Janasena Nadendla: కేసులకు భయపడం, వాలంటీర్లకు చట్టబద్దత లేదు..రూ.617కోట్ల దోపిడీ జరిగిందన్న నాదెండ్ల
Janasena Nadendla: చట్టబద్దత లేని వాలంటీర్ వ్యవస్థకు శిక్షణ Training పేరుతో ఐదేళ్లలో రూ.617 కోట్ల దోపిడీని న్యాయస్థానాల్లో నిరూపిస్తామని, కేసులకు భయపడేది లేదని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు.
Janasena Nadendla: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ PawanKalyanపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ ఘాటు స్పందించింది. కేసులకు తాము భయపడేది లేదని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏ మాత్రం చట్టబద్దత లేని వాలంటీర్ వ్యవస్థతో ఐదేళ్లలో వందలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,02,836 మంది వాలంటీర్లVoluenteers డేటా నమోదు కాలేదని... వాళ్ల పేరుతో ఏటా రూ.617 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాల చట్టంలో ఎక్కడా వాలంటీర్ అనే పేరు ఉండదని, వాలంటీరు వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడంలోనూ జగనన్న మోసం చేశాడని నాదెండ్ల మండిపడ్డారు.
వ్యక్తిగత ప్రయోజనం కోసం ప్రైవేటు ఏజెన్సీPvtAgencyకు అనుచిత లబ్ధి చేకూర్చారని, ఈ వ్యవమారంలో తామే న్యాయస్థానాల్లో నిరూపిస్తామన్నారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎవరి చేతుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు.
వాలంటీర్ వ్యవస్థ లోపాలను ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్‌పై కేసులు పెట్టారని ఆరోపించారని, వాలంటీర్లను జగన్ వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల పేరిట పక్కదారి పట్టిన సొమ్మలు, దాని వెనుకున్న వ్యక్తులపై విచారణ చేస్తామన్నారు.
'ప్రజలకు సులభతరమైన సేవ పేరుతో వాలంటీర్లను భారీగా ఏర్పాటు చేశామని చెబుతున్న వాలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్ల డేటా అసలు నమోదు కాలేదని వారున్నారా.. లేరా..? అనే దానిపై స్పష్టత లేదని వారికిస్తున్న గౌరవ వేతనం ఎవరి జేబుల్లోకి వెళ్తోందని నాదెండ్ల ప్రశ్నించారు.
వారంతా ఎవరు.. ఎక్కడున్నారు…?
ప్రతి ఏటా డేటా లేని వాలంటీర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ.617 కోట్ల గౌరవ వేతనాలు ఎవరు మింగేస్తున్నారని, అసలు వీరంతా ఎవరు.. ఎక్కడున్నారని ..?" అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
ప్రతి ఏటా డేటా నమోదు కాని వాలంటీర్ల కోసం చెల్లిస్తున్న గౌరవ వేతనం మొత్తం రూ.617 కోట్లు... అంటే నెలకు రూ.51 కోట్లు ఉందన్నారు. డేటా లేని వాలంటీర్లకు ఏ పద్ధతిలో గౌరవ వేతనాలు ఇస్తున్నారో, ఎవరికి ఇస్తున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిలో ఎవరి పాత్ర ఏమిటో ప్రజల ముందు పెట్టాలన్నారు.
‘‘వాలంటీర్ల డేటా లేని టాప్ 5 జిల్లాల వివరాలు చూస్తే తూర్పుగోదావరి 19,366, గుంటూరు 13,066, కృష్ణాలో 11,725, చిత్తూరు 11,400, విశాఖపట్నం జిల్లాల్లో 10,586 మంది వాలంటీర్ల డేటా ఇప్పటికీ కనిపించడం లేదని అసలు వాలంటీర్లు ఎవరికి రిపోర్టు చేయాలి..? వీరికి సంబంధించిన అధికారి ఎవరు అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.
వాలంటీర్లు, వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తప్పుగా మాట్లాడ లేదని, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యానించ లేదన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు అధిపతి ఎవరు.. వీరు ఎవరి ఆధ్వర్యంలో పని చేస్తున్నారు..? వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడకు వెళ్తోంది.. ఎవరికి పంపుతున్నారు.. ఎక్కడ భద్రపరుస్తున్నారు..? ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించడానికి వాలంటీర్లకు అధికారం ఎవరిచ్చారు..? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు బదులు లేదన్నారు.
