Hyderabad Srisailam Tour : హైదరాబాద్ టు శ్రీశైలం, నాగార్జున సాగర్ ట్రిప్, నదిలో బోటింగ్- ప్యాకేజీ పూర్తి వివరాలు ఇలా!
Hyderabad Srisailam Tour : తెలంగాణ టూరిజం హైదరాబాద్, శ్రీశైలం, నాగార్జున సాగర్ రోడ్ కమ్ రివర్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. రెండ్రోజుల టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Srisailam Tour : ఈ నెలలోనే సమ్మర్ హాలీడేస్(Summer Holidays) ఇస్తున్నారు. పిల్లల్ని అలా ఎక్కడికైనా ట్రిప్ తీసుకెళ్లాలని అనుకుంటే తెలంగాణ టూరిజం(Telangala Tourism) అందిస్తున్న హైదరాబాద్ నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ రోడ్ కమ్ రివర్ క్రూయిజ్ టూర్ చక్కటి ఆలోచన. నదిలో బోటింగ్ ఆహ్లాదం కలిగిస్తుంది.
హైదరాబాద్-శ్రీశైలం టూర్ ప్యాకేజీ
తెలంగాణ టూరిజం... హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల - హైదరాబాద్ (రోడ్ కమ్ రివర్ క్రూయిజ్ టూర్)(Hyderabad-Srisailam Tour Package) ప్యాకేజీ అందిస్తుంది. నాన్ AC కోచ్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి శనివారం ఉదయం 09:00 మొదలై రెండో రోజు రాత్రి 09:00 గంటలకు ఇంటికి చేరుకుంటారు. పెద్దలకు రూ.4499, పిల్లలకు రూ.3600 వ్యయంలో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ పై పూర్తి వివరాల కోసం 9848540371 ఈ నెంబర్ ను సంప్రదించవచ్చు.
టూర్ వివరాలు ఇలా (Tour Package)
- డే 1 - శనివారం ఉదంయ 09:00 గంటలకు నాన్ AC బస్సులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం, రాత్రికి శ్రీశైలంలో బస
- డే 2 - ఉదయం 09:00 శ్రీశైలం నుంచి సోమశిల వరకు క్రూజ్(బోట్) ప్రయాణం, సాయంత్రం 05.00 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్‌కు బస్సులో తిరుగుప్రయాణం. రాత్రి 9.00 హైదరాబాద్ చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో నాన్ AC రవాణా, శ్రీశైలంలో రాత్రి బస (నాన్ AC వసతి, ట్విన్ షేరింగ్), నాన్ AC బోట్ ఛార్జీలు, పడవలో వెజ్ భోజనం కల్పిస్తారు.
హైదరాబాద్-శ్రీశైలం-నాగార్జున సాగర్ టూర్ ప్యాకేజీ
శ్రీశైలం, నాగార్జున సాగర్ కవర్ చేసేలా తెలంగాణ టూరిజం మరో ప్యాకేజీ అందుబాటులో ఉంది. హైదరాబాద్-శ్రీశైలం-నాగార్జునసాగర్ - హైదరాబాద్(Hyderabad Srisailam Nagarjuna Sagar Tour Package) (రోడ్ కమ్ రివర్ క్రూయిజ్ టూర్). ఈ ప్యాకేజీలో శ్రీశైలం ఆలయం, సాక్షి గణపతి ఆలయం, శ్రీశైలం ఆనకట్ట ప్రదేశం, పాతాళగంగ, ఫరహాబాద్, నాగార్జునసాగర్ డ్యామ్ ప్రదేశాలు కవర్ చేస్తారు. పెద్దలకు రూ.3050, పిల్లలకు రూ.2450 ఛార్జ్ చేస్తారు.
- డే-1 - మధ్యాహ్నం 1:30 యాత్రి నివాస్, ప్యారడైజ్ దగ్గర, సికింద్రాబాద్(ఫోన్: 9848126947) టూర్ మొదలవుతుంది. మధ్యాహ్నం 1.45 టూరిజం ప్లాజా, బేగంపేట్(9848306435), 2 గంటలకు ఎన్ఎస్ఎఫ్ శంకర్ భవన్, ఎదురుగా పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్‌బాగ్ (040-29801040) నుంచి నాన్ AC హైటెక్ కోచ్ బస్సు శ్రీశైలానికి బయలుదేరుతుంది. రాత్రి 7.30 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలంలో రాత్రి బస ఉంటుంది.
- డే- 2- ఉదయం 10 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు క్రూజ్ (బోట్)లో బయలుదేరతారు. పడవలో వెజ్ లంచ్ అందిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు నాగార్జునసాగర్ చేరుకుంటారు. నాన్ ఏసీ హైటెక్ కోచ్‌లో నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి 11.00 హైదరాబాద్ చేరుకుంటారు.
ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం(Hyderabad to Srisailam), నాగార్జునసాగర్, తిరిగి హైదరాబాద్‌కు నాన్-ఏసీ హైటెక్ కోచ్‌లో ప్రయాణం ఉంటుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు బోట్ ప్రయాణం ఉంటుంది. ఈ ప్యాకేజీలో టీ, క్రూజ్‌లో మధ్యాహ్న భోజనం, శ్రీశైలంలో నాన్ ఏసీ వసతి అందిస్తారు. రాత్రి భోజనం, అల్పాహారం, దర్శనం ఇతర ఖర్చులను పర్యాటకులు భరించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం