Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్- ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల జులై కోటా విడుదల ముఖ్య తేదీలివే!-tirumala srivari darshan online tickets arjitha seva july quota tokens released in april details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్- ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల జులై కోటా విడుదల ముఖ్య తేదీలివే!

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్- ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల జులై కోటా విడుదల ముఖ్య తేదీలివే!

Bandaru Satyaprasad HT Telugu
Apr 17, 2024 08:38 AM IST

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, వివిధ సేవలు, వసతి టికెట్ల జులై కోటాను టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ 18 నుంచి 27వ తేదీ వరకూ ఈ టోకెన్లు జారీ చేయనున్నారు.

ఆర్జిత సేవలు, దర్శనం జులై కోటా విడుదల తేదీలు
ఆర్జిత సేవలు, దర్శనం జులై కోటా విడుదల తేదీలు

Tirumala Darshan Tickets : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(Arjitha Seva Tickets) జులై నెల కోటాను(July Quota Tickets) ఏప్రిల్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో(TTD Online Tickets) విడుదల చేయ‌నుంది. ఆర్జిత సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు భక్తులకు మంజూరు చేస్తారు. ఈ టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

yearly horoscope entry point

ఏప్రిల్ 22న వర్చువల్ సేవల కోటా విడుదల(Tirumala Virtual Seva Quota)

తిరుమల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఏప్రిల్ 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు(TTD Angapradakshinam Tokens)

జులై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా(TTD Srivani Online Tokens)

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జులై నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ఏప్రిల్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల(TTD Special Darshan Tickets)

జులై నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల(రూ.300) కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌(TTD Rooms Booking)

తిరుమల, తిరుపతిల‌లో జులై నెల గదుల కోటాను ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఏప్రిల్ 27న శ్రీవారి సేవ కోటా విడుదల(Srivari Seva Tokens)

ఏప్రిల్ 27న శ్రీవారి సేవ టికెట్లను ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి శ్రీవారి సేవలు, దర్శనం, వసతి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

నేడు ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల‌కు అంకురార్పణ

టీటీడీ ఆధ్వర్యంలో...ఒంటిమిట్ట(Vontimitta) కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించ‌నున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం