Ysrcp Suspended Chittoor Mla : పవన్ కల్యాణ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే, సస్పెండ్ చేసిన సీఎం జగన్
Ysrcp Suspended Chittoor Mla : చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును సీఎం జగన్ సస్పెండ్ చేశారు. ఆరణి శ్రీనివాసులు..పవన్ కల్యాణ్ భేటీ కావడంతో వైసీపీ ఆయను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Ysrcp Suspended Chittoor Mla : చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu)... జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో ఆరణి శ్రీనివాసులు పవన్ కల్యాణ్ ను కలిశారు. నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ల మార్పుచేర్పుల్లో చిత్తూరు అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు... ఆ పార్టీని విడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పవన్ తో భేటీ అయ్యారని, త్వరలోనే ఆరణి జనసేనలో చేరనున్నట్లు సమాచారం.
చిత్తూరు ఎమ్మెల్యే సస్పెండ్
పవన్ కల్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అవ్వడంతో సీఎం జగన్ (CM Jagan)సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాసులను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ(Ysrcp) కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ముందు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్(AP Assembly Elections) రానుంది. దీంతో టికెట్ ఆశించిన నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత పార్టీలో టికెట్ రాదని ఫిక్స్ అయిన నేతలు... పక్క పార్టీల వైపు చూస్తున్నారు.
వైసీపీని వీడుతున్న నేతలు
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టికెట్లు రాని వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.ఆరుగురు ఎంపీలు ఆ పార్టీని విడారు. ఐదుగురు లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీ వైసీపీని(Ysrcp) విడారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీని విడారు.
టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎంపీతో పాటు మరికొందరు నేతలు టీడీపీలో చేరారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో నిర్వహించిన సభలో చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
సంబంధిత కథనం