Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!-kakinada coringa wildlife sanctuary tourist places how to reach tour details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bandaru Satyaprasad HT Telugu
May 04, 2024 01:38 PM IST

Coringa Wildlife Sanctuary : ఏపీలోని కాకినాడ సమీపంలో ఉన్న కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఈ సమ్మర్ లో కోరింగ టూర్ మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

 కోరింగ అందాలు చూసేయండి
కోరింగ అందాలు చూసేయండి

Coringa Wildlife Sanctuary : ఏపీలోని అద్భుత పర్యాటక ప్రదేశాల్లో(AP Tourist Places) ఒకటి 'కోరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీ'(Coringa Wildlife Sanctuary). సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మడ అడవులు, వివిధ రకాల జంతు, వృక్ష జాతులు వీక్షించవచ్చు. ఇక్కడ చేపల్ని వేటాడే పిల్లి(Fishing Cat ), నక్క, ఈస్ట్యూరైన్ మొసలి, సముద్ర తాబేలు చూడవచ్చు. కాకినాడ బీచ్ నుంచి 22 కి.మీ దూరంలో కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఇక్కడ 35 రకాల మడ మొక్కలు(Mangrove plants), 120 జాతుల అరుదైన పక్షులు, వివిధ జాతుల వృక్షాలకు నిలయం. ఈ అభయారణ్యంలో వైట్ బ్యాక్డ్ వల్చర్, లాంగ్ బిల్డ్ రాబందు, ఆట్టర్స్, చేపలు పట్టే పిల్లి(Fishing Cat), నక్క, ఈస్ట్యూరైన్ మొసలి, సముద్ర తాబేళ్లను(Sea Turtle) చూడవచ్చు.

పడవలో ప్రయాణం

కోరింగ అభయారణ్యం(Coringa Wildlife Sanctuary)లో పక్షులను చూస్తూ, వాటి కిలకిలారావాల పాటలు వింటూ నిర్మలమైన అటవీ ప్రాంతంలో చెక్కల మీదుగా నడవవచ్చు. పడవలో(Boating) ప్రయాణిస్తూ ఒడ్డున ఉన్న పక్షులను గుర్తించడం, సుందరమైన దృశ్యాలను(Natures Beauty) ఆస్వాదిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ అభయారణ్యంలో సీగల్‌లు, ఫ్లెమింగోలు, పాండ్ హెరాన్, గ్రే కొంగ, ఇసుక పైపర్, చిన్న ఎగ్రెట్స్, రెడ్-వాటిల్ లాప్‌వింగ్, బ్లూ కింగ్‌ఫిషర్, పైడ్ కింగ్‌ఫిషర్, బ్రాహ్మిని కైట్స్, లిటిల్ కార్మోరెంట్, రీఫ్ హెరాన్, క్రో నెమలి, బ్లాక్- క్యాప్డ్ కింగ్ ఫిషర్(Kingfisher) వంటి పక్షలను చూడవచ్చు.

ఫారెస్ట్ గెస్ట్ హౌస్

కోరింగ అభయారణ్యంలో మీరు స్టే చేయాలనుకుంటే...ఫారెస్ట్ గెస్ట్ హౌస్(Forest Guest House) ఉంది. ఈ గెస్ట్ హౌస్ టారిఫ్ రూ.1,000-1,5OO. అటాచ్డ్ బాత్‌రూమ్‌లతో మూడు కాటేజీలు ఉన్నాయి. కేర్‌టేకర్ భోజనాన్ని సిద్ధం చేస్తారు. బుకింగ్, వసతి వివరాల కోసం రేంజ్ ఆఫీస్, కోరింగ అభయారణ్యం, సెల్ నెంబర్ 09440810238 సంప్రదించవచ్చు.

కోరింగ అభయారణ్యానికి ఎలా చేరుకోవాలి?(How To reach Coringa Wildlife Sanctuary)

  • రాజమండ్రి(Rajahmundry Airport) సమీప విమానాశ్రయం
  • కోరింగ అభయారణ్యానికి 20 కిలోమీటర్ల దూరంలో కాకినాడ సమీప రైల్వే స్టేషన్(Kakinada Railway Station)
  • కోరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కాకినాడ నుంచి 20 కి.మీ, రాజమండ్రి నుంచి 70 కి.మీ దూరంలో ఉంది. కాకినాడ నుంచి స్థానిక క్యాబ్‌లు, బస్సులు... అభయారణ్యం నుంచి వెళ్లడానికి, తిరిగి రావడానికి అందుబాటులో ఉన్నాయి.

కోరింగ సందర్శనకు ఉత్తమ సమయం - అక్టోబర్- మే నెలల మధ్యలో ఈ అభయారణ్యం చూడడానికి ఉత్తమ సమయం. ప్రతి రోజు ఉదయం 9:00 గంటల నుంచి 5:00 వరకు సందర్శనకు అనుమతిస్తారు. మంగళవారాల్లో సాంక్చురీ మూసివేస్తారు.

కోరింగ సమీపంలో సందర్శనీయ ప్రదేశాలు(Coringa near tourist places)

  • ద్రాక్షారామం - తూర్పు చాళుక్యుల రాజవంశానికి చెందిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి.
  • బిక్కవోలు - క్రీ.శ. 9, 10వ శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యులు నిర్మించిన శివుని ఆలయం.
  • అన్నవరం(Annavaram) - అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, కొండల పక్కనే ప్రవహించే పంపా నది ఎంతో సుందరమైన ప్రదేశాలు.
  • రాజమండ్రి - తెలుగు భాష వ్యాకరణం, లిపి రాజమండ్రిలో పరిణామం చెందింది. ఈ నగరాన్ని వ్యవహారిక తెలుగు జన్మస్థలంగా భావిస్తారు.
  • పాపికొండలు బోటింగ్(Papikondalu) - రాజమండరి నుంచి గోదావరి నదిలో పాపికొండలకు బోట్ క్రూజ్ చేయడం కచ్చితంగా మీ ప్రయాణంలో యాడ్ చేసుకోండి.
  • రాయలి - గోదావరి వశిష్ట, గౌతమి ఉపనదుల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్లు, అరటి తోటల మధ్య ఉన్న సుందరమైన గ్రామం రాయలి.
  • ఉప్పాడ బీచ్(Uppda Beach) - కాకినాడ ఉప్పాడ బీచ్ ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ బీచ్ వంపుతిరిగిన కాంటినెంటల్ షెల్ఫ్‌ను కలిగి ఉంది. కోరమాండల్ తీరంలో పొడవైన వాటిలో బీచ్ లలో ఇది ఒకటి.
  • పిఠాపురం(Pithapuram) - పిఠాపురంలోని 10వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధమైన త్రిపురాంతకం దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ సముదాయాల్లో పురుహూతికా దేవి, కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి విగ్రహాలు ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం