Pawan Kalyan Tweet: TRS లోకి దాసోజు శ్రవణ్… పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్-janasena chief pawan kalyan intresting tweet on dasoju sravan joins into trs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan Tweet: Trs లోకి దాసోజు శ్రవణ్… పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Pawan Kalyan Tweet: TRS లోకి దాసోజు శ్రవణ్… పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

HT Telugu Desk HT Telugu
Oct 21, 2022 08:00 PM IST

pawan tweet on dasoju sravan: బీజేపీ నేత దాసోజు శ్రవణ్… తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే ఆయన చేరికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

దాసోజు శ్రవణ్ చేరికపై పవన్ ట్వీట్
దాసోజు శ్రవణ్ చేరికపై పవన్ ట్వీట్ (twitter)

dasoju sravan joins into trs: తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు బైపోల్ నేపథ్యంలో... అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపింది. ఒక్కసారిగా కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చే పనిలో పడింది. ఫలితంగా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. బూర నర్సయ్య గౌడ్ రాజీనామాతో షాక్ లో ఉన్న గులాబీ నాయకత్వం.. ఇద్దరు కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది.

శుక్రవారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ గులాబీ గూటికి చేరారు. కేసీఆర్ తోనే తమ ప్రయాణమని స్పష్టం చేశారు. ఇక ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నేతలు వెల్ కమ్ చేస్తూ ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయటం... అత్యంత ఆసక్తిని రేపుతోంది.

'దాసోజు శ్రవణ్ దూరదృష్టి కలిగిన నేత. ఆయన పార్టీ మార్పు నేపథ్యంలో అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో శ్రవణ్ ప్రజారాజ్యం పార్టీ నుండి టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో ఉన్న తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడతారని అన్నారు. ఇప్పుడు శ్రవణ్ స్థాయి ఏంటో అందరికి అర్ధమవుతుంది' అని జనసేనాని పవన్ ట్వీట్ చేశారు. దాసోజు శ్రవణ్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోస్టు పార్టీ అధికార పార్టీలో పోస్టు చేశారు.

పవన్ కల్యాణ్ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇన్ని రోజులుగా బీజేపీతో కలిసి పని చేసిన పవన్.... ఓ పార్టీ నేత బయటికి వస్తే అభినందనలు తెలిపటమేంటనే చర్చ మొదలైంది. అయితే ఈ మధ్యే బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్... చంద్రబాబుతో కలవటం టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రవణ్ పార్టీ మారితే ట్వీట్ చేయడంతో... ఆయన బీజేపీ విషయంలో ఓ క్లారిటీతోనే ఉన్నారనే చర్చ మరింత బలపడే అవకాశం ఉంది. ఇక శ్రవణ్ విషయాన్ని ఈ ఒక్కసారే కాదు... అనేక సందర్భాల్లోనూ అనేక వేదికలపై ప్రస్తావించారు జనసేనాని.

నిజానికి దాసోజు శ్రవణ్... ప్రజారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. సమైక్యవాదానికి అనుకూలంగా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవటంతో శ్రవణ్ రాజీనామా చేసి బయటికి వచ్చారు. అనంతరం కేసీఆర్ తో వెంట నడిచారు. టీఆర్ఎస్ పార్టీలో అత్యంక కీలక నేతగా ఎదిగారు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వా కాంగ్రెస్ లో చేరిన ఆయన... కొద్ది రోజుల కిందటే బీజేపీలోకి వచ్చారు. ఇంతలోనే సొంత గూటికి చేరారు.

Whats_app_banner