TTD Revenue Increase: తిరుమలలో పెరిగిన శ్రీవారి ఆదాయం… ప్రోటోకాల్ రద్దుతో అన్ని విధాలుగా ప్రయోజనం
TTD Revenue Increase: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో తిరుమల శ్రీవారి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే కోడ్ అమల్లోకి రావడంతో శ్రీవారి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
TTD Revenue Increase: తిరుమలలో అన్ని రకాల ప్రోటోకాల్ protocol Darshans దర్శనాలు కొద్దివారాలుగా రద్దయ్యాయి. టీటీడీ TTDలో ఎలాంటి సిఫార్సు లేఖలను Letters అనుమతించకపోవడంతో దర్శనాలు సాఫీగా జరుగుతున్నాయి. ఏదొక ప్రోటోకాల్ అడ్డం పెట్టుకుని తిరుమలలో సామాన్యులకు నరకం చూపించే విఐపి దర్శనాలకు రెండు వారాలుగా బ్రేకులు పడ్డాయి.
ఎన్నికల షెడ్యూల్ Election Schedule వెలువడిన వెంటనే మోరల్ కోడ్ Code అమల్లోకి రావడంతో సిఫార్సులతో కూడిన దర్శనాలను నిలిపివేశారు. స్వామి వారి దర్శనానికి అన్ని రకాల సిఫార్సు లేఖల స్వీకరణ నిలిపివేశారు. ఫలితంగా సామాన్య భక్తులకు సులువుగా వేగంగా స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు.
పరీక్షలు కూడా పూర్తి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. కొండపైకి వచ్చే భక్తులకు సులభంగా స్వామివారి దర్శనం Darshan లభిస్తోంది. అదే సమయంలో స్వామి వారి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.3కోట్ల వరకు హుండీ ఆదాయం లభించేది. విఐపి దర్శనాలు రద్దు చేసిన తర్వాత ఆదాయం TTD Revenue కూడా గణనీయంగా పెరిగినట్టు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
తిరుమల కొండపై వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపి వేసిన తర్వాత టీటీడీకి 16 రోజుల్లో రూ.64 కోట్ల ఆదాయం సమకూరింది. కోడ్ లేని సమయంలో సిఫార్సు లేఖలపై అనుమతించే వీఐపీ బ్రేక్ దర్శనాలతో నిత్యం నాలుగు గంటల పాటు సాధారణ భక్తులకు నిరీక్షించాల్సి వచ్చేది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో మార్చి 16 నుంచి సిఫార్సు లేఖల స్వీకరణను టీటీడీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, న్యాయమూర్తులు వంటి ప్రొటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా దర్శనాలకు వస్తే మాత్రమే వారికి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ జారీ చేస్తున్నారు.ఇలా రోజూ కేటాయించే ప్రోటోకాల్ దర్శనాల సంఖ్య 300కు మించడం లేదు.
వీరికి అరగంట వ్యవధిలోనే బ్రేక్ దర్శనాలు పూర్తి చేస్తున్నారు. టీటీడీ సర్వదర్శనం టోకెన్లను సాధారణ భక్తులకు కేటాయిస్తోంది. క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులకు గంటలోపే స్వామివారి దర్శనం లభిస్తోంది.
మరోవైపు శ్రీవాణి ట్రస్టుకు 15 రోజుల్లో రూ.22.75 కోట్ల ఆదాయం వచ్చింది. సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఆశించే భక్తులకు ప్రత్యామ్నాయంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లను కేటాయిస్తున్నారు. ఈ సంఖ్యను టీటీడీ పెంచింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు రోజుకి ఆన్లైన్‌లో 500, ఆఫ్‌లైన్‌లో మరో 500 టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది.
నేరుగా శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాల ద్వారా జారీచేసే టికెట్ల సంఖ్యపై నియంత్రణ తొలగించారు. సిఫార్సు లేఖలకు అనుమతి లేకపోవడంతో శ్రీవాణి ట్రస్ట్ విరాళాలకు భక్తుల నుంచి డిమాండ్ పెరిగింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిత్యం 1,000 నుంచి 1,800 టికెట్లను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా మార్చి 16 నుంచి 15 రోజుల వ్యవధిలో 22,752 టికెట్లను విక్రయించడం ద్వారా టీటీడీకి రూ.22.75 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ ప్రకటించింది.
మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేసిన మొదటి 15 రోజుల్లో హుండీ ద్వారా రూ.54 కోట్ల ఆదాయం లభించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా నిలిపి వేసిన తర్వాత 16 రోజుల్లో రూ.64 కోట్ల ఆదాయం లభించింది. దీంతో మార్చిలో స్వామి వారికి మొత్తం రూ.118 కోట్ల ఆదాయం లభించినట్టైంది.
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, అధికారులు, బ్యూరోక్రాట్ల నుంచి వచ్చే సిఫార్సుల్ని కూడా టీటీడీ నిలిపివేసింది. ఎవరిని ప్రోటోకాల్ అనుమతించ వద్దని ఈవో స్పష్టం చేశారు. ఈవో తనను కూడా ఖాతరు చేయడం లేదని ఛైర్మన్ దర్శనాలు కోరే వారికి స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు దర్శనాల విషయంలో తానేమి చేయలేనని, దర‌్శనాలు కోరే వారికి భూమన చెబుతున్నారు.