఏపీ 70 శాతం వృద్ధి రేటు సాధించిందన్నారు. ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా ఉందన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామన్నారు. దీంతో పాటు ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యాయన్నారు. ఏపీ సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. నిరుద్యోగం తగ్గింది ఉపాధి అవకాశాలు మెరుగుపర్చామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశామన్నారు.
విశాఖ ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్
"బెంగళూరు కంటే వైజాగ్‌లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు ఏపీ ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రతిపక్షాలకు లబ్ది కలిగిస్తున్నాయి. కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ(Visakha) దెబ్బతింటుంది. విశాఖ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాల్సి ఉంది. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తాం. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తాం" -సీఎం జగన్
అన్ని సౌకర్యాలతో విశాఖ అభివృద్ధి
విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు విశాఖకు కనెక్టివిటీని మెరుగు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ కే పరిమితమయ్యాయన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఏపీ అభివృద్ధికి రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకమన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
సంబంధిత కథనం