Gummanur Jayaram Resigns : వైసీపీకి మరో షాక్, మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా-vijayawada news in telugu minister gummanur jayaram resigned to ysrcp joins tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gummanur Jayaram Resigns : వైసీపీకి మరో షాక్, మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా

Gummanur Jayaram Resigns : వైసీపీకి మరో షాక్, మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా

Bandaru Satyaprasad HT Telugu
Mar 05, 2024 12:45 PM IST

Gummanur Jayaram Resigns : మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులకు సైతం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ చేరుతున్నట్లు ప్రకటించారు.

గుమ్మనూరు జయరాం రాజీనామా
గుమ్మనూరు జయరాం రాజీనామా

Gummanur Jayaram Resigns : అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి షాక్ లు తగులుతున్నాయి. వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) రాజీనామా చేశారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. గుమ్మనూరు అనుచరులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన గుమ్మనూరు జయరాం... వైసీపీ(Ysrcp), ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వసిస్తున్న జయహో బీసీ సభలో... చంద్రబాబు సమక్షంలో టీడీపీ(TDP)లో చేరుతున్నట్లు జయరాం తెలిపారు. సీఎం జగన్(CM Jagan) విధానాలపై విసుగుచెందానని గుమ్మనూరు విమర్శలు చేశారు. కర్నూలు (Kurnool)ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ కోరారని, అది తనకు ఇష్టం లేదన్నారు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గుడిలో శిల్పంలాగా జగన్‌ తయారయ్యారని, తాడేపల్లిలోని ఇద్దరు పూజారులు ఉన్నారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని గుమ్మనూరు ఆరోపించారు.

వైసీపీ ఎమ్మెల్యే సస్పెండ్

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu)...ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో ఆరణి శ్రీనివాసులు పవన్ కల్యాణ్ ను కలిశారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పుచేర్పుల్లో చిత్తూరు అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు... ఆ పార్టీని విడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పవన్ తో భేటీ అయ్యారని, త్వరలోనే ఆరణి జనసేనలో చేరనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అవ్వడంతో సీఎం జగన్ (CM Jagan) ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ(Ysrcp) కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ముందు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టికెట్ ఆశించిన నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత పార్టీలో టికెట్ రాదని ఫిక్స్ అయిన నేతలు... పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

వైసీపీ ఖాళీ అవుతుంది-టీడీపీ

ఏపీలో వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పటి వరకూ ఆరుగురు ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారని తెలిపింది. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టికెట్లు రాని వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీని విడారు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేశారు. నేడు టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

సంబంధిత కథనం