ప్రభుత్వం వాలంటీర్లను భయపెట్టి, బలవంతంగా, కుట్రపూరితంగా వారి ద్వారా జనసేనానిపై కేసులు నమోదు చేయిస్తే సత్యం మరుగున పడిపోదని దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. 2023, జులైలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ మాట్లాడారని, ప్రజల ముందు మాట్లాడే ప్రతి విషయం సత్యం. పూర్తి ఆధారాలతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. వాలంటీర్ల విషయంలోనూ ప్రభుత్వ తీరును మరోసారి ఆధారాలతో మాట్లాడుతున్నామన్నారు.
చట్టబద్ధత ఉందా..?
సచివాలయాల విషయంలో ప్రభుత్వం 2023 లో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల చట్టంలో వాలంటీర్ల వ్యవస్థకు చట్టపరమైన ఎలాంటి అనుమతి లేదని ఈ చట్టం మొత్తం మీద వాలంటీర్లకు సంబంధించి ఒక్క పదం కూడా చేర్చలేదన్నారు. చట్టం వచ్చిన తర్వాతే సచివాలయ వ్యవస్థపై ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 2023లో సచివాలయాల చట్టం తీసుకొచ్చి, అది 2019 నుంచి వర్తిస్తుందని అడ్డగోలుగా సవరణ చేశారని ఈ చట్టంలో ఎక్కడ పేర్కొనబడని వాలంటీర్ల వ్యవస్థకు అసలు చట్టబద్ధత ఎక్కడుందన్నారు.
ప్రభుత్వం మొట్టమొదట ఏర్పాటు చేసిన 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,65,380 మంది వాలంటీర్లను ఉపయోగించుకోబోతున్నాం అని ప్రకటించిందని 2021లో అక్టోబరు 1వ తేదీన ప్రభుత్వ చెప్పిన లెక్క ప్రకారం 2,47,598 మంది వాలంటీర్లు ఉన్నట్లు చూపించారని 2023, సెప్టెంబరు 25వ తేదీన మరోసారి ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 2,50,985 మంది వాలంటీర్లు ఉన్నట్లు చెప్పారని, ఇటీవల గుంటూరులో ముఖ్యమంత్రి వాలంటీర్లంతా నా సైన్యం అని చెప్పారో అక్కడ చెప్పిన లెక్క ప్రకారం 2,55,461 మంది పెరిగినట్లు చూపారన్నారు.
ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీకి ప్రజాధనం ధారాదత్తం
అసలు వ్యవస్థలో ఏ అధికారికి సంబంధం లేకుండా హైదరాబాద్ లోని ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ కార్యకలాపాల కోసం వాలంటీర్లు పని చేస్తున్నారని ప్రత్యేకంగా తీసుకొచ్చిన సచివాలయాల చట్టంలోనూ ప్రస్తావించకుండా, ఏ అధికారికి అజమాయిషీ ఇవ్వకుండా వాలంటీర్ల వ్యవస్థకు రూ.1560 కోట్ల ప్రజాధనం ప్రతి ఏటా వెచ్చిస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు.
కేవలం వాలంటీర్ల శిక్షణ పేరుతో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీకి రూ.15 కోట్లను ఇస్తున్నారని ఈ సంస్థ కార్యకలాపాల మీద జనసేన పార్టీ తరఫున మాట్లాడామన్నారు. బడ్జెట్లోనూ వాలంటీర్ల కోసం వెచ్చిస్తున్న సొమ్ముకు ప్రొవిజన్ లేదని ఏ ఖాతా నుంచి చెల్లిస్తున్నది కూడా చెప్పలేదన్నారు.
ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ పేరుతో ఈ డబ్బు వెచ్చిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం దారుణమని విచ్చలవిడిగా తన ప్రాపకం కోసం నిధులు వెచ్చిస్తూ ప్రజా ఖజానాను జగనన్న ధనాగారంగా మార్చేశారని మండిపడ్డారు. సేవా కార్యక్రమాల పేరుతో జరుగుతున్న దోపిడీ చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు.